ఇంటర్నెట్ మైలురాళ్లు
ప్రపంచవ్యాప్తంగా వందల కోట్లమంది కమ్యూనికేషన్ అవసరాలను తీరుస్తున్న అంతర్జాలం(ఇంటర్నెట్) ఇటీవల 30వ పడిలోకి అడుగుపెట్టింది. 1876లో అలెగ్లాండర్ గ్రాహం బెల్ రూపొందించిన టెలిఫోన్ యంత్రం ప్రేరణతోనే ఇంటర్నెట్ భావన పుట్టుకొచ్చింది. 1983 జనవరి ఒకటో తేది నుంచి ఇంటర్నెట్ అధికారికంగా పనిచేయడం ప్రారంభించింది.
అయితే మొట్టమొదటి ఇంటర్నెట్ ప్రయోగం 1969, మే1వ తేదీనే జరిగింది. తరువాత ఏర్పడ్డ శాటిలైట్, కేబుల్, టవర్ వ్యవస్థలు ఇంటర్నెట్‌ను భూగోళమంతా వ్యాపింపచేసాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఇంటర్నెట్ చరిత్రలో చోటుచేసుకున్న మైలురాళ్లను మీ ముందుంచుతున్నాం...

ఏవోఎల్ తక్షణ సందేశ సేవలు (ప్రారంభం 1997):
ఈ కంట్రోల్ వీడియో కార్పొరేషన్‌ను 1983లో ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ కంపెనీలకు ఈ కంపెనీ ఆన్‌లైన్ సర్వీస్‌లను అందిస్తోంది. సంస్థ ప్రధానకార్యాలయం న్యాయార్క్ నగరంలోని 770 బ్రాడ్‌వేలో ఉంది.

గూగుల్ (ప్రారంభం 1998):
సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్‌ను 1998లో ప్రారంభించారు. లారీ పేజ్, సెర్జీ బ్రిన్‌లు ఈ కంపెనీని స్థాపించారు.

కొత్త కేబుల్ లైన్‌లు (ప్రారంభం 2000):
కమ్యూనికేషన్ విస్తరణలో భాగంగా కొత్త కేబుల్ లైన్‌లు ఏర్పడ్డాయి. వీటిని ఇతర భూభాగంలోకి సముద్ర మార్గం గుండా వ్యాపింప చేశారు. ఈ ప్రక్రియనే సబ్ మెరైన్ కమ్యూనికేషన్ అంటారు. సముద్ర గర్భాల్లో వినియోగిస్తున్న ఆధునిక వర్షన్ కేబుల్స్ ఫైబర్ టెక్నాలజీని కలిగి డిజిటల్, ఇంటర్నెట్ ఇంకా టెలికమ్యూనికేషన్ డేటాను సెకన్లలో ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాయి.

వికీపీడియా (ప్రారంభం 2000):
వివిధ అంశాలకు సంబంధించిన డాటా వివిధ భాషల్లో ఇక్కడ లభ్యమవుతుంది. ఈ టాపిక్‌లను ఎవరైనా ఎడిట్ చేయవచ్చు. అంతర్జాలంలో వికీపీడియాకు గొప్స స్ధానం ఉంది.

ఆన్‌లైన్ ఫైల్ షేరింగ్ (Online file-sharing):
డిజిటల్ వర్షన్‌లో స్టోర్ చేసిన సమాచారాన్ని ఆన్‌లైన్ ద్వారా షేర్ చేసే ప్రక్రియ 2001లో ప్రారంభమైంది. ఇంటర్నెట్ చరిత్రలో ఇదో గొప్ప మైలురాయిగా భావించవచ్చు.

స్కైప్, 2003 (Skype, 2003):
నెటిజనులు అత్యధికంగా వినియోగించే సాఫ్ట్‌వేర్ అప్లికేషన్‌లలో స్కైప్ (skype)ఒకటి, ఈ ప్రత్యేక సాఫ్ట్‌వేర్ సర్వీస్ ఇంటర్నెట్ ద్వారా ఉచిత వీడియో చాటింగ్ నిర్వహించుకునేందుకు ఉపకరిస్తుంది. హీన్లా, ప్రిట్, జాన్ తాల్లిన్ అనే ముగ్గురు డెవలపర్లు ఈ ప్లాట్‌ఫామ్‌ను వృద్ధి చేశారు. ప్రపంచవ్యాప్తంగా స్కైప్‌కు 600 మిలియన్‌ల యూజర్లు ఉన్నారు. సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్, స్కైప్ ప్లాట్‌ఫామ్‌ను 2011లో $8.5బిలియన్‌లు చెల్లించి సొంతం చేసుకుంది. ఫైల్ ట్రాన్స్‌ఫర్, వీడియో కాన్ఫిరెన్సింగ్ వంటి అదనపు ఫీచర్లను స్కైప్ కలిగి ఉంది.

యూట్యూబ్, 2004 (YouTube, 2004):
యూట్యూబ్... ఇదో వీడియోల ప్రపంచం. రంగం ఏదైనా.. అంశాలు ఎన్నైనా.. సెర్చ్ కొడితే చాలు బోలెడంత సమాచారం వీడియోల రూపంలో మీ ముందు ప్రత్యక్షమవుతుంది. ఈ యూనివర్సల్ వీడియో సైట్ ద్వారా వీడియోలను అప్‌లోడ్ చేసుకోవటంతో పాటు
డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. యూట్యూబ్‌ను అధికారికంగా 2005 నవంబర్‌లో ప్రారంభించారు. సాన్ బ్రూనో ఈ కపెంనీని నెలకొల్పారు. కొద్దికాలంలోని యూట్యూబ్‌ను గూగుల్ ఇంక్ $1.65 చెల్లించి సొంతం చేసుకుంది. కాలిఫోర్నియా ముఖ్య కేంద్రంగా యూట్యూబ్ కార్యకలాపాలు సాగిస్తోంది.

నెట్‌ఫ్లిక్స్ వీడియో స్ట్రీమింగ్, ప్రారంభం 2006 (Netflix video streaming, 2006):
అమెరికాకు చెందిన ఇంటర్నెట్ స్ట్రీమింగ్ మీడియా నెట్‌ఫ్లిక్స్ వీడియ్ స్ట్రీమింగ్ సేవలను 2006లో ప్రారంభించింది. ఈ వీడియో సైట్ ద్వారా లక్షలాది వీడియోలను తిలకించవచ్చు.

ఫేస్‌బుక్, 2004 (Facebook, 2004):
100కోట్ల పై చిలుకు యాక్టివ్ యూజర్లతో సోషల్ నెట్‌వర్కింగ్ ప్రపంచాన్ని శాసిస్తున్న ఫేస్‌బుక్‌కు గొప్ప చరిత్రే ఉంది. తొలత ఈ సామాజిక సైట్ ‘ఫేస్‌మాష్ డాట్‌కామ్ 'గా ప్రారంభమైంది. దీని రూపకర్త మార్క్ జూకర్స్ బర్గ్ హార్వర్డ్ విశ్వవిద్యాలయంలోని తన మిత్రులతో కలిసి ఫేస్‌మాష్ కార్యకలాపాలను ప్రారంభించాడు.సదరు విశ్వవిద్యాలయంలోని అమ్మాయిలు, అబ్బాయిల ఫోటోలను వారికి తెలియకుండా వారి వారి ప్రొఫైల్స్ నుంచి సేకరించి తన లోకల్ నెట్‌వర్క్‌లో పొందుపరిచాడు. ఈ చర్య మార్క్‌ను నేరారోపణలు ఎదుర్కొనేలా చేసింది. ఈ వివాదం ముగిసిన అనంతరం 2004, ఫిబ్రవరి 4వ తేదిన ఫేస్‌మాష్ డాట్‌కామ్ ‘ద ఫేస్‌బుక్ డాట్ కామ్'గా రూపాంతరం చెందింది. 30 రోజుల వ్యవధిలోనే ద ఫేస్‌బుక్ కాస్తా ఫేస్‌బుక్‌లా మారిపోయింది.

యాపిల్ ఐప్యాడ్ ఆవిష్కరణ, 2010 (Launch of iPad, 2010):
పోర్టబుల్ కంప్యూటింగ్‌ను చేరువచేస్తూ యాపిల్ ఐప్యాడ్ పేరుతో సరికొత్త కంప్యూటింగ్ ట్యాబ్లెట్‌ను ఏప్రిల్3, 2010న ఆవిష్కరించింది. ప్రస్తుత మార్కెట్లో 4వ తరం ఐప్యాడ్ ఇంకా ఐప్యాడ్ మినీలు లభ్యమవుతున్నాయి.

40 మిలియన్‌లు దాటిన అప్లికేషన్ డౌన్‌లోడ్‌లు (App downloads hits 40 billion):
అంతర్జాలం మరింతగా విస్తరించటంతో అప్లికేషన్‌ల వినియోగం మరింత పెరిగింది. గూగుల్ ఆండ్రాయిడ్, విండోస్, యాపిల్, బ్లాక్ బెర్రీ వోఎస్‌లను సపోర్ట్ చేసే అనేక అప్లికేషన్‌లు వెబ్ ప్రపంచంలో లభ్యమవతున్నాయి. 2012నాటికి ప్రపంచవ్యాప్తంగా అప్లికేషన్ డౌన్‌లోడ్‌ల సంఖ్య 40 బిలియన్‌లు దాటినట్లు సమాచారం.


Click it and Unblock the Notifications








