అంచనాలో దిమ్మ తిరిగే లెక్కలు!

Posted By: Super

అంచనాలో దిమ్మ తిరిగే లెక్కలు!

 

‘కమ్యూనికేషన్ అవసరాలు రోజు రోజుకు పెరుగుతున్న నేపధ్యంలో మొబైల్ ఫోన్‌లకు అనూహ్య రీతిలో డిమాండ్ నెలకుంది. ఇండియా వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వీటి వినియోగం తారా స్థాయికి చేరుకుంటోంది.’

2014కుగాను దేశంలో మొబైల్ ఫోన్లకు డిమాండ్ 25 కోట్లకు చేరుకునే అవకాశముందని ఇండియన్ సెల్యులర్ అసోసియేషన్(ఐసీఏ) గణంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ మొబైళ్ల విలువ రూ.54,000 కోట్లు ఉంటుందని ఐసీఏ  విశ్లేషించినట్లు కమ్యూనికేషన్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి మిలింద్ దేవ్‌రా శుక్రవారం రాజ్యసభలో లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో పేర్కొన్నారు. మొబైల్ హ్యాండ్‌సెట్లకు డిమాండ్‌కు సంబంధించి ఐసీఏ అంచనాలను మంత్రి ఆ సమాధానంలో వివరించారు. ఆ వివరాల ప్రకారం... ప్రస్తుత సంవత్సరంలో 20 కోట్ల మొబైళ్లకు (వీటి విలువ రూ.43,000 కోట్లు) డిమాండ్ ఉంటుంది. 2011లో ఈ డిమాండ్ 18 కోట్లకు(రూ.38,200 కోట్లు) ఉండగా.  2010లో 15 కోట్లుగా(రూ.34,500 కోట్లు) ఉంది.

100 కోట్లు దాటిన చైనా మొబైల్ యూజర్ల సంఖ్య!

చైనాలో సెల్‌ఫోన్ వినియోగదారుల సంఖ్య 100 కోట్లు దాటింది. ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో (జనవరి-మార్చి) సెల్ వినియోగదారులు 3.2 కోట్ల మంది పెరగడంతో ఈ సంఖ్య మొత్తంగా 100 కోట్లు దాటినట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. కాగా ఫిక్స్‌డ్‌లైన్ వినియోగదారుల సంఖ్య మొదటి మూడు నెలల్లో కోటి మందికిపైగా తగ్గడం మరో ముఖ్యాంశం.

ఇండియా యూజర్ల సంఖ్య 95.14కోట్లు!!

తాజాగా టెలికం రెగ్యులేటరీ అధారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్), మార్చి 2012 గణాంకాలను విడుదల చేసింది. ఈ మార్చిలో కొత్తగా 80 లక్షల మంది కొత్తగా మొబైల్ కనెక్షన్ పొందినట్లు సంస్థ వెల్లడించింది. దింతో దేశంలోని మొత్తం టెలిఫోన్ వినియోగదారుల సంఖ్య 95.13కోట్లకు చేరింది. ట్రాయ్ వెల్లడించిన గణంకాల ప్రకారం, గడిచిన మార్చిలో భారత ఎయిర్‌టెల్‌కు అత్యధికంగా 25 లక్షల మంది కొత్త యూజర్లు లభించారు. దింతో కంపెనీ మొత్తం చందాదారుల సంఖ్య 18.12కోట్లకు చేరుకుంది. తురువాత స్థానంలో ఉన్న ఐడియా సెల్యులర్ 20 లక్ష మంది కొత్త వినియోగదారులను దక్కించుకుంది. యూనినార్ 12.9 లక్షలు, రిలయన్స్ 10.4 లక్షలు, వొడాఫోన్ 4.2లక్షల మంది కొత్త కస్టమర్లతో సరిపెట్టుకున్నాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot