మీకు ఉపయోగపడే 5 ఇంట్రెస్టింగ్ వెబ్ సైట్స్

భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇంటర్నెట్ వినియోగం విస్తృతంగా వ్యాప్తి చెందుతోంది. ముఖ్యంగా దేశంలోని యువత సోషల్ మీడియాకు ఆకర్షితులవుతున్నారు.

By Anil
|

భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇంటర్నెట్ వినియోగం విస్తృతంగా వ్యాప్తి చెందుతోంది. ముఖ్యంగా దేశంలోని యువత సోషల్ మీడియాకు ఆకర్షితులవుతున్నారు.ముక్యంగా ఫేస్‌బుక్, ట్విట్టర్, లింకిడన్, గూగుల్+, యూట్యూబ్ వంటి ఆన్‌లైన్ కమ్యూనికేషన్ న్సైట్స్ కు మంచి ఆదరణ లభిస్తోంది. అయితే చాలా మంది ఇంటర్నెట్ వ్యవస్థను కేవలం కమ్యూనికేషన్ అవసరాలు ఇతర వినోద కార్యాకలాపాలకు మాత్రమే వినియోగించుకుంటున్నారు. అయితే కొన్ని మనకు ఉపయోగపడే వెబ్ సైట్స్ కూడా చాలా ఉంటాయి. ఈ శీర్షిక లో భాగంగా మీకు ఉపయోగపడే కొన్ని వెబ్ సైట్స్ ను తెలుపుతున్నాము. ఓ లుక్కేయండి.

 

www.norse.com

www.norse.com

ఈ మధ్యకాలం లో మనం ఎక్కడ చూసిన ransomeware అనే పేరుతో హ్యాకర్స్ ఎటాక్ చేసారు అని వింటూ ఉంటాం. ఇది ఒక్కటే కాదు ప్రపంచ వ్యాప్తంగా కొన్ని వేల మంది హ్యాకర్స్ కొన్ని లక్షల హ్యాకింగ్స్ చేస్తుంటారు. మీరు వాటిని లైవ్ లో చూడాలి అనుకుంటే norse అనే వెబ్ సైట్ కు వెళ్లి live attacks అనే ఆప్షన్ ను క్లిక్ చేయండి. ఈ వెబ్ సైట్ లో ప్రపంచం లో ప్రతి క్షణం ఎన్ని హ్యాకింగ్స్ జరుగుతున్నాయి ఏ దేశం నుండి ఏ దేశం కు ఎటాక్ జరుగుతుంది హ్యాక్ చేసే వాళ్ళ ip అడ్రస్ ఇలా అన్ని వివరాలు ఈ వెబ్ సైట్ లో ఉంటాయి . అయితే ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న సైబర్ ఎటాక్స్ లో కేవలం 1% హ్యాకింగ్స్ మాత్రమే ఈ వెబ్ సైట్ లో చూపిస్తుంది ఎందుకంటే అన్ని హ్యాకింగ్స్ చూపిస్తే మీరు వాడే వెబ్ బ్రౌజర్ హ్యాంగ్ అయిపోతుంది.

 

 

www.siteworthtraffic.com
 

www.siteworthtraffic.com

మనం ప్రతి రోజు ఎన్నో వెబ్ సైట్స్ ఓపెన్ చేస్తూ ఉంటాం. ఆ వెబ్ సైట్ క్రియేట్ చేసిన వాళ్ళు ఆ వెబ్ సైట్ నుండి డబ్బులు సంపాదిస్తుంటారు. అయితే ఏ వెబ్ సైట్ నుండి ఎంత సంపాదిస్తున్నారో తెలుసుకోవాలి అంటే siteworthtraffic వెబ్ సైట్ ఓపెన్ చేయండి. ఏ వెబ్ సైట్ గురించి చూడాలి అనుకుంటున్నారో ఆ వెబ్ సైట్ లింక్ ఇచ్చి submit మీద క్లిక్ చేస్తే ఆ వెబ్ సైట్ ను రోజుకి ఎంత మంది చూస్తున్నారో ప్రపంచ వ్యాప్తంగా ఆ వెబ్ సైట్ ర్యాంక్ ఎంత ఇలా ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు.

www.smallpdf.com

www.smallpdf.com

సాధారణంగా మనం కంప్యూటర్లో ఎవరికైనా ఫైల్స్ గాని డాకుమెంట్స్ గాని పంపించాలి అన్నపుడు pdf రూపం లో పంపుతూ ఉంటాం. అయితే ఒక్కోసారి ఈ pdf ను ఎడిట్ చేయవల్సి వస్తుంది లేదా jpg ఫార్మాట్ లోకి మార్చాల్సి వస్తుంది అటువంటి సమయం లో smallpdf అనే వెబ్ సైట్ కి ఓపెన్ చేస్తే సరిపోతుంది. ఈ వెబ్ సైట్ లో pdf ను కంప్రెస్ చేయడం jpg ఫార్మాట్ నుంచి pdf లోకి మార్చడం ఇలా చాల చాల చేసుకోవచ్చు. అయితే ఒక్కోసారి కొన్ని pdf ఫైల్స్ లాక్ లో ఉంటాయి అటువంటి ఫైల్స్ ను అన్ లాక్ చేయాలన్న ఇలా pdf ఫైల్స్ కు సంబందించిన ఎటువంటి సమస్య వచ్చిన ఈ smallpdf వెబ్ సైట్ ను ఉపయోగించవచ్చు.

www.savefrom.net

www.savefrom.net

యూట్యూబ్ లో నచ్చిన వీడియో డౌన్ లోడ్ చేసుకోవడానికి ఫోన్ లో ఉండే Tubemate వంటి యాప్స్ ను వాడుతూ ఉంటాం. కానీ వాటిలో ఒక్కోసారి వీడియోల డౌన్ లోడింగ్ మధ్యలో ఆగిపోతుంది లేదా వీడియో అంత డౌన్ లోడ్ అవుతుంది గాని ప్లే చేసినప్పుడు మధ్యలో struck అయిపోతుంది ఆలా కాకుండా మీకు నచ్చిన వీడియో ను డౌన్ లోడ్ చేసుకోవడానికి బెస్ట్ వెబ్ సైట్ ఈ www.savefrom.net . ఈ వెబ్ సైట్ లో మీరు ఏ వీడియోను డౌన్ లోడ్ చేద్దాం అనుకున్నారో ఆ వీడియో URL లింక్ ఇస్తే మీకు కావాల్సిన వీడియో ను మీకు కావల్సిన ఫార్మాట్ లో డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అలాగే పేస్ బుక్ లోని వీడియోస్ కూడా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

www.ted.com

www.ted.com

ఈ వెబ్ సైట్ లో చిన్న చిన్న వీడియోస్ ఉంటాయి. మీరు యుట్యూబ్ లో ted అని సెర్చ్ చేస్తే కొన్ని వేల వీడియోస్ వస్తాయి.ఇవి సామాన్యమైన వీడియోలు కాదు ఒక్కో వీడియో మీ జీవితాన్నే మార్చేయగలదు . సైన్స్ బిజినెస్ మోటివేషన్ టెక్నాలజీ వంటి కొన్ని వందల టాపిక్స్ కు సంబందించిన వీడియోలు ఈ ted సైట్ లో ఉంటాయి

 

 

Best Mobiles in India

English summary
Most Useful and Amazing Websites on the Internet that you must visit.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X