పాఠకుల కోసం ప్రత్యేకంగా మార్కెట్‌లో ఉన్న టాబ్లెట్స్ విశ్లేషణ

Posted By: Staff

పాఠకుల కోసం ప్రత్యేకంగా మార్కెట్‌లో ఉన్న టాబ్లెట్స్ విశ్లేషణ

అరచేతిలో ఒదిగిపోయే టాబ్లెట్‌ ఉంటే చాలు, అదే బుల్లి పీసీలా పని చేస్తుంది. కీబోర్డ్‌, పీపీయూ, మౌస్‌ అన్నీ అందులోనే! ప్రస్తుతం మార్కెట్‌లో యాపిల్‌ సంస్థ తయారు చేసిన 'ఐప్యాడ్‌2', బ్లాక్‌బెర్రీ రూపొందించిన 'ప్లేబుక్‌' ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి. టాబ్లెట్స్‌ అమ్మకాలు 2011లో 54 మిలియన్లు దాటి రికార్డు సృష్టించనున్నాయని, 2014 నాటికి 208 మిలియన్లకు చేరతాయని నిపుణులు చెబుతున్నారు.

* ఐప్యాడ్‌

మొదటగా మనం ఐప్యాడ్‌ గురించి మాట్లాడుకుందాం. ఐప్యాడ్‌ మార్కెట్‌లోకి వచ్చిన 28 రోజుల్లోనే మిలియన్‌ ఐప్యాడ్‌ల అమ్మకాలు రికార్డ్‌ చేసింది. ఆప్‌స్టోర్‌ నుంచి 12 మిలియన్ల అప్లికేషన్లు, ఐబుక్‌స్టోర్‌ నుంచి 1.5 ఈ-పుస్తకాల్ని నెటిజన్లు డౌన్‌లోడ్‌ చేశారు. డెవలెపర్లు 5,000 కొత్త అప్లికేషన్స్‌ని ఐప్యాడ్‌ కోసం రూపొందించారు. ఆప్‌స్టోర్‌లోని 2,00,000 అప్లికేషన్స్‌ని దీంట్లో రన్‌ చేయవచ్చు. 16, 32, 64 జీబీ మెమొరీ సామర్థ్యంతో వీటిని అందిస్తున్నారు. ధర సుమారు రూ.32,000.


ఐప్యాడ్‌2 రెండో జనరేషన్‌ టాబ్లెట్‌ కంప్యూటర్‌. ఐప్యాడ్‌ కంటే 33 శాతం తక్కువ మందం, తక్కువ బరువుతో తయారు చేశారు. డ్యుయల్‌ కోర్‌ ఏ4 ప్రాసెసర్‌ వాడారు. ఐప్యాడ్‌ కంటే రెండు రెట్ల వేగం ఎక్కువ. గ్రాఫిక్స్‌ ప్రాసెసింగ్‌లో 9 రెట్లు ఎక్కువగా వేగంతో పని చేస్తుంది. వీడియో ఛాటింగ్‌, హైడెఫినెషన్‌ ఫొటోలు, వీడియోలు సౌకర్యాలు. టీవీలకు అనుసంధానం చేయవచ్చు. తెర 9.7 అంగుళాలు, స్టోరేజ్‌ సామర్థ్యం 64 జీబీ, మందం 8.8 మిల్లీమీటర్లు, ధర సుమారు రూ. 22,450 (16 జీబీ).

* బ్లాక్‌బెర్రీ ప్లేబుక్


ఈతరం మాటల్లో చెప్పాలంటే ఇదో జీరో సైజు టాబ్లెట్‌ అన్నమాట. 1 GB RAM, 1 Ghz Dual-Core Processorతో బుల్లి పీసీలా పని చేస్తుంది. అడోబ్‌ ఫ్లాష్‌ ప్లేయర్‌ 10.1ను ఎనేబుల్‌ చేయవచ్చు. బ్లూటూత్‌ ద్వారా బ్లాక్‌బెర్రీ మొబైల్‌కి సురక్షితంగా అనుసంధానం అవ్వొచ్చు. మొబైల్‌లోని డేటాని టాబ్లెట్‌లోకి సింక్రనైజ్‌ చేసుకోవచ్చు. క్రిస్టల్‌ క్లియర్‌ హెచ్‌డీ డిస్‌ప్లేతో వీడియో ఛాటింగ్‌ చేయవచ్చు. ఏడు అంగుళాల తెర, 1024*600 స్క్రీన్‌ రిజల్యుషన్‌, బ్లాక్‌బెర్రీ టాబ్లెట్‌ ఓఎస్‌, డ్యుయల్‌ హెచ్‌డీ కెమేరాలు (3 మెకాపిక్సల్‌ కెమేరా ముందుభాగంలో, 5 మెగాపిక్సల్‌ కెమేరా వెనకభాగంలో), వీడియో ప్లేబ్యాక్‌, వై-ఫై, బ్లూటూత్‌ సదుపాయల్ని దీంట్లో నిక్షిప్తం చేశారు. ధర సుమారు రూ.27,000.

* గెలాక్సీ ట్యాబ్


టూర్‌కి వెళ్లేప్పుడు కేమేరా, హ్యాండ్‌ కెమేరా, ల్యాప్‌టాప్‌లను తీసుకెళ్లక్కర్లేదు. ఏడు అంగుళాల తెరతో తయారు చేసిన గెలాక్సీ టాబ్లెట్‌ ఉంటే చాలు. శ్యామ్‌సంగ్‌ కంపెనీ దీని రూపకర్త. ప్రపంచంలోనే అత్యంత పలుచటి టాబ్లెట్‌ ఇదే (8.6 మిల్లీమీటర్లు). ఆండ్రాయిడ్‌ 3.0, 3జీ, పీపీఆర్‌ఎస్‌, ఎడ్జ్‌ నెట్‌వర్క్‌లతో పని చేస్తుంది. వై-ఫై, బ్లూటూత్‌ సదుపాయం ఉంది. డాక్యుమెంట్‌ ఎడిటర్‌తో వర్డ్‌ ఫైల్స్‌ని ఎడిట్‌ చేసుకునే వీలుంది. ధర సుమారు రూ.36,000.

* వ్యూసోనిక్‌ ట్యాబ్లెట్‌


ప్రముఖ పీసీ తయారీ కంపెనీ వ్యూసోనిక్‌ కొత్త ట్యాబ్లెట్‌లను తయారు చేసింది. అవే ViewPad 7, Dual-OS ViewPad 10. ఏడు అంగుళాల టచ్‌స్క్రీన్‌, ఆండ్రాయిడ్‌ ఓఎస్‌, వై-ఫై, బ్లూటూత్‌, 3జీ, రీ-రీడర్‌, ముందు 0.3, వెనక 3 మెగాపిక్సల్‌ కెమేరాలు, స్పీకర్లు, మైక్రోఫోన్‌ సదుపాయాలతో వ్యూప్యాడ్‌ సెవెన్‌ను రూపొందించారు. వ్యూప్యాడ్‌ 10లో విండోస్‌ 7, ఆండ్రాయిడ్‌ ఓఎస్‌లను కలిపి వాడుకోవచ్చు. Intel Atom 1.66GHz Processor, 1 GB RAM, 16 GB Hard Drive, మైక్రోఎస్‌డీ స్లాట్‌, బ్యాక్‌లైట్‌ ప్యానల్‌ సదుపాయాల్ని నిక్షిప్తం చేశారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot