మోటో సి ప్లస్ పై భారీ డిస్కౌంట్!

Posted By: Madhavi Lagishetty

మోటో సి ప్లస్ పై భారీ డిస్కౌంట్ ఆఫర్ లభిస్తోంది. ప్రముఖ మొబైళ్ల తయారీదారు సంస్ధ మోటొరోలా, మోటో సి ప్లస్ స్మార్ట్ ఫోన్ను గతేడాది జూన్ లో ఇండియాలో లాంచ్ చేసింది. షియోమీ రెడ్ మీ 4తో పోటీపడి మరీ లాంచ్ చేసింది. లాంచింగ్ సమయంలో మోటో సి ప్లస్ 6,999రూపాయలకు అందుబాటులో ఉంది.

మోటో సి ప్లస్ పై భారీ డిస్కౌంట్!

అయితే మోటో ఇప్పుడు సి ప్లస్ స్మార్ట్ ఫోన్ భారీ డిస్కౌంట్ ఆఫర్ను ప్రకటించింది. వెయ్యి రూపాయలు తగ్గిస్తూ..ఫ్లిప్ కార్ట్, మోటో హబ్స్ ఆఫ్ లైన్ స్టోర్స్ రెండింటి ద్వారా ఈ ఆఫర్ను అందుబాటులో ఉంచింది. 2018 మోబైల్ బొనాంజ సేల్ ఆఫర్లో భాగంగా ఫ్లిఫ్ కార్ట్ ఈ ఫోన్ను అమ్మకానికి ఉంచింది. అయితే ఈ డివైస్ మోటో హబ్స్ ఆఫీస్ స్టోర్లలో వెయ్యి రూపాయలు తగ్గించింది. ఈ ఆఫర్ కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది.

అంతేకాదు వెయ్యిరూపాయల వరకు ఫ్లిప్ కార్ట్ ఎక్స్ ఛేంజ్ ఆఫర్ అందిస్తోంది. 5.500 రూపాయల మోటో సి ప్లస్ కోసం పాత స్మార్ట్ ఫోన్ను కూడా ఎక్స్ ఛేంజ్ చేసుకోవచ్చు. ఆన్ లైన్ రిటైలర్ ద్వారా యాక్సిస్ బ్యాంక్ బజ్ క్రెడిట్ కార్డును ఉపయోగించి ఈ డివైసును కొనుగోలు చేసినట్లయితే...5శాతం డిస్కౌంట్ కూడా లభిస్తుంది.

మోటో సి ప్లస్ స్పెసిఫికేషన్లు చూసినట్లయితే...మోటో సి ప్లస్ 1280,720పిక్సెల్స్ తో , 5అంగుళాల హెచ్డి డిస్ల్పేతో వస్తుంది. దాని హుడ్ కింద స్మార్ట్ ఫోన్ 1.3గిగా క్వాడ్ కోర్ మీడియా టెక్ ME6737 SOC ఉపయోగించుకుంటుంది. 2జిబి ర్యామ్, 16జిబి డిఫాల్ట్ స్టోరేజి స్పేస్ ను జత చేసింది. మైక్రో ఎస్డి కార్డు సహాయంతో 128జిబి వరకు విస్తరించుకోవచ్చు.

అమెజాన్ స్మార్ట్ మిర్రర్‌తో ఫ్యాషన్ కొత్త పుంతలు

ఇక మోటో సి ప్లస్ ఆండ్రాయిడ్ 7.0నౌగట్ బాక్స్ నుంచి బయటకు వస్తుంది. డ్యుయల్ సిమ్ సపోర్ట్, ఎఎఫ్ఎం రేడియో, 4జి వోల్ట్, వైఫై, బ్లూటూత్ 4.1, GPS/A-GPS, మైక్రో యూఎస్బి పోర్ట్ మరియు 3.5ఎంఎం ఆడియో జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లతో ఈ డివైస్ అందుబాటులో ఉంటుంది.

మోటరోలా స్మార్ట్ ఫోన్లో 8 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా సెన్సార్ను, బ్యాక్ సైడ్ లో ఆటోఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్, F/2.2 ఎపర్చర్లతో కూడి ఉన్నాయి. ఫ్రంట్ 2మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా మోటో సిలో చూసినదానితో చూసినట్లయితే కొన్ని వేరియంట్స్ ఉన్నాయి. మోటో సి ప్లస్ బ్యాటరీ కెపాసిటి 4000ఎంఏహెచ్, ఇది మోటో సీ 2350ఎంఏహెచ్ బ్యాటరీ కంటే పెద్దదిగా ఉంటుంది.

English summary
Moto C Plus was launched in India back in June last year at a price point of Rs, 6,999. Now, it looks like this smartphone has received a temporary price cut of Rs. 1,000. The Moto C Plus will be available at a discounted price point of Rs. 5,999 for a limited period via Flipkart and Moto Hubs offline stores.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot