ప్రపంచంలో 2021లో అత్యధికంగా అమ్ముడైన ఆపిల్ బ్రాండ్ ఐఫోన్ మోడల్‌లు ఇవే...

|

స్మార్ట్‌ఫోన్‌లను అధికంగా ఉపయోగించే నేటి ఫాస్ట్ ప్రపంచంలో 2021 సంవత్సరంలో ఆపిల్ బ్రాండ్ యొక్క ఐఫోన్ లు అధికంగా ఆధిపత్యం చెలాయించాయి. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడవుతున్న టాప్ 10 స్మార్ట్‌ఫోన్‌ పరికరాలలో ఏడు ఆపిల్ బ్రాండ్ యొక్క ఐఫోన్‌లు ఉండడం విశేషం. 2021లో ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడైన పరికరాలను జాబితాను కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ ఒక నివేదికను విడుదల చేసింది. జాబితాలో ఉన్న మరో రెండు స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థలు సామ్ సంగ్ మరియు షియోమి మాత్రమే. వీటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

కౌంటర్‌పాయింట్

కౌంటర్‌పాయింట్ యొక్క నివేదిక ప్రకారం 2021లో అధికంగా అమ్ముడైన టాప్ 10లో షియోమి బ్రాండ్ రెండు స్థానాలను మరియు Samsung ఒక స్థానాన్ని కలిగి ఉండడం విశేషం. 2021లో గ్లోబల్ మార్కెట్‌లో 4,200 కంటే ఎక్కువగా స్మార్ట్‌ఫోన్ మోడల్‌లు యాక్టివ్ దశలో ఉన్నాయి. మొత్తం స్మార్ట్‌ఫోన్ మార్కెట్ వాటాలో 10 బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్‌లు 19 శాతాన్ని ఆక్రమించాయని కౌంటర్ పాయింట్ నివేదిక సూచించింది. 2020లో ఈ మార్కెట్ వాటా 16 శాతంగా ఉంది. అంటే ఒక సంవత్సరానికి దీని యొక్క విలువ అదనంగా మరొక 3 శాతం పెరిగింది.

టాప్ 10

2021 సంవత్సరంలో అధికంగా అమ్ముడైన టాప్ 10లో మొదటి ఐదు మోడల్‌లు ఆపిల్ బ్రాండ్ యొక్క ఐఫోన్‌లు కావడం మరొక గమతైన విషయం. అయితే ఇందులో ఐఫోన్‌ 12 అత్యధికంగా అమ్ముడైన మోడల్‌గా ఉంది. తర్వాత స్థానంలో ఐఫోన్‌ 12 ప్రో మాక్స్ , ఐఫోన్ 13, ఐఫోన్‌ 12 ప్రో మరియు ఐఫోన్ 11 మోడల్‌లు ఉన్నాయి. మొదటి మూడు మోడల్‌లు ఆపిల్ యొక్క మొత్తం విక్రయాలలో 41% వృద్ధికి దోహదపడ్డాయి.

2021లో ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్ మోడల్‌ల జాబితా
 

2021లో ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్ మోడల్‌ల జాబితా

ఆపిల్ ఐఫోన్ 12
ఆపిల్ ఐఫోన్ 12 ప్రో మాక్స్
ఆపిల్ ఐఫోన్ 13
ఆపిల్ ఐఫోన్ 12 ప్రో
ఆపిల్ ఐఫోన్ 11
సామ్ సంగ్ గెలాక్సీ A12
షియోమి రెడ్‌మీ 9A
ఆపిల్ ఐఫోన్ SE 2020
ఆపిల్ ఐఫోన్ 13 Pro మాక్స్
షియోమి రెడ్‌మీ 9

ఐఫోన్‌లు ఎందుకు బాగా ప్రాచుర్యం పొందాయి?

ఐఫోన్‌లు ఎందుకు బాగా ప్రాచుర్యం పొందాయి?

కౌంటర్‌పాయింట్ నివేదిక ప్రకారం బలమైన మరియు విశ్వసనీయ iOS యూజర్ బేస్ ద్వారా 5G అప్‌గ్రేడ్‌ల కోసం పెండింగ్‌లో ఉన్న డిమాండ్ మరియు క్యారియర్‌ల నుండి పుష్ ఐఫోన్ 12 సిరీస్ వాల్యూమ్‌లకు దారితీసింది. అంతేకాకుండా ఐఫోన్ 12 సిరీస్ ఆలస్యంగా ప్రారంభించడం వలన 2021 ప్రారంభ నెలలలో కొంత హాలిడే సీజన్ కావడంతో డిమాండ్‌ మరింత పెరిగింది. తాజా ఐఫోన్ 13 సిరీస్ మంచి పనితీరును కనబరుస్తోంది. Q4 2021లో ఐఫోన్ 13 అత్యుత్తమంగా అమ్ముడవుతున్న మోడల్‌గా నిలిచింది. తర్వాత స్థానాలలో ఐఫోన్ 13 ప్రో మాక్స్ మరియు ఐఫోన్ 13 ప్రో ఉన్నాయి.

జాబితాలో

జాబితాలో మొదటి నాన్-ఐఫోన్ Samsung Galaxy A12 ఉండడం విశేషం. భారతదేశంలో ఇది మిడ్-రేంజర్ పరిధిలో అందుబాటులోకి వచ్చింది. దాదాపు అన్ని ప్రాంతాలు మరియు దేశాలు ఏడాది పొడవునా A12కి బలమైన డిమాండ్‌ని చూపించాయని నివేదిక పేర్కొంది. ఉత్తర అమెరికా, లాటిన్ అమెరికా మరియు పశ్చిమ ఐరోపా దేశాలలో దీని యొక్క మార్కెట్‌ అగ్రస్థానంలో ఉన్నాయి.

షియోమి

షియోమి యొక్క Redmi 9A మరియు Redmi 9 స్మార్ట్‌ఫోన్‌లు కూడా 2021లో అధికంగా అమ్ముడైన జాబితాలోకి చోటును దక్కించుకున్నాయి. ఈ బ్రాండ్ యొక్క మొత్తం విక్రయాలకు 22% సహకారంతో కంపెనీ అభివృద్ధికి దోహదపడ్డాయి. షియోమి అన్ని ప్రాంతాలలో మంచి పనితీరు కనబరుస్తుందని కౌంటర్ పాయింట్ పేర్కొంది. చైనా, భారతదేశం మరియు ఆసియా-పసిఫిక్ ప్రాంతాలలో ఇది మార్కెట్ పరంగా అగ్రస్థానంలో ఉన్నాయి. షియోమి తన బడ్జెట్ మోడళ్లైన Redmi 9A మరియు 9 వంటి ధరలను గుర్తించే ప్రాంతాలలో ముందుకు తెచ్చింది. ఇక్కడ దాని ఎంట్రీ-టైర్ సిరీస్ కోసం కాంపోనెంట్ కొరతను ఎదుర్కొంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Most Selling Apple Brand iPhone Models in The World in 2021

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X