మోసర్ బేర్ స్పెషల్ ఎడిషన్ పెన్‌డ్రైవ్‌లు!

Posted By: Prashanth

మోసర్ బేర్ స్పెషల్ ఎడిషన్ పెన్‌డ్రైవ్‌లు!

 

ప్రముఖ కంప్యూటింగ్ ఉపకరణాల తయారీ బ్రాండ్ మోసర్ బేర్ (Moser Baer) దీపావళి సీజన్‌ను పురస్కరించుకని స్పెషల్ ఎడిషన్ జ్యూవెలరీ పెన్‌డ్రైవ్‌లను అందుబాటులోకి తెచ్చింది. హిందువులు పవిత్రంగా ఆరాధించే ‘గణేషా’, ‘లక్ష్మి’ ప్రతిమలతో కూడిన ఫ్లాష్ డ్రైవ్‌లను మోసర్ బేర్ ఆఫర్ చేస్తోంది. వీటిని అభరణాల్లా ధరించవచ్చు . పండుగ నేపధ్యంలో వీటిని మిత్రులకు బహుమతిగా ఇస్తే కొత్తగా ఫీలవుతారు. 4జీబి ఇంకా 8జీజి మెమరీ వేరియంట్‌లలో ఇవి లభ్యమవుతున్నాయి.

ఫీచర్లు:

2.0/1.1 ఇంటర్ ఫేస్,

ఈ ఫ్లాష్ డ్రైవ్ లు దాదాపు అన్ని వోఎస్ లను సపోర్ట్ చేస్తాయి,

మోసర్ బేర్ గణేషా పెన్ డ్రైవ్ చుట్టుకొలత 21 X 41.4 X 10మిల్లీ మీటర్లు,

మోసర్ బేర్ లక్ష్మి పెన్ డ్రైవ్ చుట్టుకొలత 6 x 41 x 8.1మిల్లీ మీటర్లు,

బరువు చైన్ తో కలుపుకుని 15.6 నుంచి 16.7 గ్రాములు.

పెన్‌డ్రైవ్ మంచిదో, నకిలీదో తెలుసుకోవాలంటే..?

కంప్యూటర్లు అందుబాటులోకి వచ్చాకా ఎంతటి పనినైనా సునాయాశంగా చక్కబెట్టేస్తున్నాం. కట్టల కొద్ది రికార్డులను రాయటం వాటిని దాయటం వంటి బెడదలు తప్పాయి. గణన యంత్రానికి బంధువుల్లా పుట్టుకొచ్చిన ఉపకరణాలలో పెన్‌డ్రైవ్ ఒకటి. చిన్న సైజ్ బాక్స్ పరిమాణాన్ని కలిగి ఉండే ఈ బుల్లి స్టోరేజ్ డ్రైవర్ పెద్ద మొత్తంలో సమాచారాన్ని స్టోర్ చేస్తుంది. 2జీ, 4జీ, 8జీబి, 16జీబి ఇలా అనేక మెమరీ వేరింయట్‌లలో ఈ పెన్‌డ్రైవ్‌లు లభ్యమవుతున్నాయి. బ్రాండెడ్ పెన్‌డ్రైవ్‌ల విలువ రూ.400 నుంచి ప్రారంభమవుతోంది. అయితే, పెన్‌డ్రైవ్‌లకు సైతం నకిలీ మకిలి అంటుకుంది. పలువురు డబ్బుకు కక్కుర్తిపడి డూప్లికేట్ పెన్‌డ్రైవర్లను తయారు చేస్తూ కస్టమర్లకు కుచ్చుటోపి పెడుతున్నారు. అసలుకు నకిలీకు తేడాలేనంతగా వీటి డిజైనింగ్ ఉంటోంది.

పెన్‌డ్రైవ్ కొనుగోలు చేసే సమయంలో తీసుకోవల్సిన జాగ్రత్తలు?

- మీరు ఎంపిక చేసుకున్నపెన్‌డ్రైవ్ మీద సీరియల్ నెంబర్‌ను దాని సీల్డ్ కవర్ పై ఉన్న నెంబర్‌తో పోల్చి చూసుకోవాలి. నెంబరు విషయంలో ఏమాత్రం తేడా ఉన్నా, అసలు నెంబరే లేకున్నా అది నకిలీదని నిర్థారణకు వచ్చేయచ్చు. నకిలీ పెన్‌డ్రైవ్‌ల పై సీరియల్ నెంబర్లు ఉండవు.

- నాసిరకం ప్లాస్టిక్‌ను ఉపయోగించటం చేత పెన్‌డ్రైవ్‌లు తక్కువ బరువును కలిగి ఉంటాయి. కాబట్టి బరువు విషయంలోనూ ఓ కన్నేసి ఉంచండి.

- అలాగే పెన్‌డ్రైవ్ మీద ఉన్న లోగోను స్ర్కాచ్ చేసి చూడిండి అది తొలగిపోయినట్లయితే ఖచ్చితంగా ఆ పెన్‌డ్రైవ్ నకిలీదే. కంపెనీ పెన్‌డ్రైవ్‌లపై ముద్రించిన లోగో చెక్కు చెదరదు.

Read In English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot