2023 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది డిలీట్ చేసేందుకు ప్రయత్నించిన యాప్ ఏంటో తెలుసా?
ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తోంది. అత్యధిక శాతం మంది ఎక్కువ సమయంలో సోషల్ మీడియాలోనే గడుపుతున్నారు. అయితే వారి ప్రాధాన్యతలు సహా ఇతర కారణాలతో తమకు నచ్చని యాప్‌లను తొలగిస్తున్నారు. అందువల్ల సోషల్ మీడియా సంస్థ కూడా యూజర్లను ఆకట్టుకొనే విధంగా అనేక ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి.
వెలుగులోకి ఆసక్తికర విషయం.. ! : అయితే మరికొన్ని రోజుల్లో 2023 సంవత్సరం ముగిసిపోనుంది. అయితే ఈ ఏడాది కాలంలో జరిగిన ఆసక్తికర అంశాలపై ఆరా తీస్తుంటారు. అయితే ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సంవత్సర కాలంలో కొన్ని యాప్‌లను తొలగించేందుకు నెటిజన్లు ప్రయత్నించారు. అయితే ఈ జాబితాలో ఎక్కువ మంది ఊహించని యాప్ ఉంది.

వినియోగదారుల ప్రాధాన్యతలో గణనీయమైన మార్పు : మెటా నేతృత్వంలోని ఇన్‌స్టాగ్రామ్ (Instagram) ప్రస్తుతం గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. అమెరికాకు చెందిన TRG డేటాసెంటర్స్ కీలక విషయాలను వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి నెలలో సుమారు 1 మిలియన్‌కు పైగా ఇన్‌స్టా యూజర్లు తమ ఖాతాను డిలీట్ చేసేందుకు కావాల్సిన ప్రక్రియ కోసం సెర్చ్ చేశారని తెలిపింది. ఇది వినియోగదారుల ప్రాధాన్యతలో గణనీయమైన మార్పును సూచిస్తుందని తెలిపింది.
ఈ సంవత్సరంలోని 12 నెలల ట్రెండ్స్‌ను విశ్లేషించిన వివరాల ఆధారంగా మొత్తంగా 10,20,000 మంది తమ ఖాతాలను తొలగించాలని చూస్తున్న వారితో ఇన్‌స్టాగ్రామ్ ముందంజలో ఉంది. స్నాప్‌చాట్ 1,28,500, ట్విట్టర్ 12300, టెలిగ్రామ్ 71,700, ఫేస్‌బుక్ 49,000, టిక్‌టాక్ 24,900, యూట్యూబ్ 12,500, వాట్సాప్ 4950, వీచాట్ 2090 మంది ఈ యాప్‌లను తొలగించేందుకు ప్రయత్నం చేశారు.

ఎక్కువ మంది డిలీట్ చేసిన యాప్ : 2023 సంవత్సరంలో అత్యధికంగా తొలగించబడుతున్న యాప్‌గా ఇన్‌స్టాగ్రామ్ నిలిచిందని.. టీఆర్‌జీ డేటాసెంటర్స్‌లో చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ క్రిస్ హింకిల్ తెలిపారు. ఇది మారుతున్న పరిస్థితిని తెలియజేస్తోందని పేర్కొన్నారు. ఇది ఇతర పోటీ యాప్‌లకు కలిసి వచ్చేదిగా మారనుంది.
ఈ పరిస్థితికి కారణం ఏంటి : ఇన్‌స్టాగ్రామ్‌కు ప్రపంచవ్యాప్తంగా 2 బిలియన్లకు పైగా వినియోగదారులు ఉన్నారని సంస్థ చెబుతోంది. అయితే గత కొన్నాళ్లుగా పెరుగుతున్న యాడ్స్ మరియు బ్రాండ్ ప్రమోషన్ కోసం ప్లాట్‌ఫాంను ఉపయోగిస్తున్న ఇన్‌ఫ్లుయెన్సర్‌లు సహా అనేక కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది.
టీఆర్‌జీ డేటా సెంటర్స్ సంస్థ వెల్లడించినట్లుగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి నెల ఒక మిలియన్ మంది ప్రజలు యాప్‌ను తొలగించాలని కోరుకునే ఈ ట్రెండ్ కొనసాగితే.. భవిష్యత్‌లో ఇన్‌స్టాగ్రామ్‌కు ఇబ్బందులు తప్పవని పరిశోధకులు చెబుతున్నారు. అయితే స్నాప్‌చాట్‌ను 2011లో ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా యాప్‌ను తొలగించేందుకు 1,30,000 మంది ప్రయత్నం చేశారు. అయినా ప్రస్తుతం ఈ యాప్ 750 మిలియన్ల యాజర్లను కలిగి ఉంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








