హ్యపీ న్యూస్: మొబైల్ ఫోన్ వల్ల క్యాన్సర్ రాదట!

Posted By: Super

 హ్యపీ న్యూస్: మొబైల్ ఫోన్ వల్ల క్యాన్సర్ రాదట!

టెక్నాలజీ పుణ్యమా అంటూ సమాచార అవసరాలను తీర్చేందుకు మానవ జీవితంలోకి ప్రవేశించిన మొబైల్ ఫోన్ నిత్యావసర వస్తువులో జాబితాలో చేరిపోయంది. సెల్‌ఫోన్ లేని వారు చాలా తక్కువ. విద్యుత్ సదుపాయం నామమాత్రంగా ఉన్న గ్రామాలకు సైతం మొబైల్ ఫోన్‌లు విస్తరించాయి. అయితే, సెల్‌ఫోన్ వినియోగం ఆరోగ్యపరంగా దుష్పరిణామాలకు తావుతీస్తుందని ఆది నుంచి ఆందోళణలు వ్యక్తమవుతూనే ఉన్నాయి.

మొబైల్‌ఫోన్‌ను ఉపయోగించటం వల్ల బ్రెయిర్ క్యాన్సర్ వచ్చే ప్రమాదముందని పలు పరిశోధనలు ఆందోళణ వ్యక్తం చేస్తున్న నేపధ్యంలో లండన్‌కు చెందిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ రీసెర్చ్ (ఐసీఆర్) మొబైల్ ఫోన్‌లకు బ్రెయిన్ క్యాన్సర్‌కు ఎలాంటి సంబంధం లేదని తేల్చేసింది.

తాము వివిధ దేశాల్లో టెలిఫోనిక్ ఇంటర్ కమ్యూనికేషన్ సిస్టం విధానంలో పరిశోధన చేపట్టగా సెల్‌ఫోన్ తరంగాల కారణంగా క్యాన్సర్ కణతులేర్పడతాయన్న వాదనలు అవాస్తవమని రుజువైందని అధ్యయనకర్తలు వెల్లడించారు. మొబైల్‌ఫోన్‌ల ద్వారా వెలువడే రేడియో తరంగాల క్షేత్రం నుంచి జీవయంత్రాంగంలో ఏవైనా మార్పులు జరిగి క్యాన్సర్‌కు దారి తీసేఅవకాశముందా..? అన్న కోణంలోనూ పరిశోధించగా ఎలాంటి ఆధారాలు లభించలేని ఈ బృందం తెలిపింది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot