30సార్లు చతికలిబడితే.. ఒలింపిక్స్ టికెట్ ఫ్రీ

Posted By:

30సార్లు చతికలిబడితే.. ఒలింపిక్స్ టికెట్ ఉచితం

2014 వింటర్ ఒలింపిక్స్ ఇంకా భౌతికమైన ఫిట్నెస్ ను ప్రమోట్ చేసే క్రమంలో రష్యన్ ఒలంపిక్స్ కమిటీ ఓ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో మాస్కో సిటీ అధికారులు మాస్కో మెట్రోలో సబ్ వే ప్రయాణీకుల  ప్రత్యేక మెషీన్ ను ఏర్పాటు చేయటం జరిగింది. ఎవరైనా సరే ఈ మెషీన్ కెమెరా ముందు నిలుచొని 30 సార్లు చతికలిబడి లేచినట్లయితే ఒలంపిక్స్ కు వెళ్లేందుకు ఉచిత టెకెట్ ను పొందవచ్చు. ఉచిత టికెట్ ను దక్కించుకునే క్రమంలో పలువురు తమ శరీరాలను ఇలా శ్రమ పెట్టారు....

<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/ojo9M1cPSPI? feature=player_embedded" frameborder="0" allowfullscreen></iframe></center>

రష్యన్ రాకెట్ సోయూజ్ ద్వారా అంతర్జాతీయ అంరిక్షపరిశోధనా కేంద్రంలో కాలుమోపి స్పేస్‌వాక్ చేసిన వింటర్ 2014 ఒలంపిక్స్ టార్చ్ ‘సోచి' సోమవారం ఉదయం భూమికి చేరకుంది. అతర్జాతయీ అంతరిక్ష పరిశోధనా కేంద్రం ఐఎస్ఎస్‌కు సరుకులతో పాటు వ్యోమగాములను మోసుకుపోయే రష్యన్ రాకెట్ సోయూజ్ గురువారం సోచి 2014 ఒలంపిక్ కాగడాతో పాటు ముగ్గురు వ్యోమగామలను అంతరిక్షంలోకి మోసుకెళ్లింది. ఒలంపిక్ టార్చ్ అంతరిక్షంలోకి ప్రయాణించటం కొత్తేమి కాదు. 1996, 2000 సంవత్సరాల్లోనూ ఒలంపిక్ కాగడాలు అంతరిక్ష ప్రయాణాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే, వీటి భిన్నంగా సోచి స్పేస్ క్రాఫ్ట్‌ను విడిచి స్పేస్‌వాక్ చేయడం విశేషం.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot