Home
News

చందమామ వయసు,సంచలన విషయాలు వెలుగులోకి

By Gizbot Bureau

రాత్రివేళ చందమామను చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది. మరి ఆ చందమామా ఎంతో దూరాన ఉన్నప్పటికీ తెల్లగా మెరిసిపోతూ కనిపిస్తుంటాడు. చందమామను చూస్తున్నప్పుడు వయసు ఎంత ఉంటుంది అనే సందేహం ఎవరికైనా కలిగిందా.. చాలామందికే కలిగే ఉంటుంది. మనం ఇప్పటి వరకు చంద్రుడి వయసు భూమి కంటే చాలా తక్కువ అని భావిస్తూ వచ్చాం.

The Moon Is 100 Million Years Older Than We Thought, Apollo Rocks Show

కానీ, చాలా ఎక్కువేనట. తాజాగా నాసా శాస్త్రవేత్తలు చందమామ వయసును కచ్చితంగా లెక్కించారు. చంద్రుడు ఉద్భవించిన కాలం గురించి ఇప్పటివరకు మనకి తెలిసినదంతా వాస్తవం కాదని తాజా పరిశోధనలో వెల్లడైంది.

సౌర వ్యవస్థ ఏర్పడిన తర్వాత

సౌర వ్యవస్థ ఏర్పడిన తర్వాత

ఓ కొత్త అధ్యయనం ప్రకారం చందమామ వయసు గతంలో గుర్తించినదాని కంటే ఎక్కువేనని తేలింది. సౌర వ్యవస్థ ఏర్పడిన తర్వాత 15 కోట్ల సంవత్సరాలకు చందమామ ఏర్పడినట్టు పరిశోధకులు గతంలో అంచనా వేశారు.

 జర్మనీలోని కొలోగ్నె యూనివర్సిటీ శాస్త్రవేత్తల అధ్యయనం

జర్మనీలోని కొలోగ్నె యూనివర్సిటీ శాస్త్రవేత్తల అధ్యయనం

అయితే సౌర వ్యవస్థ ఏర్పడిన తర్వాత 5 కోట్ల సంవత్సరాలకే చందమామ ఏర్పడినట్టు జర్మనీలోని కొలోగ్నె యూనివర్సిటీ శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో నిర్వహించిన అధ్యయనంలో తేలింది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియాలజీ అండ్ మినరాలజీ బృందం నాసా యొక్క ప్రఖ్యాత అపోలో మిషన్ల సమయంలో చంద్రుడిపై నుంచి తీసుకొచ్చిన వివిధ శాంపిళ్లను విశ్లేషించి వీరు ఈ నిర్ధారణకు వచ్చారు.

456 కోట్ల ఏళ్ల కింద సౌర వ్యవస్థ

456 కోట్ల ఏళ్ల కింద సౌర వ్యవస్థ

జర్మనీలోని కొలోన్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అధ్యయనం ప్రకారం సుమారు 456 కోట్ల ఏళ్ల కింద సౌర వ్యవస్థ ఆవిర్భవించిందని, ఆ తర్వాత అంటే సౌర వ్యవస్థ ఏర్పడిన సుమారు 5 కోట్ల ఏళ్లకు చంద్రుడి ఉనికిలోకి వచ్చాడని వారు వెల్లడించారు. దీనికోసం అపోలో మిషన్‌ సమయంలో సేకరించిన రసాయనాలను విశ్లేషించారు. 1969 జూలై 21న నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌, ఎడ్విన్‌ ఆల్ర్డిన్‌ చంద్రుడిపై కాలుమోపిన సందర్భంగా అక్కడి నుంచి 21.55 కిలోల శాంపిళ్లను భూమిపైకి తీసుకొచ్చారు.

 అపోలో–11 మిషన్‌

అపోలో–11 మిషన్‌

1969 జూలై 21న మొదటిసారి చంద్రుడిపై అపోలో-11 మిషన్‌ ద్వారా మనిషి అడుగుపెట్టాడు. అక్కడ గడిపిన కొన్ని గంటల్లోనే వారు సుమారు 21.55 కిలోల మట్టిని తీసుకొచ్చారు. ప్రస్తుతం దీనిని విశ్లేషించే చంద్రుడి పుట్టుక గురించి కనుగొన్నారు. అలాగే చంద్రుడి వయసుని కనుగొనడం ద్వారా భూ గ్రహం ఎప్పుడు ఎలా పుట్టిందనే విషయాన్ని తెలుసుకోవచ్చని చెబుతున్నారు.

ఘర్షణ ఫలితం

ఘర్షణ ఫలితం

నేచర్‌ జియోసైన్స్‌ జర్నల్‌లో ఈ వివరాలను ప్రచురించారు. వేర్వేరు సమయాల్లో ఏర్పడిన శిలలలోని విభిన్న మూలకాల యొక్క సాపేక్ష మొత్తాలను పోల్చడం ద్వారా, ప్రతి నమూనా చంద్రుడి లోపలి మరియు శిలాద్రవం సముద్రం యొక్క పటిష్టతకు ఎలా సంబంధం కలిగి ఉందో తెలుసుకోవచ్చని అధ్యయన సహ రచయిత రౌల్ ఫోన్సెకా ఒక ప్రకటనలో తెలిపారు. అంగారక-పరిమాణ గ్రహ శరీరానికి మరియు ప్రారంభ భూమికి మధ్య భారీ ఘర్షణ ఫలితంగా చంద్రుడు పుట్టి ఉండవచ్చన్నారు.

Best Mobiles in India

English summary
The Moon Is 100 Million Years Older Than We Thought, Apollo Rocks Show
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X