Home
News

స్మార్ట్‌ఫోన్‌తో ఈ కోతి చేసిన పనికి నీవెరపోవడం మన వంతు

ఈ రోజులలో మన ఇంటిలో జంతువులను పెంచుకోవడం సర్వసాధారణం అయింది. అలాగే జంతువులు ఎక్కువగా పార్కులలో మరియు ప్రదర్శనశాలలో ఎక్కువగా చూస్తూ ఉంటాము. అటువంటి వాటిలో ఒక్కొక్కసారి అవి చేసే పనులకు చాలా మంది ఆశ్చర్యపోతుఉంటారు. ఆశ్చర్యం కలిగించే పనులు చేసిన వాటిలో కుక్కలు,చిలుకలు,కోతులు ఎక్కువగా కనిపిస్తాయి.

కోతులకు తెలివితేటలు

కోతుల విషయానికి వస్తే మనుషులు అందరు మొదట కోతి నుండి రూపాంతరం చెందారు అని శాస్త్రజ్ఞులు చెబుతూవుంటారు. కొంత మంది అటువంటి మాటలను కొట్టిపారేసిన అదే నిజం. అటువంటి వారికి కొన్ని కోతులు చేసిన పెను తెలిస్తే వారు కూడా ఖచ్చితంగా ఒప్పుకుంటారు. కోతులకు తెలివితేటలు మనుషులతో సమానంగా మిగిలిన జంతువుల కంటే అధికంగా ఉంటాయన్న సంగతి చాలా సందర్భాలలో రుజువైంది.

 

వీడియో

కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ నగరంలోని కిరాణా దుకాణంలో ఒక కోతి డబ్బులను దొంగతనం చేస్తున్న వీడియో సంచలనం సృష్టించింది. ఇలాంటివి మన రాజమౌళి సినిమాలలో చూస్తూ ఉంటాము. సింహాద్రి సినిమాలో కోతి కిరీటం దొంగతనం చేయడం చాలా నవ్వును కలిగిస్తుంది. దీనిని బట్టి కోతులు మనుషులతో ఎక్కువ రోజులుగా ఉంటే కనుక వారు చేసే పనులను త్వరగా నేర్చుకుంటాయి.

 

చైనా

ఇలాంటి సంఘటన చైనాలోని యాంజెంగ్ వైల్డ్ ఎనిమల్ వరల్డ్ లో జరిగింది. ఈ కోతి ఇంకాస్త ఎక్కువ తెలివితేటలు ప్రదర్శించి తన చేతికి చిక్కిన స్మార్ట్ ఫోన్ ను తీసుకుని ఏకంగా ఆన్ లైన్ లో షాపింగ్ చేసేసింది. ఇప్పుడా కోతి ఆన్ లైన్ షాపింగ్ చేస్తున్న సీసీటీవీ ఫుటేజ్ వీడియో ఇంటర్నెట్ ప్రపంచంలో తెగ చక్కర్లు కొడుతోంది.

 

అసలు విషయాలలోకి వెళితే ఈ కోతి యొక్క యోగక్షేమాలను మెంగ్ మెంగ్ అనే యువతి చూస్తుంటుంది. మధ్యాహ్న సమయంలో ఆమెకు కావలసిన కొన్ని నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయాలని కాసేపు ఆన్ లైన్ లో వెతికింది. అదే సమయంలో కోతికి ఆహారం తీసుకురావడానికి బయటకు వెళ్లాల్సి వచ్చింది. వెళ్లే ముందు ఆమె ఆ ఫోన్ ను అక్కడే వదిలేసి వెళ్లింది. ఆమె వెనక్కు తిరిగి వచ్చేసరికి మొబైల్ కు ఆర్డర్ కన్ఫర్మ్ అయినట్టు సమాచారం వచ్చింది. దీంతో షాక్ కు గురైన ఆమె అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలని సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించగా ఆ కోతి చేసిన నిర్వాకం బయటపడింది. ఆ వీడియోను ఆమె సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్త వైరల్ అయింది. దాన్ని మీరూ చూసేయండి.

More from GizBot

Best Mobiles in India

English summary
Monkey Ordered Online Food Using Smartphone, Video Viral on YouTube
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X