‘మొబైల్ మోజులో మనుషులు’... తెగిపోతున్న బంధాలు!

By Prashanth
|
Mobile Phones can damage Personal Relationships


‘మితిమీరిన మొబైల్ వినియోగం మానవ బంధాలను సైతం తుంచేస్తోంది. ఉదాహరణకు: ఇద్దరు మిత్రుల మధ్య మనస్పర్థలు తలెత్తటానికి ఓ సెల్‌ఫోన్ కారణమయ్యిందంటే నేటి జీవితాల్లోకి సెల్‌ఫోన్ ఏ మేరకు చొచ్చుకుపోయిందో అర్ధం చేసుకోవచ్చు.’

మొబైల్ ఫోన్‌ల వినియోగం వ్యక్తిగత సంబంధాలను దారుణంగా దెబ్బతీస్తున్నాయని ఎసెక్స్ విశ్వవిద్యాలయ మానసిక నిపుణులు బృందం ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనంలో వెల్లడించింది. మొబైల్స్ వాడినా... వాడక పోయినా .. కేవలం అవి పక్కనే ఉంటే చాలు జరగాల్సిన నష్టం జరిగిపోతుందని ఈ అధ్యయనకర్తలు హెచ్చరిస్తున్నారు.

ఇద్దరు వక్తులు చక్కగా ఓ చోట కూర్చొని ముఖాముఖిగా మాట్లాడుకుంటున్న సమయంలో అక్కడే ఉన్న మొబైల్ ఫోన్‌ల మూలంగా ఆ సంభాషణ పూర్తి యాంత్రికంగా మారుతోందని పరిశోధనలో పాలుపంచుకున్న నిపుణులు వెల్లడించారు. సామాజిక సంబంధాలను సైతం మొబైల్ ఫోన్ లు తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని ఈ బృందం అభిప్రాయపడింది. మొబైల్ వినియోగం మితిమీరటంతో ముఖాముఖి సంభాషణలు మొక్కుబడిగా తయారవుతున్నాయని ఈ అధ్యయనం అంతిమంగా తేల్చేసింది.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X