మొబైల్ ద్వారా రైల్వే టిక్కెట్లు.. మరింత సులభం

Posted By:

మొబైల్ ద్వారా రైల్వే టిక్కెట్లు.. మరింత సులభం

 

ప్రయాణికులకు టిక్కెట్లను మరింత దగ్గర చేర్చేందుకు గాను 'ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజమ్ కార్పోరేషన్' కొత్త పద్దతిని ప్రవేశపెట్టనుంది. ఇందులో భాగంగా 'ఐఆర్‌సిటిసి' ప్రయాణికుల కోసం వారియొక్క మొబైల్ ఫోన్స్ ద్వారా టిక్కెట్లను బుక్ చేసుకునే వెసులుబాటుని త్వరలో కల్పించనుంది. ఎవరైతే పాసింజర్స్ తమయొక్క మొబైల్ ద్వారా టిక్కెట్లను బుక్ చేసుకొవాలనుకుంటారో, దీని కోసం 'ఐఆర్‌సిటిసి' ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ వర్సన్ వెబ్ సైట్ https://www.irctc.co.in/mobile ని సందర్శించాల్సి ఉంటుంది.

బ్రౌజర్, జిపిఆర్‌ఎస్ యాక్టివేషన్ ఉన్న ప్రతి మొబైల్ కూడా  మొబైల్ వర్సన్ వెబ్ సైట్‌ని ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. మొబైల్ ఫోన్‌ని ఉపయోగించి వినియోగదారులు వారియొక్క టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. వినియోగదారులు కేవలం వారు చేరాల్సిన గమ్యస్దానం, ప్రస్తుతం ఉన్న స్దానం డిటేల్స్‌ని మొబైల్ ద్వారా అందించి టికెట్‌ని బుక్ చేసుకోవచ్చు. ఇది మాత్రమే కాకుండా మీరు బుక్ చేసుకున్న టికెట్లతో పాటు, క్యాన్సిల్ చేసిన టిక్కెట్లకు సంబంధించిన పూర్తి సమాచారం మొబైల్ వర్సన్ ద్వారా చూడొచ్చు.

వినియోగదారులు టికెట్‌ని బుక్ చేసుకున్న తర్వాత పేమంట్‌ని క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ ద్వారా చెల్లించవచ్చు. యూజర్స్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డు‌కి ఏదైతే యూజర్ నేమ్, పాస్ వర్డ్ ఉపయోగిస్తారో వీటినే మొబైల్ వర్సన్‌కి ఉపయోగించవచ్చు. ఇప్పటికే మార్కెట్లో మొబైల్ ద్వారా టిక్కెట్లను ATOM, ngpay, PAYMATE ద్వారా బుక్ చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఐతే ఇప్పుడు కొత్తగా 'ఐఆర్‌సిటిసి' దీనిని రూపొందించడం వినియోగదారులకు మరింత కలసి వచ్చే అంశం.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot