ప్యాంట్ జేబులో సెల్.. మగతనం వీక్?

Posted By: Prashanth

Mobile Phone on Pocket Pants Reduce Sperm Count..?

 

సెల్‌ఫోన్‌ మగాళ్ల పురుషత్వం పై ప్రభావం చూపే అవకాశముందని పలు అధ్యయనాలు స్ఫస్టం చేస్తున్నాయి. ప్యాంట్ జేబుల్లో సెల్ పెట్టుకుంటే ప్రమాదంలో పడ్డట్లే అని నేషనల్ ఇన్స్ స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఆన్ చేసి ఉన్న మొబైల్ ఫోన్ ను తరచూ ప్యాంట్ జేబుల్లో పెట్టుకోవటం వల్ల సంతానోత్పత్తికి కీలకమైన వీర్యకణాల 30 శాతానికి పైగా తగ్గిపోతాయని నిపుణులు అంటున్నారు.

ఈ ప్రయోగంలో భాగంగా అధ్యయన బృందం మగ ఎలుకలను ఎంచుకుంది. సెల్‌ఫోన్ వెలువరిచే రేడియేషన్‌కు ఈ ఎలుకలను గురిచేసినప్పుడు వాటిలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ రేడియేషన్ కారణంగా స్పెర్మ్ సెల్స్‌లోని డీఎన్‌ఏ విచ్చిన్నం కావడాన్ని వీరు గుర్తించారు. దీని వల్ల వీర్యకణాల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుందన్నది వారి అంచనా. ఇదే ప్రభావం మనుషులపైనా ఉంటుందని వీరు చెబుతున్నారు.

ఏదేమైనప్పటికి సెల్ వినియోగించే విషయంలో మగవారు జాగ్రత్తగా ఉండటం మంచింది. వీలైనంతవరకూ ప్యాంట్ జేబులో సెల్ పెట్టుకోకుండా జాగ్రత్త వహించాలి.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot