జూన్ 2023 లో లాంచ్ కాబోతున్న టాప్ స్మార్ట్ ఫోన్లు! లిస్ట్, లీక్ అయిన వివరాలు
ఈ నెల మే 2023 న కొన్ని కొత్త ఫోన్‌లు ఇప్పటికే లాంచ్ అయ్యాయి. గూగుల్ పిక్సెల్ 7a (Google Pixel 7a), పోకో F5 (Poco F5), రెడ్ మీ A2 సిరీస్ (Redmi A2 సిరీస్). అదేవిధంగా, జూన్ 2023 నెలలో కొన్ని ఉత్తమ స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేయబోతున్నారు. త్వరలో రాబోయే ఈ ఫోన్ల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
కాబట్టి జూన్ 2023లో భారతదేశంలో వన్‌ప్లస్, నథింగ్, రియల్ మీ నుండి శామ్‌సంగ్, ఐక్యూ, మోటరోలా నుండి విడుదల కానున్న 7 ట్రెండింగ్ ఫోన్‌ల లిస్ట్ ఇక్కడ ఇస్తున్నాము గమనించండి.

వన్ ప్లస్ నోర్డ్ 3 (OnePlus Nord 3): ఇది వన్ ప్లస్ నోర్డ్ సిరీస్‌లో లాంచ్ చేయబడే కొత్త మిడ్‌రేంజ్ ధర ఫోన్ ఇది . ఖచ్చితమైన లాంచ్ తేదీ ఇంకా వెల్లడి కాలేదు. అయితే జూన్ చివరి నాటికి ఎలాగూ లాంచ్ చేయాలని భావిస్తున్నారు. వన్ ప్లస్ నోర్డ్ 3 స్మార్ట్‌ఫోన్ 6.74-అంగుళాల డిస్‌ప్లే, డైమెన్సిటీ 9000 చిప్‌సెట్, 50MP సోనీ IMX890 + 8MP అల్ట్రా వైడ్ + 2MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో OIS సపోర్ట్, 16MP సెల్ఫీ కెమెరాతో ప్యాక్ చేయవచ్చు. దీని ధర రూ.30,000 - రూ.32,000 మధ్య ఉండవచ్చు.
నథింగ్ ఫోన్ 2 (Nothing Phone 2): తర్వాత లిస్ట్ లో అత్యంత ట్రెండింగ్ లో ఉన్న మిడ్‌రేంజ్ ఫోన్‌లలో ఒకటిగా మారింది, నథింగ్ ఫోన్ 2 ఇప్పటికే స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 చిప్‌సెట్, 4700mAh బ్యాటరీతో రాబోతున్నట్లు నిర్ధారించబడింది. ఈ స్మార్ట్ ఫోన్ రూ. 40,000 బడ్జెట్‌తో ఇది లాంచ్ కాబోతున్నట్లు అంచనాలున్నాయి.
శాంసంగ్ గెలాక్సీ F54 5G (Samsung Galaxy F54 5G):ఈ ఫోన్ జూన్ 2023లో లాంచ్ చేయబడే మరో మిడ్‌రేంజ్ మోడల్. దాదాపు రూ. 35,999 వద్ద లాంచ్ అవుతుందని అంచనా వేయబడిన ఈ స్మార్ట్‌ఫోన్ శాంసంగ్ యొక్క శక్తివంతమైన ఎక్సీనోస్ 1380 CPUని కలిగి ఉంటుంది.
ఇది 8G RAM మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్, 108MP మెయిన్ సెన్సార్, 8MP అల్ట్రా-వైడ్ సెన్సార్ మరియు ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌లో 2MP మాక్రో లేదా డెప్త్ సెన్సార్, 6.7-అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే, 6000mAh బ్యాటరీ వంటి ఫీచర్లను కలిగి ఉండే అవకాశం ఉంది. మరియు 25W ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ కూడా కలిగి ఉంది.
Realme 11 Pro 5G Series: ఇప్పటికే చైనాలో లాంచ్ అయిన Realme 11 Pro మరియు Realme 11 Pro Plus స్మార్ట్‌ఫోన్‌లు భారతీయ మార్కెట్లో త్వరలో లాంచ్ కానున్నాయి.
ఈ రెండు ఫోన్‌లలో 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ కర్వ్డ్ డిస్‌ప్లే, ఆక్టాకోర్ 6nm మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్‌సెట్, 5000mAh బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి. ప్రో మరియు ప్రో ప్లస్ మోడల్‌ల మధ్య కెమెరాలు మరియు ఫాస్ట్ ఛార్జింగ్ సామర్ధ్యంలో తేడాలు ఉన్నాయి.
iQOO నియో 7 ప్రో: iQOO నియో 7 ప్రో జూన్‌లో భారత మార్కెట్లో లాంచ్ చేయబోతోంది. ఇది స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 SoC ద్వారా పనిచేస్తుందని నిర్దారించబడుతుంది. అదనంగా, ఇది 120W రాపిడ్ ఛార్జింగ్‌కు మద్దతుతో వస్తుంది.
మోటోరోలా X40: ఇది రాబోయే వారాల్లో భారతీయ మార్కెట్లో సేల్ చేయబడుతుంది అని భావిస్తున్నారు. ఇది స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్‌సెట్, 165 Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల డిస్‌ప్లే, ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, IP68 రేటింగ్‌తో వస్తుందని అంచనాలున్నాయి.


Click it and Unblock the Notifications








