21వ శతాబ్థపు సాంకేతిక సంచలనాలు

Posted By:

ప్రజాజీవితాన్ని మరింత సుఖవంతం చేస్తూ ప్రపంచ దిశనే మార్చేసిన వినూత్నఆవిష్కరణలు చాలానే ఉన్నాయి. క్రమక్రమంగా తన ఆలోచనలకు పొదునుపెడుతూ వచ్చిన మనిషి ఆధునిక వైజ్ఞానిక ఆవిష్కరణల వైపు దృష్టిని మళ్లించి ప్రపంచాభివృద్ధిలో కీలక పాత్ర పోషించాడు. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా టెక్నాలజీ ప్రపంచంలో చోటుచేసుకున్న పలు ఆవిష్కరణలను మీతో షేర్ చేసుకుంటున్నాం......

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

21వ శతాబ్థపు సాంకేతిక సంచలనాలు

యాపిల్ ఐపోడ్ (2001)

యాపిల్ సంస్థ 2001లో ప్రవేశపెట్టిన ఐపోడ్ పోర్టబుల్ ఎంపీ3 ప్లేయర్ల విభాగంలో సరికొత్త శకానికి నాంది పలికింది.

 

21వ శతాబ్థపు సాంకేతిక సంచలనాలు

మొజిల్లా ఫైర్‌ఫాక్స్ (2002)

మైక్రోసాఫ్ట్ ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌కు పోటీగా 2002లో విడుదలైన ఫైర్‌ఫాక్స్ వెబ్‌బ్రౌజర్ వెబ్ బ్రౌజర్‌ల జాబితాలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది.

 

21వ శతాబ్థపు సాంకేతిక సంచలనాలు

స్కైప్ (2003)

నెటిజనులు అత్యధికంగా వినియోగించే సాఫ్ట్‌వేర్ అప్లికేషన్‌లలో స్కైప్ (skype)ఒకటి, ఈ ప్రత్యేక సాఫ్ట్‌వేర్ సర్వీస్‌ను ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నవారు ఉపయోగించుకోవచ్చు. ఈ యాప్ ద్వారా ఉచితంగా మొబైల్, ల్యాండ్ ఫోన్‌లకు కాల్స్ చేసుకోవచ్చు అలానే వీడియో చాటింగ్ కూడా నిర్వహించుకోవచ్చు. హీన్లా, ప్రిట్, జాన్ తాల్లిన్ అనే ముగ్గురు డెవలపర్లు ఈ ప్లాట్‌ఫామ్‌ను వృద్ధి చేశారు. ప్రపంచవ్యాప్తంగా స్కైప్‌కు 600 మిలియన్‌ల యూజర్లు ఉన్నారు. సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్, స్కైప్ ప్లాట్‌ఫామ్‌ను 2011లో $8.5బిలియన్‌లు చెల్లించి సొంతం చేసుకుంది. ఫైల్ ట్రాన్స్‌ఫర్, వీడియో కాన్ఫిరెన్సింగ్ వంటి అదనపు ఫీచర్లను స్కైప్ కలిగి ఉంది.

 

21వ శతాబ్థపు సాంకేతిక సంచలనాలు

ఫేస్‌బుక్ (2004)

ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందిన పాపులర్ సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్ ‘ఫేస్‌బుక్'. 2004 ఫిబ్రవరి 4వ తేదిన హార్వర్డ్ యూనివర్సిటిలోని డార్మిటరీ రూమ్‌లో మార్క్ జూకర్‌బర్గ్ ఫేస్‌బుక్‌ను ప్రారంభించారు. ఆతర్వాత కొద్దికాలంలో అత్యంత ప్రజాదరణ కలిగిన వెబ్‌సైట్‌గా ఫేస్‌బుక్ చరిత్ర సృష్టించింది.

 

21వ శతాబ్థపు సాంకేతిక సంచలనాలు

యూట్యూబ్ (2005)

యూట్యూబ్... ఇదో వీడియోల ప్రపంచం. రంగం ఏదైనా.. అంశాలు ఎన్నైనా.. సెర్చ్ కొడితే చాలు బోలెడంత సమాచారం వీడియోల రూపంలో మీ ముందు ప్రత్యక్షమవుతుంది. ఈ యూనివర్సల్ వీడియో సైట్ ద్వారా వీడియోలను అప్‌లోడ్ చేసుకోవటంతో పాటు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. యూట్యూబ్‌ను 2005 ఫిబ్రవరిలో ప్రారంభించారు. వ్యవస్థాపకులు స్టీవ్‌చెన్, చాడ్  హ్యూర్లీ, జావెద్ కరీమ్.

 

21వ శతాబ్థపు సాంకేతిక సంచలనాలు

2007లో యాపిల్ కంపెనీ నుంచి మొట్టమొదటిసారిగా విడుదలైన ఐఫోన్ మొబైల్ ఫోన్ల విభాగంలె విప్లవాత్మక మార్పులకు కారణమైంది..

21వ శతాబ్థపు సాంకేతిక సంచలనాలు

అమెజాన్ కైండిల్ (2007)

అమెజాన్ కంపెనీ విడుదల చేసిన మొట్టమొదటి ఈబుక్ రీడర్

21వ శతాబ్థపు సాంకేతిక సంచలనాలు

గూగుల్ ఆండ్రాయిడ్ (2008)

21వ శతాబ్థపు సాంకేతిక సంచలనాలు

2008లో వెరిజాన్ అనే టెలికామ్ నెట్‌వర్క్ క్యారియర్ 4జీ నెట్‌వర్క్‌ను మొట్టమొదటి సారిగా ఆవిష్కరించింది. 3జీ నెట్‌వర్క్‌ తో పోలిస్తే 4జీ నెట్‌వర్క్‌ మరింత వేగవంతంగా స్పందిస్తుంది.

21వ శతాబ్థపు సాంకేతిక సంచలనాలు

యాపిల్ ఐప్యాడ్ (2010)

ఐప్యాడ్ ఆవిష్కరణతో యాపిల్ ప్రపంచానికి మొట్టమొదటి సారిగా పోర్టబుల్ కంప్యూటింగ్‌ను పరిచయం చేసింది.

 

21వ శతాబ్థపు సాంకేతిక సంచలనాలు

ఐబీఎమ్ వాట్సన్ (2011)

ఐబీఎమ్ సంస్థ రూపొందించిన ఈ కంప్యూటర్ మనిషి కంటే తెలివైనది.

21వ శతాబ్థపు సాంకేతిక సంచలనాలు

గూగుల్ డ్రైవర్‌లెస్ కార్ (2014)

గూగుల్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్ట్  డ్రైవర్‌లెస్ కార్. డ్రైవర్ లేకుంగా ప్రయాణించగలిగే ఈ కార్‌ను కాలీఫోర్నియా, శాన్‌ఫ్రానిస్కో వంటి రద్దీ ప్రదేశాల్లో పరీక్షించి గూగుల్ విజయం సాధించింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Most important inventions of the 21st Century: in pictures. Read more in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot