మొబైల్ నెట్‌వర్క్ ఆపరేటర్లు (ఇండియా)

Posted By:

కమ్యూనికేషన్ అవసరాలు రోజు రోజుకు పెరుగుతున్న నేపధ్యంలో మొబైల్ ఫోన్‌లకు అనూహ్య రీతిలో డిమాండ్ నెలకుంది. ఇండియా వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వీటి వినియోగం తారా స్థాయికి చేరుకుంటోంది. 2014నాటికి దేశంలో మొబైల్ ఫోన్లకు డిమాండ్ 25 కోట్లకు చేరుకునే అవకాశముందని ఇండియన్ సెల్యులర్ అసోసియేషన్(ఐసీఏ) గణంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ మొబైళ్ల విలువ రూ.54,000 కోట్లు ఉంటుందని ఐసీఏ విశ్లేషించినట్లు కమ్యూనికేషన్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి మిలింద్ దేవ్‌రా గతేడాది రాజ్యసభలో లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో పేర్కొన్నారు.

ఆ నిగనిగ అందాలకు అంపైర్లు ‘క్లీన్‌బౌల్డ్'

దేశీయంగా మొబైల్ వినియోగారుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో మొబైల్ నెట్ వర్క్ ఆపరేటింగ్ సర్వీసులు విస్తరిస్తున్నాయి. వినియోగదారులను ఆకట్టుకునే క్రమంలో కొత్త ఆఫర్ లను ప్రవేశపెడుతున్నాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఇండియాలోని ప్రముఖ నెట్‌వర్క్ ఆపరేటర్ల జాబితాను మీముందుంచుతున్నాం....

భవిష్యత్ టెక్నాలజీకి సంబంధించి కొత్త గాడ్జెట్‌లను చూడాలనుకుంటున్నారా..? క్లిక్ చేయండి:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మొబైల్ నెట్‌వర్క్ ఆపరేటర్లు (ఇండియా)

ఎయిర్‌టెల్ (Airtel):

ప్రపంచంలోనే 5వ పెద్ద మొబైల్ ఆపరేటర్‌గా ఎయిర్‌టెల్ అవతరించింది. దేశయంగా జీఎస్ఎమ్, ఎడ్జ్, హెచ్‌ఎస్‌పీఏ సేవలను అందిస్తోంది. 2011 ముగింపు నాటికి ఎయిర్‌టెల్ దేశవ్యాప్త వినియోగదారుల సంఖ్య 175.65 మిలియన్లు. ఈ సంస్థను జూలై 7, 1995లో స్థాపించారు. ప్రధాన కార్యాలయం కొత్తఢిల్లీలో ఉంది. తాజా 3జీ ఇంకా 4జీ సేవలను ఎయిర్‌టెల్ అందిస్తోంది.

మొబైల్ నెట్‌వర్క్ ఆపరేటర్లు (ఇండియా)

రిలయన్స్ కమ్యూనికేషన్స్ (Reliance Communications):

ప్రపంచవ్యాప్తంగా 16వ అతిపెద్ద మొబైల్ ఫోన్ ఆపరేటర్‌గా రిలయన్స్ కమ్యూనికేషన్స్ గుర్తింపుతెచ్చుకుంది. ఇండియాలో రెండవ అతిపెద్ద మొబైల్ ఆపరేటర్ గా రిలయన్స్ ఎదిగింది. 2011 చివరి నాటికి రిలయన్స్ దేశవ్యాప్త వినియోగదారుల సంఖ్య 148.11 మిలియన్లు. రిలయన్స్ కమ్యూనికేషన్స్‌ను దీరూభాయ్ అంబానీ 2004లో నెలకొల్పారు. సంస్థ ప్రధాన కార్యాలయం మహారాష్ట్రాలోని నావీ ముంబైలో ఏర్పాటు చేయటం జరిగింగి.

మొబైల్ నెట్‌వర్క్ ఆపరేటర్లు (ఇండియా)

వొడాఫోన్ (Vodafone):

ఇండియాలో మూడవ అతిపెద్ద మొబైల్ నెట్‌వర్క్ ఆపరేటర్‌గా వొడాఫోన్ ఇండియా గుర్తింపు పొందింది. 2011 నవంబర్ నాటికి వినియోగదారుల సంఖ్య 146.84 మిలియన్లు.

మొబైల్ నెట్‌వర్క్ ఆపరేటర్లు (ఇండియా)

ఐడియా (Idea):

ఇండియాలో అతిపెద్ద టెలికమ్యూనికేషన్ సర్వీస్‌గా అవతరించి ఐడియాకు 2011 ముగింపు నాటికి 106.38 మిలియన్లు మంది వినియోగదారులున్నారు. జీఎస్ఎమ్, ఎడ్జ్ ఇంకా హెచ్‌ఎస్‌పీఏ సేవలను ఇడియా అందిస్తోంది. సంస్థను 1995లో స్థాపించారు. ప్రధాన కార్యాలయం ముంబయ్‌లో ఉంది.

మొబైల్ నెట్‌వర్క్ ఆపరేటర్లు (ఇండియా)

బీఎస్ఎన్ఎల్ (BSNL):

ప్రభుత్వ రంగ టెలికమ్యూనికేషన్స్ సంస్థ బీఎస్ఎన్ఎల్ దేశీయంగా 5వ అతిపెద్ద టెలికామ్ ఆపరేటర్‌గా అవతరించింది. 2011 ముగింపు నాటికి బీఎస్ఎన్ఎల్ వినియోగదారుల సంఖ్య 92.56 మిలియన్లు. జీఎస్ఎమ్, ఎడ్జ్, హెచ్ఎస్‌డీపీఏ, సీడీఎమ్ఏ వన్, ఈవీడీవో, వైమాక్స్, వై-ఫై వంటి సర్వీస్‌లను బీఎస్ఎన్ఎల్ అందిస్తోంది. సంస్థ ప్రధాన కార్యాలయంలో కొత్తఢిల్లీలో ఉంది.

మొబైల్ నెట్‌వర్క్ ఆపరేటర్లు (ఇండియా)

ఎయిర్‌సెల్ (Aircel):

దేశీయ రంగ టెలికమ్యూనికేషన్స్ విభాగంలో ఎయిర్‌సెల్ 6వ స్థానాన్ని ఆక్రమించింది. 2011 ముగింపు నాటికి ఎయిర్‌సెల్ దేశవ్యాప్త వినియోగదారుల సంఖ్య 61.64 మిలియన్లు, సంస్థ ప్రధాన కార్యాలయం చెన్నైలో ఉంది.

మొబైల్ నెట్‌వర్క్ ఆపరేటర్లు (ఇండియా)

టాటా డొకొమో (TATA DoCoMo):

2010 చివరి నాటికి టాటా డొకొమో యూజర్లు సంఖ్య 42.34 మిలియన్లు.

 

మొబైల్ నెట్‌వర్క్ ఆపరేటర్లు (ఇండియా)

యూనినార్ (Uninor):

2011ముగింపు నాటికి యూనినార్ వినియోగదారుల సంఖ్య 36.30 మిలియన్లు. జీఎస్ఎమ్ ఇంకా ఎడ్జ్ సర్వీస్‌లను ఈ కంపెనీ అందిస్తోంది. 2009లో స్థాపించారు.

మొబైల్ నెట్‌వర్క్ ఆపరేటర్లు (ఇండియా)

ఎంటీఎస్ (MTS):

2011 ముగింపు నాటికి ఎంటీఎస్ వినియోగదారుల సంఖ్య 16 మిలియన్లు. సీడీఎమ్ఏ, ఈవీడీవో సర్వీస్‌లను ఎంటీఎస్ దేశీయంగా అందిస్తోంది. సంస్థ ప్రధాన కార్యాలయం కొత్తఢిల్లీలో ఉంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot