మీరు మీ మొబైల్ నెంబరు మారకుండా కొత్త నెట్‌వర్క్‌కు మారేందుకు రెడీగా ఉన్నారా..అయితే దానికోసం మీరు ఇకపై నాలుగు రూపాయలు చెల్లిస్తే చాలు..ఇప్పటిదాకా ఉన్న 19 రూపాయలను తగ్గించి 4 రూపాయలకు పోర్టు సేవలు అందించాలని ట్రాయ్ ప్రతిపాదించింది.
Jioలోకి మారదామనుకుంటున్నారా..?
2015 జులై 3 నుంచి ఎంఎన్‌పీ దరఖాస్తుల సంఖ్య భారీగా పెరిగిందని, ఈ నేపథ్యంలో ఇంత ఛార్జీ ఎక్కువగా ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఈ నేపధ్యంలో మొబైల్ నెంబరు పోర్టబులిటీ (ఎంఎన్‌పీ) ఛార్జీలను 80 శాతం తగ్గించాలని ట్రాయ్ ప్రతిపాదించింది. దీనిపై ఈనెల 29 వరకు తమ అభిప్రాయాలను ఎవరైనా తెలుపవచ్చ ట్రాయ్ తెలిపింది. పోర్టుకు ఎలా మారాలో తెలుసుకుందాం.
మీకు, ఈ Ports గురించి తెలుసా..?
పాయింట్ 1
మీ మొబైల్ నెంబర్ నుంచి పోర్ట్ (port) అని టైప్ చేసి కొంత స్పేస్ ఇచ్చి బ్రాకెట్లో మీ మొబైట్ నెంబర్‌ని జత చేసి 1900కి ఎస్ఎంఎస్ చేయాల్సి ఉంటుంది. కొన్ని సెకన్ల వ్యవధిలోనే ఎనిమిది అంకెల యూనిక్ పోర్టింగ్ కోడ్ మీ మొబైల్‌కు సందేశం రూపంలో అందుతుంది.
మీ సమీపంలోని స్టోర్ కెళ్లి
ఈ కోడ్ ఆధారంగా మీ సమీపంలోని సంబంధిత స్టోర్‌ను సంప్రదించి కావాల్సిన అప్లికేషన్‌లను పూరించాల్సి ఉంటుంది.
సిమ్ యాక్టివేషన్ ప్రక్రియలో భాగంగా..
సిమ్ యాక్టివేషన్ ప్రక్రియలో భాగంగా మీ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోతో పాటు ఇతర ధృవీకరణ ప్రతాలను కంపెనీ ప్రతినిధులకు సమర్పించాల్సి ఉంది.
సిమ్ కార్డ్ మీకు అందుతుంది
ఈ ప్రక్రియ పూర్తి అయిన వెంటనే సిమ్ కార్డ్ మీకు అందుతుంది. సిమ్ యాక్టివేట్ అయిన వెంటనే మీరు ఇప్పటికే వాడుతున్న నంబర్ నెట్‌వర్క్ కట్ అయిపోతుంది.
సిమ్ యాక్టివ్ అయిన వెంటనే
ఆ తర్వాత మీరు చేరాలనుకున్న కొత్త నెట్ వర్క్ లోకి మీరు మారిపోతారు. సిమ్ యాక్టివ్ అయిన వెంటనే కంపెనీ నుంచి మీకు కాల్ వస్తుంది. దానికి మీరు మీ వివరాలతో కూడిన సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది.
Gizbot ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి.Subscribe to Telugu Gizbot.