Home
News

1000 మంది బాయ్‌ఫ్రెండ్స్‌తో మోడల్‌ డేటింగ్‌.. నిమిషానికి ఎంత చెల్లించాలో తెలుసా..??

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) అందుబాటులోకి వచ్చాక సాధ్యం కానిదంటూ ఏమీ లేదమో అన్ని కొన్నింటిని చూసినప్పుడు అనిపిస్తుంది. భవిష్యత్‌లో ఈ టెక్నాలజీ ప్రభావం ఎలా ఉన్న.. ప్రస్తుతం మాత్రం అనేక ఆవిష్కరణలకు ఇది కారణం అవుతోంది.

జార్జియాలోని కమ్మింగ్‌ చెందిన మోడల్‌ కారిన్‌ మార్జోరి.. సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయన్సర్‌. స్నాప్‌చాట్‌లో ఏకంగా 1.8 మిలియన్ల ఫాలోయర్స్‌ను కలిగి ఉన్నారు. అయితే ఫాలోయర్స్‌లో చాలా మంది ఆమెతో సమయం గడపాలని కోరుకుంటున్నారు. అయితే వేల మందిని కలవడం, మాట్లాడడం సాధ్యం కాదు. దీంతో కారిన్‌ మార్జోరి వినూత్నంగా ఆలోచించారు. 'authentic' AI క్లోన్‌ను తయారుచేశారు. ఇది ఫాలోయర్స్‌ మోడల్‌తో డేటింగ్‌ చేసేందుకు సాయపడుతుంది.

caryn marjorie

CarynAI బీటా వెర్షన్‌ను ఈ మంగళవారం విడుదల చేశారు. ఇందులో వేల గంటల సంభాషణను రికార్డు చేశారు. ఈ బోట్‌తో వినియోగదారులు అనేక రకాలైన విషయాలు మాట్లాడేందుకు అవకాశం ఉంటుంది. ఈ AI బోట్‌ వినియోగదారులకు అవసరమైనప్పుడు మద్దతు ఇస్తుంది మరియు ప్రేమిస్తుంది.

మీరు ఎక్కడ నుంచైనా ఓదార్పును కోరుకుంటున్నారా లేదా ప్రేమను ఆశిస్తున్నారా, ఏదైనా సంఘటన గురించి చెప్పాలనుకుంటున్నా కారిన్‌ ఏఐ బోట్‌ ఎప్పుడు అందుబాటులో ఉంటుందని కారిన్‌ మార్జోరి తెలిపారు. 1000 మంది స్నేహితులు కారిన్‌ AI క్లోన్‌తో డేటింగ్‌ చేస్తున్నారు. ఇందుకోసం నిమిషానికి ఒక డాలర్‌ చెల్లిస్తున్నారు.

కారిన్‌ ఏఐ బోట్‌ వినియోగదారుల్లో 90 శాతం మంది పురుషులేనని సమాచారం. ఈ ఏఐ బోట్‌ ద్వారా సుమారు 71,610 డాలర్లు అంటే 58.7 లక్షల రూపాయల ఆదాయం వచ్చిందని తెలుస్తోంది.
తనకున్న 1.8 మిలియన్ల ఫాలోయర్స్‌లో సుమారు 20 వేల మంది ఈ ఏఐ బోట్‌ను వినియోగించినా నెలకు తనకు 5 మిలియన్‌ డాలర్ల సంపాదించగలుగుతానని కారిన్‌ మార్జరి తెలిపారు. కారిన్‌ మార్జరి.. ఫరెవల్‌ వాయిస్‌ సంస్థ సాయంతో కారిన్‌ AI బోట్‌ను తయారు చేసింది.

ఫరెవర్‌ వాయిస్‌ సీఈవో అయిన జాన్‌ మేయర్‌ తొలుత ఏఐ బోట్‌ను తయారుచేశారు. 2017లో ఆత్మహత్య చేసుకున్న తన తండ్రిని అనుకరించడం కోసం తయారు చేశారు. AI బోట్‌ రూపంలో ఉన్న తన తండ్రితో మాట్లాడడం ఓ గొప్ప అనుభవమని జాన్‌ మేయర్‌ తెలిపారు. అయితే శృంగార సంబంధం వంటి ఇతర కార్యక్రమాలకు వినియోగించడం నమ్మశక్యం కాదని అభిప్రాయపడ్డారు

జార్జియాలోని ఏఐ నిపుణులు జాసన్‌ బోరెన్‌స్టెయిన్‌ ఏఐ ప్రభావంపై ఆందోళన వ్యక్తం చేశాడు. ఇతర వ్యక్తులపై ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఎటులంటి ప్రభావం చూపుతుందో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉందని కోరుకుంటున్నట్లు తెలిపారు.

చైనాలోని ఓ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌లో పనిచేసే హెడ్‌ బ్యాండ్‌లను వినియోగిస్తున్నారు. ఈ బ్యాండ్‌లతో విద్యార్థి తరగతి గదిలో ఏ స్థాయిలో యాక్టివ్‌గా ఉన్నాడో తెలిసే అవకాశం ఉంటుంది. ఈ వీడియోను మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఏఆర్‌ రెహమాన్‌ గత వారం షేర్‌ చేశారు. టెక్నాలజీ కొత్త తరానికి వరమో లేదా శాపమో.. కాలమే నిర్ణయిస్తుందని కామెంట్‌ చేశారు.

More from GizBot

Best Mobiles in India

English summary
Model creates A Clone bot and dates with her followers
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X