ఐఫోన్‌ల తయారీ ఇక హైదరాబాద్‌లోనే ..?

Posted By:

తెలంగాణ రాష్ట్రంలో మొబైల్ ఫోన్‌ల తయారీ హబ్ ఏర్పాటు కానుంది. ఈ మొబైల్ తయారీ పరిశ్రమల ఏర్పాటు ద్వారా సుమారు రెండు లక్షల మందికి ఉపాధి దక్కుతుందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు వెల్లడించారు. గురువారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్ టెక్నాలజీ గ్రూప్ ప్రెసిడెంట్ కాల్విన్ చిన్, ఫిహ్ మొబైల్ లిమిటెడ్ ఛైర్మన్ విన్సెంట్ టాంగ్‌లు సమావేశమయ్యారు.

ఐఫోన్‌ల తయారీ ఇక హైదరాబాద్‌లోనే ..?

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో తమ మొబైల్ తయారీ పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ఈ రెండు కంపెనీల ప్రతినిధులు సుముఖత వ్యక్తం చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటికే సెల్‌కాన్, కార్బన్, మైక్రోమాక్స్ వంటి కంపెనీలు రాష్ట్రంలో మొబైల్ తయారీ యూనిట్‌లను ఏర్పాటు చేసేందుకు సుముఖంగా ఉన్నాయి.

(చదవండి: ఫోన్ ఎందుకు హ్యాంగ్ అవుతుంది..?)

ఐ-ఫోన్ల తయారీ ఇక హైదరాబాద్‌లోనే.?

ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఇష్టపడే యాపిల్ ఐఫోన్లు ఇక తెలంగాణలోనే తయారయ్యే అవకాశముంది. ఇందుకు కారణం ఐఫోన్‌లను పెద్ద మొత్తంలో తయారు చేసి యాపిల్ సంస్థకు సరఫరా చేసిది ఫాక్స్‌కాన్ కంపెనీనే కాబట్టి. భారత్‌లో తయారీ కారణంగా చాలా తక్కువ ధరలకే ఫోన్‌లు లభ్యమయ్యే అవకాశముందని విశ్లేషకులు అంటున్నారు.

English summary
Mobile Manufacturing Hub to be Set Up in Telengana. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting