మదర్స్ డే రోజున ఈ గాడ్జెట్లతో అమ్మను ఇంప్రెస్ చేయండి

|

సృష్టిలో అత్యంత నిస్వార్థ జీవి ఎవరైనా ఉన్నారంటే.. అది కచ్చితంగా అమ్మనే. కుటుంబ బంధాల పునాదుల మీదే నిర్మితమైన భారత సమాజంలో తల్లి పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే. ఏ ప్రతిఫలం ఆశించకుండా ఆమె చేసే గొడ్డు చాకిరీని, ఆ ప్రేమామయి పంచే ప్రేమను దేనితోను వెలకట్టలేం. ఒకవిధంగా ప్రకృతి అంత స్వచ్చంగా ఇప్పటికీ ప్రేమను నిలుపుకున్న ప్రేమమూర్తి అమ్మ మాత్రమే. పిల్లలను, భర్తను, మొత్తంగా కుటుంబాన్ని తీర్చిదిద్దడంలో ఆమె పోషించే పాత్ర పైనే సమాజ విలువలు ఆధారపడి ఉన్నాయి. . మదర్స్ డే సెలబ్రేషన్స్ ఈ నెల 12న ప్రారంభం కానున్న సంగతి అందరికీ తెలిసిందే.

మదర్స్ డే రోజున ఈ గాడ్జెట్లతో అమ్మను ఇంప్రెస్ చేయండి

 

ఈ రోజున పిల్లలు ఎలాగైనా అమ్మను ఇంప్రెస్ చేసేందుకు సరికొత్తగా ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ శీర్షికలో భాగంగా మదర్స్ డే రోజున మీ మదర్ ని ఇంప్రెస్ చేసేందుకు అదిరిపోయే గాడ్జెట్లను అందిస్తున్నాం. ఓ స్మార్ట్ లుక్కేయండి.

JBL Link View smart display

JBL Link View smart display

ఇది మార్కెట్లో బాగా దూసుకువెళుతున్న గాడ్జెట్. దీని ద్వారా మీ మదర్ ని చాలా బాగా ఇంప్రెస్ చేయవచ్చు. ఇదొక మ్యూజిక సిస్టం. మీ మదర్ ఎక్కి నుంచైనా ఈ JBL Link View smart display ద్వారా మ్యూజిక్ ని ఆస్వాదించవచ్చు. అలాగే మంచి వ్యూయింగ్ అనుభూతిని కూడా పొందవచ్చు. మంచి ఆడియో అనుభూతిని ఈ గాడ్జెట్ అందిస్తుంది. అతి పెద్ద స్మార్ట్ డిస్ ప్లే ద్వారా వ్యూయింగ్ అనుభూతిని సొంతం చేసుకోవచ్చు. JBL Link View smart display ధర మార్కెట్లో రూ.28,248గా ఉంది.

Xiaomi Mi Band 3
 

Xiaomi Mi Band 3

ఇది మరొక అద్బుతమైన గాడ్జెట్. దీని ద్వారా మదర్ ని మరింతగా ఇంప్రెస్ చేయవచ్చు.ఇందులో 0.78 ఇంచ్ ఓలెడ్ టచ్ స్క్రీన్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. వాట్సాప్, ఫేస్‌బుక్, ఎస్‌ఎంఎస్ నోటిఫికేషన్లు ఈ బ్యాండ్ స్క్రీన్‌పై కనిపిస్తాయి. 3 రోజుల వాతావరణ సమాచారం తెరపై కనిపిస్తుంది. అలాగే కాలింగ్ చేసే వారి నంబర్, పేరు నోటిఫికేషన్ రూపంలో తెరపై కనిపిస్తాయి. ఈ బ్యాండ్ 5ఏటీఎం వాటర్ ప్రూఫ్ టెక్నాలజీని కలిగి ఉంది. అందువల్ల 50 మీటర్ల లోతులో నీటిలో ఉన్నప్పటికీ ఈ బ్యాండ్ చక్కగా పనిచేస్తుంది. షియోమీ ఎంఐ బ్యాండ్ 3 లో యాక్టివిటీ ట్రాకర్ ఉంది. దీంతో రన్నింగ్, సైక్లింగ్, వాకింగ్ తదితర యాక్టివిటీలను ట్రాక్ చేయవచ్చు. ఈ బ్యాండ్ ద్వారా ఫోన్‌కు వచ్చే కాల్స్‌ను కూడా రిజెక్ట్ చేయవచ్చు. ఇందులో 110 ఎంఏహెచ్ బ్యాటరీని ఏర్పాటు చేశారు. దీనివల్ల బ్యాండ్ 20 రోజుల బ్యాకప్‌ను ఇస్తుంది. ఈ బ్యాండ్‌ను బ్లూటూత్ ద్వారా ఆండ్రాయిడ్, ఐఓఎస్ డివైస్‌లకు ఎంఐ ఫిట్ యాప్ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక ఈ బ్యాండ్ రూ.1,999 ధరకు వినియోగదారులకు ప్రత్యేకంగా అమెజాన్ వెబ్‌సైట్, ఎంఐ ఆన్‌లైన్ స్టోర్‌లలో లభిస్తున్నది.

Saregama Carvaan Premium Portable Digital Music Player

Saregama Carvaan Premium Portable Digital Music Player

మదర్ మ్యూజిక్ ప్రియులైతే ఈ గాడ్జెట్ ఫర్ఫెక్ట్ గా సరిపోతుంది. ఇందులో బాలీవుడ్, హాలీవుడ్ పాటలు ఉన్నాయి. దాదాపు 5 వేలకు పైగా ప్రీలోడెడ్ సాంగ్స్ తో ఈ మ్యూజిక్ ప్లేయర్ మార్కెట్లో సిద్ధంగా ఉంది. Kishore Kumar, Lata Mangeshkar, Amitabh Bachchan, Rekha, R.D. Burman, Anand Bakshi, Gulzar, Laxmikant Pyarelal వంటి ప్రముఖులతో పాటు ఇతర గాయకుల పాటలు కూడా ఇందులో లభ్యమవుతున్నాయి.Sad, Ghazal, Bhakti, Film Instrumental, Gurbani, Songs with dialogues, Hindustani Classics ఇంకా ఇతర పాటలు మిమ్మల్ని తెలియని లోకానికి తీసుకువెళతాయి కూడా. దీని ధర అమెజాన్ లో రూ. 5,600గా ఉంది

Eureka Forbes 0.4-Litre Robotic Vacuum Cleaner

Eureka Forbes 0.4-Litre Robotic Vacuum Cleaner

మదర్ ఎక్కువగా పనితో సతమతమవుతుందనుకుంటే ఈ గాడ్జెట్ ద్వారా సర్ ఫ్రైజ్ చేయవచ్చు. ఇదొక ఆటోమేటిక్ వాక్యూమ్ క్లీనర్ . ఇది అన్ని చోట్ల క్లీన్ చేస్తుంది. టైల్స్, వుడ్స్ , కార్పెట్ ఇంకా ఇతర ప్రదేశాల్లో మొత్తం నీట్ గా క్లీన్ చేసి ఉంచుతుంది. సోఫాలో కూర్చుని రిమోట్ సాయంతోనే దీన్ని ఆపరేట్ చేయవచ్చు.మార్కెట్లో దీని ధర రూ 18, 127గా ఉంది.

Google Chromecast 3

Google Chromecast 3

సినిమాలు మీద ఆసక్తి ఉండే అమ్మకు ఈ గిఫ్ట్ చాలా ఉపకరిస్తుంది. ఎక్కువగా సినిమాలు, టీవీలకు టైం కేటాయించేవారికి ఈ గిఫ్ట్ ఇస్తే చాలా ఆనందంగా ఫీల్ అవుతారు. దీని ద్వారా నెట్ ఫ్లిక్స్, టీవీ సీరిస్ అలాగే ఇతర స్ట్రీమింగ్ ఛానల్స్ ని తిలకించవచ్చు. స్మార్ట్ ఫోన్ ద్వారానే టీవీని కంట్రోల్ చేయవచ్చు. కేవలం స్మార్ట్ ఫోన్ ఉపయోగించి TV shows, movies, games అలాగే 800కు పైగా యాప్స్ ని కంట్రోల్ చేయవచ్చు. Youtube, Netflix, Hotstar, SonyLiv, Gaana వంటి వాటిని ఈజీగా కంట్రోల్ చేసుకునే సామర్థ్యం కూడా ఉంది.ఇది గూగుల్ అసిస్టెంట్ ఫీచర్ తో వచ్చింది. వాయిస్ కమాండ్ ద్వారా కంట్రోల్ చేసుకునే సౌలభ్యం కూడా ఉంది. ఈ గాడ్జెట్ iPhone, iPad, Android phone and tablet, Mac and Windows laptop and Chromebook వంటి వాటికి కూడా సపోర్ట్ చేస్తుంది. ఫ్లిప్ కార్ట్ లో దీని ధర రూ. 3,499గా ఉంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
5 gadgets that make great Mother's day gifts

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more
X