కస్టమర్‌ని మోసం చేస్తారా,ముందు లక్ష ఫైన్ కట్టమన్న కోర్టు

By Gizbot Bureau
|

ఈ కామర్స్ వ్యాపారం అంటేనే ఇప్పుడు హడలెత్తే పరిస్థితి వచ్చింది. యూజర్లు ఆన్ లైన్‌లో ముచ్చట పడి ఏదైనా వస్తువును ఆర్డర్ చేస్తే అది డెలివరీ అయ్యేవరకు టెన్సన్ మాములుగా ఉండదు. ఎందుకంటే ఈ మధ్య ఒకటి ఆర్డర్ చేస్తే.. డెలివరీ మరొకటి చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. కొత్త మొబైల్ ఆర్డర్ చేస్తే అందులో రాళ్లు, సోపులు వంటివి వస్తున్నాయి.

Mohali engineer who was couriered soap instead of iPhone gets Rs 1 lakh compensation

ఇప్పుడు చెప్పబోయే న్యూస్ కూడా అదే తరహాలోదే. ఈ కామర్స్ వెబ్ సైట్లో ఐఫోన్ చూసి ముచ్చటపడిన ఆర్డర్ చేసిన మొహాలికి చెందిన సివిల్ ఇంజినీర్‌కు 5 సబ్బుల సెట్ డెలివరీ అయింది. డెలివరీ చేసిన ప్యాకేజీని ఓపెన్ చేసి చూసి 36ఏళ్ల ప్రవీణ్ కుమార్ శర్మ ఒక్కసారిగా షాక్ అయ్యాడు.

Snapdeal వెబ్ సైట్

Snapdeal వెబ్ సైట్

మార్చి 4, 2017లో Snapdeal వెబ్ సైట్ ద్వారా Apple iPhone 7 ప్లస్ ఫోన్ ను ఇతను ఆర్డర్ చేశాడు. మార్చి 12న తన అడ్రస్‌కు ఐఫోన్ డెలివరీ అవుతుందని మెసేజ్ కూడా వచ్చింది. పియూష్ ఫ్యాషన్ సెల్లర్, స్నాప్ డీల్ ద్వారా ఆర్డర్ చేసిన ప్రవీణ్‌ అడ్రస్‌కు బ్లూడార్ట్ కొరియర్ నుంచి మార్చి 6, 2017న ఒక ప్యాకెట్ డెలివరీ అయింది. ఆ సమయంలో ప్రవీణ్ ఇంట్లో లేకపోవడంతో కుటుంబ సభ్యుల్లో ఒకరు డెలివరీ ప్రొడక్టును అందుకున్నారు.

5 RIN Bar డిటర్జెంట్ సబ్బు బిళ్లల సెట్

5 RIN Bar డిటర్జెంట్ సబ్బు బిళ్లల సెట్

ఆ తర్వాత ఇంటికి వచ్చిన ప్రవీణ్ ఆ ప్యాక్ విప్పాడు. అయితే అందులో ఐఫోన్ లేదు. దాని బదులు 5 RIN Bar డిటర్జెంట్ సబ్బు బిళ్లల సెట్ ఉంది. వెంటనే Snapdeal కస్టమర్ కేర్ కు ఇంజినీర్ ఫోన్ కాల్ చేసి ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు తీసుకున్న స్నాప్ డీల్ ప్రతినిధులు మార్చి 13, 2017న కొరియర్ ద్వారా వచ్చిన ప్యాకెట్ ను వచ్చి రిటర్న్ తీసుకెళ్లారు.

డెలివరీ ప్యాకింగ్ సమయంలోనే పొరపాటు

డెలివరీ ప్యాకింగ్ సమయంలోనే పొరపాటు

ఈ ప్యాకెట్ డెలివరీ చేసిన కొరియర్ బాయ్ దగ్గర లోపం లేదని విచారణలో తేల్చారు. డెలివరీ ప్యాకింగ్ సమయంలోనే పొరపాటు జరిగినట్టు నిర్ధారణకు వచ్చారు. కానీ, బాధితుడు శర్మ అప్పటికే స్నాప్ డీల్ కు రెండుసార్లు ఈమెయిల్స్ పంపాడు. వారు ఎలాంటి చర్యలు తీసుకోకపోగా వారు ఇంజినీర్ స్నాప్ డీల్ అకౌంట్ నే డిలీట్ చేశారు. దీంతో మొహలీ కంజ్యూమర్ ఫారమ్ లో జూన్ 19, 2017న బాధితుడు శర్మ ఫిర్యాదు చేశాడు.

ముగ్గురు మాట దాటేశారు

ముగ్గురు మాట దాటేశారు

దీనిపై స్పందించిన ఫారమ్ స్నాప్ డీల్ ను వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. అందుకు తమకు డెలివరీకి సంబంధం లేదని, అది డెలివరీ చేసిన థర్డ్ పార్టీ సెల్లర్లకు సంబంధించిందంటూ మాట దాటేసింది. తమ వెబ్ సైట్లో ప్రొడక్టు వివరాలు మాత్రమే ఉంటాయని తెలిపింది. మరోవైపు ప్రొడక్టు ప్యాక్ చేసిన సెల్లర్ కూడా స్పందించారు. ఫిర్యాదుదారుడు ఇచ్చిన అడ్రస్ కు ఐఫోన్ డెలివరీ చేశామని చెప్పారు. కస్టమర్ కావాలనే తనకు సబ్బులు డెలివరీ అయ్యాయని కథలు అల్లాడంటూ వివరణలో తెలిపింది. పియూజ్ ష్యాషన్, బ్లూడార్ట్ కొరియర్ కూడా దీనిపై ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ఆర్డర్ డిస్పాచ్ విషయంలో స్నాప్ డీల్ పాత్ర లేదంటూనే తమ కొరియర్ సర్వీసుల ద్వారా ఫిర్యాదుదారుడికి ప్రొడక్ట్ ఆర్డర్ చేసినట్టు తెలిపింది.

ముగ్గురు పరిహారం చెల్లించాలని తీర్పు

ముగ్గురు పరిహారం చెల్లించాలని తీర్పు

అందరి వాదనలు విన్న తర్వాత ఫారమ్ తీర్పు వెలువరిస్తూ.. ‘మొబైల్ IMEI నెంబర్ ప్యాకెట్ లేదా బిల్లుపై ఉండి ఉండాలి. Ex.C-10 కూడా కనీసం మెన్షన్ చేయలేదు. ఆర్డర్ చేసిన మొబైల్ IMEI నెంబర్‌తోనే డెలివరీ చేసినట్టు ఆధారాలు చూపించలేదని పేర్కొంది. ఫలితంగా స్నాప్ డీల్, పియాష్ ఫ్యాషన్, బ్లూడార్ట్ కొరియర్ మూడింటికి మొత్తంగా రూ.లక్ష వరకు నష్ట పరిహారం చెల్లించాల్సిందిగా ఫారమ్ ఆదేశించింది. ఫిర్యాదుదారుడు శర్మకు మార్చి 4, 2017 నుంచి 8శాతం వడ్డీతో కలిపి ఐఫోన్ ఖరీదుకు రూ.81వేల 799 రీఫండ్ చెల్లించాల్సిందిగా ఆదేశాలు జారీచేసింది. దీంతో పాటు నష్టపరిహారంగా రూ.10వేలు, దావా ఖర్చులకు రూ.10వేలు చెల్లించాల్సిందిగా ఆదేశించింది.

Best Mobiles in India

English summary
Mohali engineer who was couriered soap instead of iPhone gets Rs 1 lakh compensation

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X