‘పోస్ట్ ఆఫీస్ ద్వారా నగదు బదిలీ స్కీమ్’ త్వరలో.....

Posted By:

డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్టల్ ఇంకా బీఎస్ఎన్ఎల్ సంస్థలు సంయుక్తంగా ఏర్పడి ‘మొబైల్ మనీ ఆర్డర్' సర్వీస్‌ను ఆంధ్రపదేశ్‌లో ప్రారంభించనున్నాయి. అయితే ఈ సర్వీస్ బీఎస్ఎన్ఎల్ యూజర్‌లకు మాత్రమే వర్తించనుంది. ఈ సేవలో భాగంగా సదరు బీఎస్ఎన్ఎల్ వినియోగదారుడు తన మిత్రుడు లేదా కుటుంబ సభ్యలకు పంపాల్సిన నగదును సమీపంలోని పోస్ట్ ఆఫీస్‌లో జమ చేసినట్లయతే సదురు లావాదేవీకి సంబంధించిన సమాచారం డబ్బు పొందాల్సిన వ్యక్తి మొబైల్‌కు ఎస్ఎంఎస్ రూపంలో అందుతుంది. తన మొబైల్‌కు అందిన సందేశాన్ని సమీపంలోని పోస్ట్ ఆఫీస్‌లో చూపటం ద్వారా రిసీవర్ ఆ నగదును పొందవచ్చు.

మొబైల్ ఇంకా స్మార్ట్‌ఫోన్‌‌లకు సంబంధించి ఫోటో గ్యాలరీల చూసేందుకు క్లిక్ చేయండి:

ఇండియన్ పోస్టల్ శాఖ ఈ సర్వీస్‌ను దేశవ్యాప్తంగా 16,000 పోస్ట్ ఆఫీసుల్లో అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. జూన్ చివరి నాటికి ఈ సర్వీస్ అందుబాటులోకి రానుంది. ఈ సేవలో భాగంగా రూ.1,000 నుంచి రూ.10,000 వరకు నగదును ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.

‘పోస్ట్ ఆఫీస్ ద్వారా నగదు బదిలీ స్కీమ్’ త్వరలో.....

రూ.1000 నుంచి రూ.1,500లోపు నగదును ట్రాన్స్‌ఫర్ చేసినందుకు ట్రాన్స్‌ఫర్ ఛార్జ్ క్రింది రూ.40ను వసూలు చేస్తారు. రూ.1500 నుంచి రూ.5,000 లోపు ట్రాన్స్‌ఫర్ ఛార్జ్ క్రింద రూ.70ను వసూలు చేస్తారు. రూ.5000 నుంచి రూ.10,000 వరకు ట్రాన్స్‌ఫర్ ఛార్జ్ క్రింద రూ.100ను వసూలు చేస్తారు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting