ఇకపై మొబైల్ ఫోన్ బిల్లుల బాదుడు షురూ !

Written By:

దేశీయ టెలికాం మార్కెట్లో విప్లవాత్మక పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయి. జియో రాకతో దేశీయ టెలికాం పెను కుదుపులకు లోనయిన సంగతి తెలిసిందే. అయితే ఇకపై వినియోగదారుల జేబులకు చిల్లులు పడనున్నాయి. కాగా గత ఆరునెలల్లో సగటు నెలవారీ మొబైల్ బిల్లుల్లో 30నుంచి 40శాతం తగ్గిందని తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. అయితే భవిష్యత్తులో కూడా ఇదే ధోరణి ఉంటుందే అనే దానిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రధానంగా మొబైల్‌ వినియోగదారులు ఆశించిన ధరల క్షీణతను పొందలేరని మార్కెట్‌వర్గాలు అంచనా వేశాయి. టెలికాం కంపెనీల ఆదాయ, మార్జిన్ల అధిక ఒత్తిళ్ల ​భారం వినియోగదారుడిపై పడనుందని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోదీంతో కస‍్టమర్లు డేటా, ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్యాకేజీలపై ఆశలు వదులుకోవాల్సిందేనని ఎనలిస్టులు భావిస్తున్నారు. అంతేకాదు సంవత్సరానికి సుమారు 40శాతం వరకు పెరుగనుందని రిపోర్టులు తెలుపుతున్నాయి.

మరోసారి భారీ ఆఫర్లతో దూసుకొచ్చిన ఫ్లిప్‌కార్ట్, ఈ సారి టీవీలపై..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ప్యాకేజీల మధ్య వ్యత్యాసం ..

భవిష్యత్‌లో ఫోన్‌ బిల్లులు మరింతగా తగ్గే అవకాశాలు కన్పించడం లేదని కౌంటర్‌పాయింట్‌ టెక్నాలజీ మార్కెట్‌ రీసర్చ్‌ తెలిపింది. అయితే వివిధ ప్యాకేజీల మధ్య వ్యత్యాసం రూ. 100లకు బదులుగా 50రూపాయల కంటే తక్కువుంటే కస్టమర్లపై భారం ఫ్లాట్‌గానే అంచనా వేయవచ్చని కౌంటర​ పాయింట్‌ రీసెర్చ్‌ సత్యజిత్‌ సిన్హా వ్యాఖ్యానించారు.

రాబోయే రెండు సంవత్సరాల్లో ..

మరోవైపు సంవత్సరానికి సుమారు 40శాతం వరకు పెరుగుతాయని మరో అంచనా. అలాగే గత 9-10 నెలల్లో మొత్తం చందాదారులందరిలో నాలుగుశాతం ఎక్కువ ఆఫర్లను ప్యాకేజీలవైపు మళ్లారని , రాబోయే రెండు సంవత్సరాల్లో ఈ నిష్పత్తి 50 శాతానికి పెరుగుతుందని మోతీలాల్ ఓస్వాల్ నివేదిక వెల్లడించింది.

జియో ప్రవేశం తర్వాత

కాగా జియో ప్రవేశం తర్వాత ఎయిర్‌టెల్‌, ఐడియా సహా పలు టెలికాం సంస్థలు టారిఫ్‌లను తగ్గించడం సహా ఇతర ఆఫర్ల వల్ల టెలికాం సంస్థల ఆదాయానికి భారీగా గండిపడినట్లు తెలుస్తోంది. 2016 జూన్‌ నుంచి 2017 డిసెంబరు మధ్య టెలికాం కంపెనీలు దాదాపు 9.5 బిలియన్‌ డాలర్ల ఆదాయాన్ని కోల్పోయాయని ఇటీవల ఓ నివేదికలో తేలింది.

భవిష్యత్‌లో టారిఫ్‌లను

ఈ కారణాల వల్ల భవిష్యత్‌లో టారిఫ్‌లను తగ్గించకూడదని టెలికాం సంస్థలు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే కస్టమర్ల సౌలభ్యం కోసం ఉన్న టారిఫ్‌లలోనే ఎక్కువ డేటా, మరిన్ని ఉచిత సదుపాయాలను అందించే అవకాశాలున్నాయని సమాచారం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Mobile phone bills may not go down further More news at Gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot