కొత్త ఫోన్ విలువ నెలకే తుస్, అమ్మితే సగం ధర కూడా రాదు

ప్రతి వస్తువుకు మార్కెట్లో ఓ విలువనేది ఉంటుంది. కానీ స్మార్ట్‌ఫోన్‌ల విషయంలో మాత్రం ఈ విలువ చాలా ప్రత్యేకం. మార్కెట్లోకి విడుదలయ్యే కొత్త కార్ల విలువ ఏడాదిలో 20 శాతం వరక తగ్గుతూ ఉంటే, స్మార్ట్‌ఫోన్‌ల విలుమ మాత్రం నెలకు 65 శాతం తగ్గిపోతోందని పడిపోతున్నట్లు మ్యూజిక్‌మాగ్‌పీ.కో.యూకే నివేదిక ఇటీవల వెల్లడించింది.

కొత్త ఫోన్ విలువ నెలకే తుస్, అమ్మితే సగం ధర కూడా రాదు

Read More : సంచలనం రేపుతోన్న Amazon Samsung స్పెషల్ ఆఫర్స్

అంటే మనం ముచ్చటగా వేలకు వేలు పోసి కొన్న స్మార్ట్‌ఫోన్ విలువ నెలకే సగానికి పడిపోతుందన్నమాట. ఈ సర్వేలో మరిన్ని ఆసక్తికర విషయాలు బహిర్గతమవటం విశేషం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఈ సర్వేలో మరిన్ని ఆసక్తికర విషయాలు..

ఈ సర్వేలో మరిన్ని ఆసక్తికర విషయాలు బహిర్గతమవటం విశేషం. ఐఫోన్‌లతో పోలిస్తే ఆండ్రాయిడ్ ఫోన్‌ల విలువ మరింత తగ్గిపోతున్నట్లు ఈ సర్వే చెప్పుకొచ్చింది. 

ఐఫోన్ 4 మార్కెట్లో విడుదలై ..

ఐఫోన్ 4 మార్కెట్లో విడుదలై 5 సంవత్సరాలు కావొస్తున్నప్పటికి, ఈ డివైస్ మార్కెట్ విలువ 39శాతంగా ఉందట. ఐఫోన్ 6 మార్కెట్లో విడుదలైన సంవత్సరం తరువాత, ఆ ఫోన్ మార్కెట్ వాల్యూ 50 శాతంగా ఉందట. ఐఫోన్ 5 మార్కెట్లో విడుదలైన 8 నెలలకే 66శాతం మార్కెట్ వాల్యూను కోల్పొయిందట.

2014లో విడుదలైన సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4

2014లో విడుదలైన సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 మార్కెట్ విలువ రెండు నెలలకే సగానికి పడిపోయిందట. 2015లో విడుదలైన హెచ్‌టీసీ వన్ ఎం9 విలువ నెలరోజులకే 65 శాతానికి పడిపోయిందట.

టెక్నాలజీ అంటే తెలియని ఆ రోజుల్లో

టెక్నాలజీ అంటే తెలియని ఆ రోజుల్లో మనుషుల జీవినశైలి, వారి విదివిధానాలు అలానే వారి మధ్య నెలకున్న స్వచ్ఛమైన ప్రేమానురాగాలను ఈ రోజుల్లో చూస్తున్నామా అంటే ఖచ్ఛితమైన సమాధానం మనలో ఎవరి వద్దా లేదు..?,

టెక్నాలజీని మితంగా ఉపయోగించుకున్నంత వరకు..

టెక్నాలజీని మితంగా ఉపయోగించుకున్నంత వరకు ఏ విధమైన ఇబ్బందీ ఉండదుగానీ, పరిధి దాటితే మనుషులతో సంబంధం లేని జీవితానికి భానిసలు కావల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు ‘స్మార్ట్‌ఫోన్' అనేదే వచ్చి ఉండకపోతే మనిషి ఏలా ఆలోచించేవాడో ఒకసారి చూద్దాం.

స్మార్ట్‌ఫోన్ అనేది లేకపోతే

స్మార్ట్‌ఫోన్ అనేది లేకపోతే బోలెడంత ఒత్తిడి నుంచి బయపడినట్లే. రకరకాల యాప్స్‌ను ఇన్‌‌స్టాల్ చేసుకోవాలన్న ఆలోచనే మనకు రాదు.

గంటల తరబడి ఆన్‌లైన్‌లో

స్మార్ట్‌ఫోన్ అనేది లేకపోతే గంటల తరబడి ఆన్‌లైన్‌లో గడపాల్సిన అవసరమే ఉండదు. మనుషుల మధ్య ఆత్మీయత మరింత పెరుగుతుంది.

చాటింగ్ వెబ్‌సైట్‌లలో..

ఫేస్‌బుక్, వాట్సాప్ వంటి చాటింగ్ వెబ్‌సైట్‌లలో కబుర్లు చెప్పుకోవల్సిన అవసరమే ఉండదు. లేనిపోని తలనొప్పులు అసలుండవు. 

ఫీచర్ ఫోన్స్‌ను ఇప్పటికి చాలా గొప్పగా భావిస్తాం

మాట్లాడుకునేందుకు, సందేశాలు పంపుకునేందుకు వీలున్న ఫీచర్ ఫోన్‌లను చూసి తెగ మురిసిపోతాం.

కెమెరాను ఒక విలువైన వస్తువుగా...

కెమెరాను ఒక విలువైన వస్తువుగా చూడటం మొదలు పెడతాం. చీటికి మాటికి డబ్బులను వెచ్చించి కొత్త ఫోన్‌కు అప్‌గ్రేడ్ అవ్వాలన్న ఆలోచనే రాదు.

జీవితం చాలా సెక్యూర్డ్‌గా ఉంటుం

స్మార్ట్‌ఫోన్ అనేదే లేకపోయినట్లయితే మనిషి జీవితం చాలా సెక్యూర్డ్‌గా ఉంటుంది.

చీటికి మాటికి డబ్బులను వెచ్చించి...

చీటికి మాటికి డబ్బులను వెచ్చించి కొత్త ఫోన్‌కు అప్‌గ్రేడ్ అవ్వాలన్న ఆలోచనే రాదు.బోలెడంత డబ్బును ఆదా చేసుకోవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Money-draining smartphones lose their value quicker than cars: Study. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot