అచ్చం సినిమా స్టైల్ లో చోరీ! మొబైల్ ఫోన్ల కంటైనర్ ను ఎత్తుకెళ్లిపోయారు! 

By Maheswara
|

సినిమా లలో చూపించినట్లుగా, చిత్తూరు జిల్లాలోని నగరి సమీపంలో మంగళవారం రాత్రి మొబైల్ సెల్‌ఫోన్‌లతో కూడిన కంటైనర్‌ను దొంగలు హైజాక్ చేశారు. కంటైనర్ డ్రైవర్ ఇర్ఫాన్ నగరి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది.

సర్కిల్ ఇన్స్పెక్టర్ అందించిన సమాచారం ప్రకారం
 

సర్కిల్ ఇన్స్పెక్టర్ అందించిన సమాచారం ప్రకారం

సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజశేకర్ అందించిన సమాచారం ప్రకారం, ఒక ప్రైవేట్ సంస్థ చెన్నై నుండి ముంబైకి సుమారు 14 కోట్ల రూపాయల విలువైన రెడ్మి ఫోన్లను రవాణా చేస్తోంది. లారీ నగరి సమీపంలో ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించినప్పుడు, కొంతమంది అపరిచితులు సెల్‌ఫోన్‌లు తీసుకెళ్తున్న లారీని వేరొక ట్రక్ తో వెంబడించి, జాతీయ రహదారిపై నగరి మరియు పుత్తూరు పట్టణాల మధ్య అడ్డుకున్నారు.తరువాత, హైజాకర్లు లారీ డ్రైవర్ ఇర్ఫాన్ ను కొట్టి తీవ్రంగా గాయపరిచారు.వారు అతన్ని హైవే మీద వదిలి లారీ తో సహా పారిపోయారు.

లారీ ని హైజాక్ చేసిన తరువాత

లారీ ని హైజాక్ చేసిన తరువాత

లారీ ని హైజాక్ చేసిన తరువాత దాదాపు 15 కిలో మీటర్లు ప్రయాణించి పుత్తూరు పట్టణానికి సమీపంలో కంటైనర్ లోని సగం ఫోన్లను ఎత్తుకెళ్లిపోయారు.ఈ ఫోన్లను ఏదైని వాహనం ద్వారా తరలించి ఉండవచ్చ్చు అని పోలీసులు అనుమానిస్తున్నారు.కంటైనర్ డ్రైవర్ ఇర్ఫాన్ నగరి పోలీసుల కు అందించిన ప్రాథమిక సమాచారం ఆధారం గా,దోపిడీ కో సంభందించిన సాక్ష్యాలను సేకరించడానికి పోలీసులు క్లూస్ బృందంతో కలిసి బుధవారం ఉదయం సంఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడ ఒక లారీలో నాలుగు పెట్టెల్లో 7 కోట్ల రూపాయల విలువైన సెల్‌ఫోన్‌లను ఉంచినట్లు పోలీసులు గమనించారు మరియు దొంగలు నాలుగు పెట్టెల్లో ప్యాక్ చేసిన 7 కోట్ల రూపాయల విలువైన సెల్‌ఫోన్‌లను మాత్రమే దోచుకున్నారు. మిగిలిన ఫోన్లు కంటైనర్ లోనే ఉన్నట్లుగా గుర్తించారు.

Also Read: Sony Bravia కొత్త LED టీవీలు వచ్చేసాయి!!! ప్లే స్టేషన్ ఫీచర్లతోAlso Read: Sony Bravia కొత్త LED టీవీలు వచ్చేసాయి!!! ప్లే స్టేషన్ ఫీచర్లతో

సంఘటనపై జిల్లా ఎస్పీ
 

సంఘటనపై జిల్లా ఎస్పీ

తీవ్రంగా గాయపడిన డ్రైవర్ ఇర్ఫాన్ ను గాయాలకు చికిత్స కోసం నగరి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. ఈ సంఘటనపై జిల్లా ఎస్పీ ఎస్ సెంథిల్ కుమార్ ఆరా తీశారు మరియు ప్రాధాన్యతా ప్రాతిపదికన కేసును ఛేదించాలని పోలీసు అధికారులను కోరారు.పోలీస్ అధికారులు ఒక టీం లాగాఏర్పడి దుండగులను వేటాడే పనిలో ఉన్నారు.అలాగే ఒక పోలీస్ అధికారి మాట్లాడుతూ 'ఈ ఫోన్లు మరియు కంటైనర్ కు సంబంధించిన కంపెనీ అధికారులకు సమాచారం అందించామని'తెలిపారు.

ఆ బాక్స్ లలో ఉన్నది కొత్త ఫోన్లా లేదా పాతవా

ఆ బాక్స్ లలో ఉన్నది కొత్త ఫోన్లా లేదా పాతవా

నగరి సబ్ ఇన్స్పెక్టర్ అందించిన సమాచారం ప్రకారం' కంటైనర్ డ్రైవర్ అందులోని ఫోన్ల గురించి మరియు వాటి విలువ గురించి సరైన సమాచారం ఇవ్వలేకపోతున్నాడని.ఆ బాక్స్ లలో ఉన్నది కొత్త ఫోన్లా లేదా పాతవా అనేది తేలాల్సి ఉందని.కంపెనీ కి సంబంధించిన అధికారులు వస్తే వారి సమక్షంలో ఈ బాక్స్ లు తెరిచి వాటిని పరిశీలిస్తామని 'తెలియచేసారు.

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
Mobile Phones Container Was Hijacked Near Andhra Tamil Nadu Border 

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X