రద్దు దిశగా మొబైల్ నంబర్ పోర్టబులిటీ, యూజర్లకు కష్టాలు తప్పవు !

|

దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది మొబైల్ యూజర్లకు మొబైల్ నంబర్ పోర్టబిలిటీ అనేది ఓ వరం లాంటిదనే చెప్పవచ్చు. టెలికాం ఆపరేటర్ మారినా.. నంబర్ మారకుండా ఉండేదుకు దీని ద్వారా ఇతర నెట్ వర్క్ లకు వెళ్లేందుకు దీని ద్వారా అవకాశం కలుగుతుంది. అయితే మొబైల్ నంబర్ మార్చుకోవాల్సిన అవసరం లేకుండా ఓ టెలీకం కంపెనీ నుంచి మరో కంపెనీలోకి మారడం ఇకపై అంత సులభంగా జరిగే సూచనలు కనిపించడంలేదు. మొబైల్ నంబర్ పోర్టబులిటీ (ఎంఎన్‌పీ) సేవలు అందిస్తున్న రెండు కంపెనీలు వచ్చే ఏడాది నుంచి తమ సేవలు నిలిపివేస్తామని ప్రకంటిచినట్లుగా తెలుస్తోంది.

 

వన్‌ప్లస్‌కు దడపుట్టించిన షియోమి,Mi 8 రికార్డు అమ్మకాలువన్‌ప్లస్‌కు దడపుట్టించిన షియోమి,Mi 8 రికార్డు అమ్మకాలు

ఎకనమిక్ టైమ్స్ పత్రిక కథనం ప్రకారం..

ఎకనమిక్ టైమ్స్ పత్రిక కథనం ప్రకారం..

ఎకనమిక్ టైమ్స్ పత్రిక కథనం ప్రకారం.. ఈ మొబైల్ నంబర్ పోర్టబిలిటీ సేవలు అందించే ఎంఎన్‌పీ ఇంటర్‌కనెక్షన్ టెలికాం సొల్యూషన్స్, సినివర్స్ టెక్నాలజీస్ సంస్థలు ఈ మేరకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్‌కు ఓ లేఖ రాశాయి.

పోర్టింగ్ ఫీజు

పోర్టింగ్ ఫీజు

పోర్టింగ్ ఫీజును భారీగా తగ్గించడం వల్ల ఇక తాము సేవలను కొనసాగించడం కుదరదని ఆ సంస్థలు స్పష్టంచేశాయి. కాగా మనదేశంలో ఇంటర్ కనెక్షన్ టెలీకం సొల్యూషన్స్, సినివెర్స్ టెక్నాలజీస్ సంస్థలు ఎమ్ఎన్‌పీ సేవలు అందిస్తున్నాయి.

రూ.19 నుంచి రూ.4 వరకు
 

రూ.19 నుంచి రూ.4 వరకు

ఈ ఏడాది జనవరిలో ప్రభుత్వం ఎమ్ఎన్‌పీ ఫీజులను రూ.19 నుంచి రూ.4 వరకు 80 శాతం మేర తగ్గించింది. దీనివల్ల తాము ప్రతిరోజూ నష్టాలను ఎదుర్కోవలసి వస్తోందని... వచ్చే ఏడాది మార్చి చివరి నాటికి తమ లైసెన్స్ ముగియగానే ఎంఎన్‌పీ సేవలు నిలిపివేస్తామని ఈ రెండు కంపెనీలు చెబుతున్నాయి.

అన్నట్టుగానే సేవలు నిలిపివేస్తే..

అన్నట్టుగానే సేవలు నిలిపివేస్తే..

ఒకవేళ ఈ కంపెనీలు అన్నట్టుగానే సేవలు నిలిపివేస్తే... వినియోగదారులు తమకు సిగ్నల్ సరిగా రావడం లేదనీ, ఫోన్‌బిల్ భరించలేకపోతున్నామని చెబుతూ వేరే కంపెనీలకు మారడం అంత సులువు కాదు.

గడువులోగా..

గడువులోగా..

ఒకవేళ గడువులోగా సమస్య పరిష్కారం కాకపోతే ప్రభుత్వం ఎంఎన్‌పీ కంపెనీలను మార్చే అవకాశం ఉందని కూడా టెలికం అధికారి పేర్కొన్నారు.

దేశంలో 117 కోట్ల మొబైల్ ఫోన్ సబ్‌స్క్రిప్షన్స్

దేశంలో 117 కోట్ల మొబైల్ ఫోన్ సబ్‌స్క్రిప్షన్స్

ప్రస్తుతం దేశంలో 117 కోట్ల మొబైల్ ఫోన్ సబ్‌స్క్రిప్షన్స్ ఉన్నట్లు ట్రాయ్ వెల్లడించింది. కొత్త కనెక్షన్ల విషయంలో నెలవారీగా 2.24 శాతం వృద్ధి రేటు కనిపించడం విశేషం. అంటే దాదాపు దేశ జనాభాలో 92.84 శాతం మంది మొబైల్ కనెక్షన్లు కలిగి ఉన్నారు.

ఎంఎన్‌పీ విధానం

ఎంఎన్‌పీ విధానం

వినియోగదారులకు రక్షణ కల్పించేందుకు, కంపెనీలు నాణ్యమైన సేవలు అందించేలా ప్రభుత్వం ఎంఎన్‌పీ విధానం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.

జియో దెబ్బ

జియో దెబ్బ

జియో రంగప్రవేశం, రిలయన్స్ కమ్యూనికేషన్స్, టాటా టెలీసర్వీసెస్, ఎయిర్‌సెల్, టెలీనార్ ఇండియా తదితర కంపెనీలు మూతపడడంతో నెలవారీ ఎంఎన్‌పీ రిక్వెస్టుల సంఖ్య ఇటీవల మూడు రెట్లకు పైగా పెరిగింది.

వినియోగదారులను నిలుపుకునేందుకు..

వినియోగదారులను నిలుపుకునేందుకు..

దేశంలో చాలా కాలం నుంచి ఉన్న భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఇండియా, ఐడియా సెల్యూలార్ తదితర కంపెనీలు తమ వినియోగదారులను నిలుపుకునేందుకు టారిఫ్‌లు భారీగా తగ్గిస్తున్నాయి.

Best Mobiles in India

English summary
Mobile Number Portability to stop working from next year: Reports More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X