‘హౌటూ లింక్ ఆధార్ కార్డ్ విత్ పాన్‌కార్డ్’.. గూగుల్ ఎక్కువుగా వెదికిన సెర్చ్ రిజల్ట్ ఇదే

|

2017 దాదాపుగా ముగింపుకు చేరుకున్న నేపథ్యంలో సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ ఈ ఏడాదికిగాను భారతీయలు అత్యధికంగా శోధించిన సెర్చ్ రిజల్ట్స్ వివరాలను రివీల్ చేసింది. వాటిలో టాప్ ట్రెండింగ్ హౌ టూ, వాట్ ఈజ్, న్యూస్, సాంగ్స్, మూవీస్ తదితర అంశాలు ఉన్నారు.

 
‘హౌటూ లింక్ ఆధార్ కార్డ్ విత్ పాన్‌కార్డ్’.. గూగుల్ రిజల్ట్ ఇదే !

టెక్నాలజీ విభాగానికి గాను 'హౌటూ లింక్ ఆధార్ కార్డ్ విత్ పాన్‌కార్డ్’ (How to link Aadhaar card with PAN card), హౌటూ బుక్ జియో ఫోన్ (How to book Jio phone), హౌ టూ బుయ్ బిట్‌కాయిన్ ఇన్ ఇండియా (How to buy bitcoin in India) వంటి సెర్చ్ రిజల్ట్స్ మొదటి మూడు స్థానాల్లో ట్రెండింగ్‌గా నిలిచాయి.

బ్యాంక్ అకౌంట్, పాన్ కార్డ్, మొబైల్ నెంబర్ లతో ఆధార్ అనుసంధాన్ని తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో చాలా మంది యూజర్లు గూగుల్ సెర్చ్ ద్వారా ఈ అనుసంధాన ప్రక్రియను తెలుసుకునే ప్రయత్నం చేసారు. దీంతో 'హౌటూ లింక్ ఆధార్ కార్డ్ విత్ పాన్‌కార్డ్’ అనే సెర్చ్ రిజల్ట్ కు ప్రాధాన్యత సంతరించుకుంది.

ఆపిల్ కంపెనీకి భారీ షాకిచ్చిన కేంద్ర ప్రభుత్వం, ఒక్కసారిగా ధరలు పైకి !ఆపిల్ కంపెనీకి భారీ షాకిచ్చిన కేంద్ర ప్రభుత్వం, ఒక్కసారిగా ధరలు పైకి !

ఇక కోట్లాది మంది యూజర్లు ఎంతో ఆతృతగా ఎదురుచూసిన రిలయన్స్ జియో ఫీచర్ ఫోన్ కూడా ఈ ఏడాదే మార్కెట్లో లాంచ్ అవటంతో ఈ ఫోన్ బుకింగ్ కోసం చాలా మంది యూజర్లు గూగుల్ ద్వారా ప్రయిత్నించారు. క్రిప్టోకరెన్సీగా పిలవబడుతోన్న బిట్‌కాయిన్ విలువ మొదటిసారిగా 10000 డాలర్లు దాటడంతో దీని గురించి కూడా భారీతీయులు ఎక్కువుగా సెర్చ్ చేసినట్లు గూగుల్ తెలిపింది.

ఇక టాప్ టెన్ 'వాట్ ఈజ్’ (What is) ట్రెండ్స్ విషయానికి వచ్చేసరికి 'వాట్ ఈజ్ జియో ప్రైమ్’ (What is Jio Prime), వాట్ ఈజ్ ర్యాన్సమ్‌వేర్ (What is Ransomware) వంటి సెర్చ్ రిజల్ట్స్ 6, 10 స్థానాల్లో నిలిచాయి. WannaCry, WanaCrypt0r 2.0, WannaCry, WCry పేర్లతో ఓ ప్రమాదకర రాన్సమ్‌వేర్ ఇటీవల ఇంటర్నెట్ ప్రపంచాన్ని వణికించింది. విండోస్ ఆధారిత కంప్యూటర్లే లక్ష్యంగా చెలరేగిన ఈ ప్రమాదకర వైరస్ ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలను అతలాకుతలం చేసింది. దీంతో ఈ టాపిక్ గురించి కూడా భారతీయులు ఎక్కువుగా సెర్చ్ చేసినట్లు గూగుల్ తెలిపింది.

Best Mobiles in India

English summary
Google has revealed the most searched queries in 2017 and ‘How to link Aadhaar card with PAN card’ tops the list.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X