Home
News

BSNL 4G నెట్‌వర్క్ త్వరిత అభివృద్ధికి మోడీ ప్రభుత్వం సాయం..

ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం ఆపరేటర్ అయిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) 4G రోల్ అవుట్ కోసం భారత ప్రభుత్వం నుండి భారీ మద్దతును పొందుతోంది. ఖచ్చితంగా చెప్పాలంటే ఈ టెల్కో ప్రైవేట్ టెల్కోల కంటే వెనుకంజలో ఉన్నందున తన యొక్క 4G రోల్ అవుట్ ను వేగవంతం చేయడానికి మోడీ యొక్క ప్రభుత్వం సహాయం చేస్తోంది. లోక్‌సభలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ గత ప్రభుత్వం పూర్తిగా వదిలిపెట్టిన బిఎస్ఎన్ఎల్ యొక్క అభివృద్ధి కోసం కొద్దిగా సమయం పడుతుందని అన్నారు. ట్రిబ్యూన్ఇండియా నివేదిక ప్రకారం BSNLని సాధ్యమైనంత ఉత్తమమైన రీతిలో పునరుద్ధరించడానికి ప్రభుత్వం తన వంతు ప్రయత్నం చేస్తోందని వైష్ణవ్ చెప్పారు. దీని గురించి మరిన్ని వివరాలు వివరంగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

స్వదేశీ టెక్నాలజీతో BSNL 4G

స్వదేశీ టెక్నాలజీతో BSNL 4G

BSNLలో త్వరలోనే 4G నెట్ వర్క్ ను అందుబాటులోకి తీసుకొనివచ్చే భారత ప్రభుత్వ (GoI) ఉద్దేశాలు స్పష్టంగా ఉన్నాయి. GoI BSNL స్వదేశీ 4Gతో వెళ్లాలని కోరుకుంది మరియు అందుకే విజయవంతమైన 4G ట్రయల్స్ నిర్వహించడానికి టెల్కో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) మరియు సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ (C-DoT)తో కలిసి నెలల తరబడి పనిచేస్తోంది. ట్రయల్స్ త్వరలో ముగియబోతున్నాయి మరియు BSNL ఏప్రిల్ 2022లో 4G పరికరాల కోసం ఆర్డర్ చేస్తుంది.

4G రోల్‌అవుట్

BSNL ద్వారా 4G రోల్‌అవుట్ 2022 ఆగస్టు లేదా సెప్టెంబర్ నాటికి ఉంటుందని ఐష్నావ్ గతంలో చెప్పారు. ఫిబ్రవరిలోపు ట్రయల్స్ పూర్తయితే మాత్రమే ఇది సాధ్యమవుతుంది. భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా లోక్‌సభలో మాట్లాడుతూ BSNL దేశానికి వ్యూహాత్మక ఆస్తి కావున 4G స్పెక్ట్రమ్‌ను మరింత పోటీగా మార్చడానికి మోడీ ప్రభుత్వం ప్రభుత్వ టెలికాం సంస్థకు డబ్బు ఇస్తోందని ప్రకటించారు.

BSNL  VRS

BSNL తన పాత ఉద్యోగుల కోసం స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని (VRS) ప్రవేశపెట్టడంలో మరియు జీతం బకాయిలను క్లియర్ చేయడంలో సహాయపడిన రిలీఫ్ ప్యాకేజీ రూపంలో ప్రస్తుత ప్రభుత్వం టన్నుల కొద్ది సహాయాన్ని అందుకుంది. ఇప్పటికే అనేక జాప్యాలు జరుగుతున్నప్పటికీ 2022లో ఎట్టకేలకు భారతదేశం అంతటా 4G నెట్‌వర్క్‌లతో BSNL విడుదలయ్యే సంవత్సరంగా అంచనా వేయబడింది. సర్వీస్ యొక్క నాణ్యత ప్రైవేట్ టెల్కోలకు ఏ రకమైన పోటీని ఇస్తుందో ముందు ముందు చూడాలి. BSNL యొక్క 4G నెట్‌వర్క్‌లు మంచి సేవలను అందించడంలో విజయవంతమైతే అది మార్కెట్ డైనమిక్‌ను మంచిగా మారుస్తుంది.

రూ.100 ధర లోపు BSNL 4G డేటా వోచర్‌లు

రూ.100 ధర లోపు BSNL 4G డేటా వోచర్‌లు

BSNL టెల్కో తన యొక్క వినియోగదారులకు రూ.100 ధర లోపు ఆరు డేటా వోచర్‌లను అందిస్తోంది. ఈ వోచర్‌ల ధరలు వరుసగా రూ.19, రూ.56, రూ.75, రూ.94, రూ.97 మరియు రూ.98లుగా ఉన్నాయి. ఇందులో రూ.19 ధర వద్ద లభించే వోచర్‌తో వినియోగదారులు 1రోజు సర్వీస్ వాలిడిటీతో 2GB డేటాను పొందుతారు. మీకు ఏకమొత్తంలో ఎక్కువ డేటా కావాలంటే మీరు రూ.56 ధర వద్ద లభించే డేటా వోచర్‌కు వెళ్లవచ్చు. ఇది పది రోజుల చెల్లుబాటు కాలానికి 10GB డేటాతో పాటుగా జింగ్ సబ్‌స్క్రిప్షన్‌తో ఉచితంగా అందిస్తుంది. రూ.75 ధర వద్ద లభించే వోచర్ 50 రోజుల సర్వీస్ వాలిడిటీతో వస్తుంది. ఇది 2GB డేటాతో పాటు 100 నిమిషాల ఉచిత వాయిస్ కాలింగ్ మరియు 50 రోజుల పాటు ఉచిత PRBTని అందిస్తుంది. రూ.94 ధర వద్ద లభించే వోచర్ రూ.75 వోచర్ లాగానే లభిస్తుంది. కానీ ఇది 75 రోజులలోపు వినియోగించుకోవాల్సిన 3GB డేటాను అందిస్తుంది. అంతేకాకుండా 60 రోజుల పాటు PRBTతో పాటు 100 నిమిషాల ఉచిత వాయిస్ కాలింగ్‌ను అందిస్తుంది.

Best Mobiles in India

English summary
Modi Government Assists in Rapid Development of BSNL 4G Network
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X