కరోనాకు స్మార్ట్‌ఫోన్‌తోనే ట్రీట్ మెంట్!! ఎక్కడో తెలుసా ?

|

ఎంగో హోల్డింగ్స్ గ్రూప్ లిమిటెడ్ యొక్క అనుబంధ సంస్థ అయిన సిమి మొబైల్ ఉగాండా తాజా ఉత్పత్తులలో ఇప్పుడు మరొక స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. నామన్వే ఇండస్ట్రియల్ పార్క్‌లో సిమి మొబైల్ ఉగాండా తయారుచేసిన ఫోన్‌లను ఆ రాష్ట్ర పెట్టుబడి శాఖ మంత్రి ఎవెలిన్ అనిట్ లాంచ్ చేశారు.

శరీర ఉష్ణోగ్రత సెన్సార్లను కొలిచే సిమి ఫీచర్ ఫోన్

శరీర ఉష్ణోగ్రత సెన్సార్లను కొలిచే సిమి ఫీచర్ ఫోన్

ఈ ఫోన్ యొక్క గొప్ప ఫీచర్లలో ఒకటి ఫోన్ వెనుక భాగంలో శరీర ఉష్ణోగ్రతను కొలవగల పరారుణ ఉష్ణోగ్రత సెన్సార్లను కలిగి ఉండడం. ఇది కరోనావైరస్ యొక్క ప్రారంభ లక్షణాలలో ఒకటైన జ్వరాన్ని గుర్తించడానికి ఉపయోగించే ఉష్ణోగ్రత గన్ గా ఈ ఫోన్‌ను ఉపయోగించవచ్చు అని సిమి మొబైల్ ఉగాండా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డేవిడ్ బీచమ్ ఓక్వెరే తెలిపారు.

 

Also Read: విశ్వంలో మరొక గ్రహంలో మన సముద్రాల లాంటి జాడలు!!! ఎక్కడో తెలుసా?Also Read: విశ్వంలో మరొక గ్రహంలో మన సముద్రాల లాంటి జాడలు!!! ఎక్కడో తెలుసా?

సిమి మొబైల్ ఉగాండా ఫీచర్ ఫోన్ ధరల వివరాలు

సిమి మొబైల్ ఉగాండా ఫీచర్ ఫోన్ ధరల వివరాలు

ఈ ఫోన్ ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో sh380,000 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఇది గూగుల్ ప్లే స్టోర్ ను అప్‌డేట్ చేయడానికి ఉపయోగిస్తుందని ఓక్వెరే చెప్పారు. ప్రస్తుత సమయంలో ఈ ఫోన్ ఉంటే కనుక టెంపరేచర్ మెషిన్స్ అవసరం ఉండదు. అలాగే టెంపరేచర్ గన్ల విషయంలో క్రమాంకనం అవసరం లేదు అని కూడా ఆయన తెలిపారు.

సిమి మొబైల్ ఉగాండా ఫోన్ ఫీచర్స్

సిమి మొబైల్ ఉగాండా ఫోన్ ఫీచర్స్

అనేక ఫీచర్లతో వస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్ COVID-19 కి వ్యతిరేక పోరాటంలో డాక్టర్లకు చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనిని కొనుగోలు చేసిన వినియోగదారులు తమ యొక్క శరీర ఉష్ణోగ్రతను క్రమం తప్పకుండా పరీక్షించడానికి వీలు కల్పిస్తుంది అని ఓక్వెరే వివరించారు. ఇందులో గల అంతర్నిర్మిత సెన్సార్లు శరీరానికి అటాచ్ చేసిన వెంటనే వారి యొక్క శరీర ఉష్ణోగ్రతను చూపుతుంది.

సోలార్ ప్యానల్‌తో కొత్త ఫీచర్ ఫోన్

సోలార్ ప్యానల్‌తో కొత్త ఫీచర్ ఫోన్

సిమి మొబైల్ ఉగాండా అనిట్ ఈ కొత్త ఫోన్ తో పాటుగా మరొక కొత్త ఉత్పత్తిని ప్రారంభించింది. స్వీయ-ఛార్జింగ్‌ పద్దతిలో సౌర శక్తితో పనిచేసే ఫీచర్ ఫోన్ ను అంతర్నిర్మిత సోలార్ ప్యానల్‌తో తయారుచేయనున్నారు. సూర్యుని ద్వారా విద్యుత్ సరఫరాను తీసుకొని పనిచేసే ఫీచర్ ఫోన్ ఇతర ఫోన్‌లకు పవర్ బ్యాంక్‌గా కూడా ఉపయోగపడుతుంది.

సోలార్ ప్యానల్‌ కొత్త ఫీచర్ ఫోన్ లాంచ్

సోలార్ ప్యానల్‌ కొత్త ఫీచర్ ఫోన్ లాంచ్

ఆ దేశంలో స్థానికంగా ‘కబిరిటి' అని పిలువబడే ఈ ఫోన్ అన్ని రకాల సోషల్ మీడియా యాప్ లను ముందే ఇంస్టాల్ చేయబడి ఉండడమే కాకుండా 4,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఓక్వెరే ప్రకారం ఈ ఫీచర్ ఫోన్ ఒకటి లేదా రెండు వారాలలో విడుదల కానున్నది.

ఉగాండా ఆర్థిక పరిస్థితి

ఉగాండా ఆర్థిక పరిస్థితి

సిమి మొబైల్‌ సంస్థ యొక్క కొత్త ఆవిష్కరణలను ప్రారంభించిన తరువాత అనైట్ మాట్లాడుతూ ఉగాండా ప్రస్తుతం వీటి యొక్క సాయంతో మధ్య-ఆదాయ స్థితికి చేరుకోవచ్చు అని అశిస్తున్నాము. ప్రభుత్వం తన లక్ష్యాలను చేరుకోవడంలో సహకరించినందుకు సిమి మొబైల్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ విద్యుత్తును అందించాలని ప్రభుత్వం కోరుకుంటున్నది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న వారు సౌరశక్తితో పనిచేసే ఫోన్‌లను వాడటానికి అనువుగా ఉంటాయని మరియు అవి వారిని ఆకట్టుకుంటాయి అని అనిట్ తెలిపారు.

Best Mobiles in India

English summary
Mobile Phones Turned into Body Temperature Machines: Check Details Here!

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X