అమ్మాయి సెల్‌ఫోన్ వాడితే రూ.10,000 ఫైన్!

మహిళలు సెల్‌ఫోన్ వాడటాన్ని బిహార్‌లోని సుందర్‌బాదీ గ్రామ పంచాయితీ నిషేధించింది. గ్రామంలోని మహిళులు సెల్‌ఫోన్ మాట్లాడకూడదంటూ షరతులు విధించింది. ప్రేమ వ్యవహారాలు ఇతర చెడు సంబంధాలు విచ్చలవిడవుతున్న నేపధ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు అక్కడి పంచాయితీ తీర్మానించింది. ఈ నిబంధనలను అతిక్రమించి ఫోన్ సంభాషణలు సాగించిన క్రమంలో జరిమానా క్రింద పెళ్లికాని అమ్మాయి అయితే రూ.10,000, వివాహిత అయితే రూ.2,000 చెల్లించాల్సి ఉంటుంది. కిషన్‌గంజ్ పరధిలోని సుందరబాదీ వెనుకబడిన గ్రామాలలో ఒకటి. ఇక్కడ జనాభాలో ముస్లీంలది 60శాతం. సదురు పంచాయితీ అమలుపరిచిన ఈ నింబంధనను సంబంధిత పోలీస్ వర్గాలు ధృవీకరించాయి.
గుర్తుంచుకోండి........
- రోజు మొత్తం మీద 60 నిమిషాలకు మించి ఫోన్ సంభాషణలు సాగించడం మంచిది కాదు.
- నిరంతరాయంగా 4 నిమిషాల దాటి సెల్ మాట్టాడటం ఆరోగ్య సంబంధిత సమస్యలకు దారితీసే అవకాశముంది.
- ఎక్కువ సేపు ఫోన్ మాట్లాడం వల్ల ఏర్పడే రేడియోషన్ చెవి, కర్ణభేరి, మెదడు పై ప్రభావం చూపుతుంది.
- 15 సంవత్సరాలలోపు చిన్నారులను సెల్‌ఫోన్‌కు దూరంగా ఉంచాలి.
- చిన్నారులు సెల్‌ఫోన్ ఉపయోగించడం వల్ల రేడియోషన్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆ వయస్సులో పెరిగే బ్రెయిన్‌పై రేడియోషన్ ప్రభావం పడితే చిన్నారులు జ్ఞాపకశక్తి కోల్పోయే ప్రమాదం ఉంది.
- గర్భిణీలు సెల్‌కు దూరంగా ఉంటే బిడ్డకు మేలు చేసినట్లే.


Click it and Unblock the Notifications








