మొబైల్ నెంబర్ పోర్టబులిటీ ఇక మరింత సులభతరం!

దేశవ్యాప్తంగా పారదర్శకతతో పాటు సౌకర్యవంతమైన టెలికం ఇకో సిస్టంను నెలకొల్పటంలో మొబైల్ నెంబర్ పోర్టబులిటీ విధానం కీలక పాత్ర పోషిస్తోన్న విషయం తెలిసిందే. మొబైల్ నెంబర్ పోర్టబులిటీ సౌకర్యంతో యూజర్ తన మొబైల్ నెంబర్ మార్చకుండానే వేరొక నెట్‌వర్క్‌లోకి మారిపోవచ్చు.

Read More : రెడ్‌మి నోట్ 4 పేలుడుకు కారణం తెలిసింది

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

దేశంలో ఎక్కడికి వెళ్లినా మీ నంబర్ మీకే..

దేశంలో ఏ ప్రాంతానికి బదిలీ అయినా మీ మొబైల్ నెంబర్ మీతోనే ఉంటుంది. ఉదాహరణకు మీరు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి షిప్ట్ అయ్యారు. మొబైల్ నెంబర్ పోర్టబులిటీ ద్వారా మీరు హైదరాబాద్‌లో వినియోగించిన మొబైల్ నెంబర్ ద్వారానే ఢిల్లీలో కూడా కాల్స్ చేసుకోవచ్చు.

తొలినాళ్లలో రాష్ట్రం వరకే పరిమితం

తొలినాళ్లలో మొబైల్ నెంబర్ పోర్టబులిటీ అనేది రాష్ట్రం వరకు మాత్రమే పరిమితమై ఉండేది. ఆ తరువాత దేశవ్యాప్త మొబైల్ నెంబర్ పోర్టబులిటీ విధానాన్ని టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అందుబాటులోకి తీసుకువచ్చింది.

కొత్త నిబంధనలతో ట్రాయ్..

ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఎంఎన్‌పీ నిబంధనలు మొబైల్ యూజర్లకు కష్టతరంగా ఉండటంతో పాటు బోలేడంత సమయాన్ని వృధా చేసేలా ఉండటంతో వీటిని మరింత సులభతరం చేసేందుకు ట్రాయ్ కసరత్తులు చేస్తోంది.

ఇప్పటి వరకు 40% ఎంఎన్‌‌పీ రిక్వెస్ట్‌లు రిజెక్ట్ అయ్యాయి..

ట్రాయ్ లెక్కల ప్రకారం ఇప్పటి వరకు నమోదైన ఎంఎన్‌‌పీ రిక్వెస్ట్‌లలో 40% అభ్యర్థనలు టెక్నికల్ లోపం కారణంగా తిరస్కరించబడ్డాయట. వీటిలో ఎక్కువ మొత్తం యునిక్ పోర్టింగ్ కోడ్ (యూపీసీ) మిస్ మ్యాచ్ అవటం కారణంగా రిజక్ట్ అయ్యాయని ట్రాయ్ చెబుతోంది. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని ట్రాయ్ అందుబాటులోకి తీసుకురాబోతోన్న నూతన ప్రపోజల్‌లో భాగంగా యునిక్ పోర్టింగ్ కోడ్ మ్యాచింగ్ అనే అటోమెటిక్‌గా జరిగిపోతుంది.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రొసీజర్‌..

ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రొసీజర్‌ను ఓ సారి పరిశీలించినట్లయితే... మీరు ఎయిర్‌టెల్ నుంచి జియోకు పోర్ట్ అవుతున్నారనుకుందాం, ఈ క్రమంలో మీరు మొబైల్ నెంబర్ పోర్టుబులిటీకి అప్లై చేసినపుడు మీ ప్రస్తుత ఆపరేటర్ అయిన ఎయిర్‌టెల్ 8 అంకెల యునిక్ పోర్టింగ్ కోడ్‌ను ఎస్ఎంఎస్ రూపంలో మీ మొబైల్ నెంబర్‌కు పంపుతుంది. ఈ కోడ్‌ను మీరు మీ రిసీవింగ్ ఆపరేటర్ అయిన అయిన జియోకు సబ్మిట్ చేయవల్సి ఉంటుంది. ఈ క్రమంలో మీరు ఆ కోడ్‌ను మాన్యువల్‌గా ఎంటర్ చేయవల్సి ఉంటుంది. ఇలా చేయటం చాల మందికి కుదరకపోవటంతో ఆ ఎంఎన్‌‌పీ రిక్వెస్ట్ రిజక్ట్ కాబోతోంది.

కొత్త రూల్ ఎలా ఉంటుందంటే..?

ట్రాయ్ తీసుకువచ్చిన కొత్త ప్రపోజల్‌లో భాగంగా డోనార్ ఆపరేటర్ 8 అంకెల యునిక్ పోర్టింగ్ కోడ్‌ను ఇప్పుడు నేరుగా ఎంఎన్‌పీ క్లియరింగ్ హౌస్‌కు పంపాల్సి ఉంటుంది. పోర్టింగ్ సమయంలో రిసీవింగ్ ఆపరేటర్ ఎంఎన్‌పీ క్లియరింగ్ హౌస్‌కు ఓ రిక్వెస్ట్ పంపటం ద్వారా యునిక్ పోర్టింగ్ కోడ్‌ ఆటోమెటిక్‌గా వెరిఫై కాబడుతుంది. యునిక్ పోర్టింగ్ కోడ్‌తో ఇతర వివరాలు కూడా ఎంఎన్‌పీ క్లియరింగ్ హౌస్‌కు అందుతాయి. తాజా సవరణల్లో భాగంగా 90 రోజుల ఎంఎన్‌పీ లాక్-ఇన్ పిరియడ్‌ను కూడా తొలగించేందుకు ట్రాయ్ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Mobile Number Portability Will Get Easier, Thanks To TRAI’s New Proposal. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot