Just In
- 22 hrs ago
Poco X5 Pro 5G ఇండియా లాంచ్ తేదీ మరియు ధర లీక్ అయింది! వివరాలు
- 1 day ago
Infinix కొత్త స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ అయింది! లాంచ్ ఆఫర్ ధర చూడండి!
- 1 day ago
Apple iOS 16.3 కొత్త అప్డేట్ లాంచ్ చేసింది! కొత్త ఫీచర్లు తెలుసుకోండి!
- 1 day ago
వాట్సాప్ లో ఒరిజినల్ క్వాలిటీ తో ఫోటోలు పంపేందుకు కొత్త ఫీచర్! ఎలా పనిచేస్తుంది?
Don't Miss
- Movies
బ్రేకింగ్: ప్రముఖ నటి జమున కన్నుమూత.. దిగ్బ్రాంతిలో సినీ పరిశ్రమ!
- News
సమయం లేదు మిత్రమా.. బీజేపీలో ఈటల రాజేందర్ కు పెద్ద కష్టమే!!
- Sports
INDvsNZ : తొలి టీ20 పిచ్ రిపోర్ట్.. టీమిండియా మళ్లీ ఆ మ్యాజిక్ రిపీట్ చేస్తుందా?
- Lifestyle
ఉస్త్రాసనం క్యామెల్ పోజ్: నడుముకు బలం చేకూర్చి శరీరానికి శక్తినిస్తుంది
- Finance
world richest: ప్రపంచంలో అత్యంత ధనవంతులు వీళ్లే.. మరి అంబానీ, అదానీల స్థానమెంతో తెలుసా ?
- Automobiles
అప్డేటెడ్ హోండా యాక్టివా కొనేవారు తప్పకుండా తెలుసుకోవాల్సిన 5 విషయాలు
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
జియోపై ఇప్పటిదాకా పెట్టిన ఖర్చు 31 బిలియన్ డాలర్లు, గుట్టు విప్పిన మూడీస్ !
దేశీయ టెలికాం రంగంలో జియో పెను విప్లవాలను సృష్టించిన సంగతి అందరికీ తెలిసిందే. దిగ్గజాలను కోట్ల నష్టాలకు గురిచేస్తూ జియో అధినేత ముఖేష్ అంబానీ జియోను ముందుకు తీసుకువచ్చారు. అయితే జియోని ఆ స్థాయిలోకీ తీసుకురావడానికి జియో అధినేత ఎంత ఖర్చుపెట్టారు అనేదానిపై ఇప్పుడు ఆసక్తికర అంశాలు బయటకు వచ్చాయి. ఇప్పటివరకు జియో అభివృద్ధి కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 31 బిలియన్ డాలర్లకు పైగా ఖర్చు పెట్టిందని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ వెల్లడించింది.

నాలుగో పెద్ద టెలికాం కంపెనీగా ఎదగడానికి..
2016లో జియో వచ్చిన నాటి నుంచి, ఇవాళ నాలుగో పెద్ద టెలికాం కంపెనీగా ఎదగడానికి మధ్య అమలు చేసిన విధానాలను అధ్యయనం చేసిన మూడీస్ ఓ నివేదికను రూపొందించింది. దీంతో పాటు భవిష్యత్తులో జియో పేరుతో రిలయన్స్ సంస్థ పెట్టనున్న పెట్టుబడుల గురించి కూడా మూడీస్ అంచనా వేసింది.

ఫైబర్ టు హోమ్, డిజిటల్ టీవీలతో పాటు..
ఫైబర్ టు హోమ్, డిజిటల్ టీవీలతో పాటు జియో సర్వీసులను కూడా రిలయన్స్ సంస్థ భవిష్యత్తులో అభివృద్ధి చేయబోతోందని మూడీస్ పేర్కొంది. 4జీ ఫోన్ల తయారీ, నెట్‌వర్క్‌లో నాణ్యతలను కూడా జియో అందించనుంది.

23 బిలియన్ల డాలర్లను పెట్టుబడిగా పెట్టే అవకాశం..
రానున్న కాలంలో జియో వీటిపై 23 బిలియన్ల డాలర్లను పెట్టుబడిగా పెట్టే అవకాశం ఉందని మూడీస్ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో జియో ప్రస్థానంపై ఇప్పుడు అనేక ఆసక్తికర అంశాలు బయటకు వస్తున్నాయి.

జియో అంటే హిందీలో జీవించు అని అర్థం
రిలయన్స్ నుంచి పుట్టిన జియో అంటే హిందీలో అర్థం ఏంటో తెలుసా జీవించు అని. అంబాని అదే చెబుతున్నారు..మీరు మాములుగా జీవించవద్దు ఎంజాయ్ చేస్తూ జీవించడం అని చెబుతున్నారు. ఏన్నో ఏళ్లుగా పాతుకుపోయిన దిగ్గజ ప్రత్యర్థులను ఒకే ఒక అస్త్రంతో చావు దెబ్బ కొట్టారు.

ప్రస్థానం ఎక్కడ నుంచి మొదలైంది..
అయితే ఈ జియో ప్రస్థానం ఎక్కడ నుంచి మొదలైంది.. రిలయెన్స్ జియో ఇన్ఫోకామ్ ఎలా రూపుదిద్దుకుంది?అంటే చాలా ఆసక్తికర సమాధానాలు వినిపిస్తాయి. అవి తెలుసుకోవాలంటే 2010లోకి వెళ్లాలి.

2010 మే నెలలో..
2010 మే నెలలో నాలుగేళ్ళపాటు పరస్పరం పోటీ పడకూడదన్న ఒప్పందాన్నిముఖేశ్ అంబానీ, అనిల్ అంబానీ రద్దుచేసుకున్నారు. ఇద్దరు అన్నదమ్ములూ విడిపోయే సమయంలో ఆ ఒప్పందం రాసుకున్న సంగతి పాఠకులకు గుర్తుండే ఉంటుంది. దీంతో అనిల్ అంబాని టెలికామ్ వ్యాపారంలో ప్రవేశించేందుకు మార్గం సుగమమైంది.

2010 జూన్ లో..
వెనువెంటనే 2010 జూన్ లో ప్రభుత్వం బ్రాడ్ బాండ్ అండ్ వైర్లెస్ యాక్సెస్ (బిడబ్ల్యుఎ) వేలం నిర్వహిస్తున్నప్పుడు వేలం ధరలు సహేతుక పరిమితి దాటి పోయాయంటూ వోడాఫోన్, అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్, టాటా కమ్యూనికేషన్స్ వెనకడుగేశాయి.

ఇన్ఫోటెల్ బ్రాడ్ బాండ్ సర్వీసెస్
అయితే, ఇన్ఫోటెల్ బ్రాడ్ బాండ్ సర్వీసెస్ అనే ఒకే ఒక సంస్థ మాత్రం రంగంలో నిలబడి 12 వేల 847 కోట్ల 77 లక్షలకు వేలం పాడి దేశవ్యాప్తంగా మొత్తం 22 సర్కిల్స్ కు ఏకైక విజేతగా మారింది. దేశవ్యాప్తంగా ఆ సంస్థ ఒక్కటే వేలంలో రూ. 4,800 కోట్లకు లైసెన్స్ గెలుచుకుంది.

కంపెనీ ఏంటో ఎవరూ తొంగిచూడకముందే..
ఆ కంపెనీ ఏంటో ఎవరూ తొంగిచూడకముందే ముఖేశ్ అంబానీకి చెందిన రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఆ వేలం జరిగిన మరుసటి రోజే అందులో 95 శాతం వాటా కొనేసింది.ఆ తరువాత జరిగిన ఇన్వెస్టర్ల సమావేశంలో రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ దేశంలో వైమాక్స్ లేదా ఎల్టీఈ లేదా 4 జి మొబైల్ టెక్నాలజీ ద్వారా వైర్లెస్ బ్రాడ్ బాండ్ సర్వీసులు అందజేస్తుందని ప్రకటించారు.

సమావేశంలో కంపెనీ మరో ప్రకటన..
అదే సమావేశంలో కంపెనీ మరో ప్రకటన కూడా చేసింది. వచ్చే ఏడాది కాలంలో ఈ సంస్థలో 18 నుంచి 20 వేలకోట్ల పెట్టుబడులు పెడుతున్నట్టు చెప్పింది. అప్పటి నుంచి పూర్తి స్థాయిలో సేవలు మొదలుపెట్టకపోయినా సంస్థ మాత్రం తన మౌలిక సదుపాయాలు, మానవ వనరులు బలోపేతం చేసుకోవటానికి తగిన ఏర్పాట్లలో తలమునకలైంది.

2013 జనవరిలో..
ఆ వేలం తర్వాత ఇన్పోటెల్ అనే సంస్థ మిగతా టెల్కోలకు షాకిస్తూ వస్తూనే ఉంది. మూడేళ్ళపాటు అనేక నగరాలలో ప్రయోగాత్మకంగా 4జీని పరీక్షిస్తూనే వచ్చింది తప్ప ఎలాంటి కీలకమైన ప్రకటనా చేయలేదు.అయితే, 2013 జనవరిలో రిలయెన్స్ ఇండస్ట్రీస్ సంస్థ ఇన్ఫోటెల్ బ్రాడ్ బాండ్ పేరును రిలయెన్స్ జియో గా మార్చింది. అప్పటి నుంచి టెక్ దిగ్గజాలకు షాకిస్తూ వస్తూనే ఉంది.

కీలక ఒప్పదం..
అదే సమయంలో రిలయన్స్ జియో ఇన్పోకామ్ భారతి ఎయిర్ టెల్ మధ్య ఓ కీలక ఒప్పదం కూడా జరిగింది. భారత్, సింగపూర్ మధ్య సముద్రంగుండా ఉన్న భారతి ఫైబర్ కేబుల్ ను రిలయెన్స్ జియో వాడుకునేలా ఆ ఒప్పందం కుదిరింది.

ఆసియా పసిఫిక్ అంతటా..
దాని వలన రిలయెన్స్ జియో కు ఆసియా పసిఫిక్ అంతటా ప్రధాన కేంద్రాలకు అత్యంత వేగవంతమైన కనెక్టివిటీ దొరకటంతోబాటు నేరుగా అనుసంధానమయ్యే వీలుంటుంది. ఇది ముందే ఊహించి ఉండే అవకాశం కూడా లేకపోలేదని మార్కెట్ వర్గాల కథనం

రిలయన్స్ జియో, రిలయన్స్ కమ్యూనికేషన్ మధ్య ఒప్పందం
దీంతో పాటు ఆర్ కామ్ కు దేశవ్యాప్తంగా ఉన్న టెలికామ్ టవర్లు తదితర మౌలిక సదుపాయాలను కలిసి వాడుకునేలా రిలయెన్స్ జియో, రిలయెన్స్ కమ్యూనికేషన్ మధ్య ఒప్పందం కుదిరింది. ఇందుకు ప్రతిఫలంగా రిలయెన్స్ జియో ఏకమొత్తంగా రూ. 1673 కోట్లు చెల్లించింది.

మరో కంపెనీ అయిన ఎటిసి..
ఇక మరో కంపెనీ అయిన ఎటిసి ( american tower corporation) తో కూడా ఇదే ఒప్పందం కుదుర్చుకుంది. దేశవ్యాప్తంగా ఎటిసి ఇండియా వారి టెలికామ్ టవర్ సదుపాయాన్ని కలిసి వాడుకోవటానికి ఆ సంస్థతో కూడా రిలయెన్స్ జియో ఒక ఒప్పందం చేసుకుంది.

అక్కడ నుంచి ప్రస్థానం..
ఇక అక్కడ నుంచి ప్రస్థానం మొదలైందనే చెప్పాలి. ఐఐటి ముంబై లో జరిగిన టెక్ ఫెస్ట్ లో రిలయెన్స్ జియో తన 4 జి నెట్ వర్క్ ను పరీక్షించి చూసింది. వీడియో కాల్స్ ను, జియో టెలివిజన్ సర్వీస్ ను పరీక్షించింది. అప్పుడే మొత్తం 5 వేల పట్టణాలు, నగరాలు, 2 లక్షల 15 వేల గ్రామాలకు విస్తరిస్తామని ముఖేశ్ అంబానీ స్వయంగా ప్రకటించారు.

హాత్ వే మాజీ ఎండీ, సీఈవో జయరామన్ ..
రిలయెన్స్ జియో దేశవ్యాప్త డిజిటల్ ఎమ్మెస్వో లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవటంతోబాటు టీవీ రంగంలో బాగా పేరుమోసిన హాత్ వే మాజీ ఎండీ, సీఈవో జయరామన్ ను, మాజీ డెన్ నెట్ వర్క్స్ సీఈవో ఎస్ ఎన్ శర్మ ను ఈ వెంచర్ నడపటం కోసం అప్పట్లో తీసుకున్నారు.

రిలయెన్స్ జియో ఉచితంగా 4 జి వైఫై ..
అప్పటినుంచి పరీక్షలు జరుపుతూనే ఉంది. అందులో భాగంగా ఐపిఎల్ ముంబై ఇండియన్స్ మాచ్ ల సందర్భంగా వాంఖేడీ స్టేడియం పరిసరాల్లో రిలయెన్స్ జియో ఉచితంగా 4 జి వైఫై సౌకర్యం కల్పించటం కూడా తెలిసిందే. ఇప్పుడు ఇండియాలో దిగ్గజాలకు చుక్కుల చూపిస్తూ ముందుకు దూసుకుపోతోంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470