Wipro నుంచి 300 ఉద్యోగులు అవుట్‌.. మూన్‌లైటింగ్ పాల్ప‌డితే ఇంటికే!

|

ఒకే స‌మ‌యంలో ర‌హ‌స్యంగా రెండు కంపెనీల్లో ప‌ని చేసే ఉద్యోగుల‌పై ఐటీ కంపెనీలు క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి. దీన్నే టెక్ ప‌రిభాష‌లో మూన్‌లైటింగ్(ఒకేసారి అన‌ధికారికంగా రెండు కంపెనీల్లో ప‌నిచేయ‌డం) అని కూడా అంటారు. ఇటీవ‌ల Wipro కంపెనీ ఈ త‌ర‌హా మూన్‌లైటింగ్‌కు పాల్ప‌డిన త‌మ 300 మంది ఉద్యోగుల‌ను తొల‌గించింది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ఆ కంపెనీ ఛైర్మ‌న్ రిష‌ద్ ప్రేమ్‌జీ ధ్రువీక‌రించారు. త‌మ సంస్థ‌కు చెందిన 300 మంది ఉద్యోగులు ప్ర‌త్య‌ర్థి కంపెనీల్లో కూడా ప‌ని చేస్తున్న‌ట్లు క‌నుగొన్నామ‌ని.. వారిని సంస్థ నుంచి తొల‌గించామ‌ని రిష‌ద్ పేర్కొన్నారు. మూన్‌లైటింగ్ కు పాల్ప‌డ‌టం అంటే కంపెనీ యొక్క‌ సమగ్రతను పూర్తిగా ఉల్లంఘించడమేనంటూ తాను ఇటీవల చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని ప్రేమ్‌జీ నొక్కి చెప్పారు.

 
Wipro నుంచి 300 ఉద్యోగులు అవుట్‌.. మూన్‌లైటింగ్ పాల్ప‌డితే ఇంటికే!

ఆల్ ఇండియ మేనేజ్‌మెంట్ అసోసియేష‌న్‌(AIMA) నేష‌న‌ల్ మేనేజ్‌మెంట్ క‌న్వెన్ష‌న్ మీటింగ్‌లో రిష‌ద్ ఈ ర‌క‌మైన‌ వ్యాఖ్య‌లు చేశారు. " ప్ర‌స్తుతం విప్రో కంపెనీ కోసం ప‌ని చేస్తున్న కొంద‌రు వ్య‌క్తులు.. అదే స‌మ‌యంలో ఇత‌ర ప్ర‌త్య‌ర్థి కంపెనీల‌కు కూడా ప‌ని చేస్తున్నారు. గత కొన్ని నెలల్లో అలాంటి వారిని సరిగ్గా 300 మందిని మేము కనుగొన్నాము," అని ఆయ‌న వెల్ల‌డించారు. అయితే, అలాంటి వారిపై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకున్నార‌నే విష‌యంపై ఆయ‌న స్పందిస్తూ.. వారంద‌రినీ కంపెనీ స‌మ‌గ్ర‌తా నియ‌మావ‌ళి ఉల్లంఘ‌న కింద ఉద్యోగాల నుంచి తొల‌గించిన‌ట్లు చెప్పారు.

Wipro లో ప‌ని చేస్తూనే మరియు ర‌హ‌స్యంగా ఇత‌ర పోటీ కంపెనీల కోసం ప‌ని చేయ‌డానికి వీలు లేదన్నారు. అలా చేయ‌డం ఉల్లంఘ‌న కింద‌కే వ‌స్తుందంటూ.. ఈ విష‌యంలో త‌న వ్యాఖ్య‌ల‌కు క‌ట్టుబ‌డి ఉన్న‌ట్లు రిష‌ద్ తెలిపారు. ప్రేమ్‌జీ ఈ సమస్యపై ఇటీవ‌ల ట్విట్టర్‌లోనూ స్పందించారు. టెక్ పరిశ్రమలో మూన్‌లైటింగ్ గురించి ప్ర‌స్తావిస్తూ.. ఇది మోసం అని పేర్కొన్నారు.

మ‌రోవైపు, మూన్‌లైటింగ్ వ్య‌వ‌హారంపై అనేక ఇత‌ర కంపెనీలు గట్టి వైఖరిని తీసుకున్నాయి. ఈ నెల ప్రారంభంలో, ఇన్ఫోసిస్ తన ఉద్యోగులకు మూన్‌లైటింగ్ ను ఎట్టి ప‌రిస్థితుల్లోను ఉపేక్షించేది లేద‌ని తేల్చి చెప్పింది. మరియు కాంట్రాక్ట్ నిబంధనలను ఉల్లంఘిస్తే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది, ఇది "ఉద్యోగాన్ని తొల‌గించ‌డానికి కూడా దారి తీయొచ్చు" స్ప‌ష్టం చేసింది. "ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే క్రమశిక్షణా చర్యలకు దారి తీస్తుంది, ఇది ఉద్యోగాన్ని రద్దు చేయడానికి కూడా దారి తీస్తుంది" అని ఇన్ఫోసిస్ మెయిల్ పేర్కొంది.

Wipro నుంచి 300 ఉద్యోగులు అవుట్‌.. మూన్‌లైటింగ్ పాల్ప‌డితే ఇంటికే!

వ‌ర్క్ ఫ్రం హోం కార‌ణ‌మా!
క‌రోనా వెలుగులోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి వ‌ర్క్ ఫ్రం హోం ప్రారంభ‌మైంది. వ‌ర్క్ ఫ్రం హోం కార‌ణంగా ఉద్యోగులు ఇంటి వ‌ద్ద నుంచి మూన్‌లైటింగ్‌కు పాల్ప‌డుతున్నార‌ని నిపుణుల అంచ‌నా. అయితే.. సిబ్బంది క్రమంగా కార్యాలయాల‌కు తిరిగి రావడం వల్ల ఈ త‌ర‌హా ఆందోళనలు తగ్గుతాయని చాలా మంది నమ్ముతున్నారు. ఈ మూన్‌లైటింగ్ కార‌ణంగా.. డేటా ఉల్లంఘనలకు దారి తీయ‌వ‌చ్చ‌ని,.. మరియు కంపెనీ మేధో సంపత్తి (IP), ఆస్తులు తప్పుగా ఉపయోగించబడవచ్చని టెక్ కంపెనీలు ఆందోళన చెందుతున్నాయి.

వ‌ర్క్ ఫ్రం ఆఫీసుకు కంపెనీల పాట్లు: సీఐఈఎల్‌ స‌ర్వే వెల్ల‌డి
క‌రోనా వైర‌స్ వెలుగులోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఐటీ స‌హా చాలా రంగాల్లోని కంపెనీలు Work From Home స‌దుపాయాన్ని అమ‌ల్లోకి తెచ్చాయి. ఉద్యోగులు వైర‌స్ బారిన ప‌డ‌కుండా వారి సంక్షేమం కోసం ఈ Work From Home బాగా ఉప‌యోగ‌ప‌డింది. అయితే ప్ర‌స్తుతం ఐటీ కంపెనీలకు ఈ వ‌ర్క్ ఫ్రం హోం కొత్త త‌ల‌నొప్పులు తెచ్చిపెడుతోంద‌ట‌. ప్ర‌స్తుతం Work From Office ప్రారంభించాల‌ని ప‌లు ఐటీ కంపెనీలు ఉద్యోగుల‌ను పిలుస్తుండ‌గా.. చాలా మంది ఆఫీస్‌కు వెళ్లేందుకు నిరాక‌రిస్తున్నార‌ట‌. ఈ మేర‌కు సీఐఈఎల్ అనే హెచ్ఆర్ కంపెనీ నిర్వ‌హించిన స‌ర్వే వెల్ల‌డించింది. ఇంకా ఈ స‌ర్వేలో ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి.

 

చాలా కంపెనీలు చాలా Return To Office విధానాన్ని చాలా సున్నితంగా ప్రారంభిస్తున్నాయి. బ‌ల‌వంతం చేస్తే ఉద్యోగుల రాజీనామాలు పెరిగే సూచ‌న‌లున్నాయ‌ని ఆందోళ‌న‌లో ఉన్నాయి. CIEL భారతదేశంలోని టాప్ 10లో ఉన్న వాటితో 40 IT కంపెనీలను సర్వే చేసింది, అందులో మొత్తం 900,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. చాలా మంది ఉద్యోగులు ఇంటి నుండి (WFH) లేదా మరెక్కడైనా పని చేయాలనుకోవడం వల్ల WFOకి మార్చ‌డం కష్టంగా ఉందని CIEL HR సర్వీసెస్ CEO ఆదిత్య మిశ్రా అన్నారు.

Best Mobiles in India

English summary
Moonlighting is cheating, wipro fired 300 employees for doing same.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X