Home
News

మోటో E32s స్మార్ట్‌ఫోన్ బడ్జెట్ ధరలో లాంచ్ అయింది!! ధరలు, ఫీచర్స్, సేల్స్ డేట్...

మోటరోలా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ నేడు భారతదేశంలో మోటో E32s కొత్త ఫోన్ ను లాంచ్ చేసింది. ఇప్పటికే ఉన్న మోటో E32 యొక్క అప్‌గ్రేడ్ గా వస్తున్న ఈ ఫోన్ 90Hz డిస్‌ప్లే మరియు ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌, ఆక్టా-కోర్ మీడియాటెక్ హీలియో G37 SoCని వంటి ఫీచర్లను కలిగి ఉండి ఆండ్రాయిడ్ 12పై రన్ అవుతుంది. దీనితో పాటుగా రెండు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్‌లను అందుకోటుంది అని కూడా మోటరోలా కంపెనీ హామీ ఇస్తుంది. బడ్జెట్ ధరలో లభిస్తూ IP52-సర్టిఫైడ్ వాటర్ రిపెల్లెంట్ డిజైన్‌ను కలిగి ఉండి రెడ్మి 10A, రియల్‌మి C31 వంటి మోడళ్లతో పోటీపడనున్నది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

మోటో E32s ధరలు & సేల్స్ వివరాలు

మోటో E32s ధరలు & సేల్స్ వివరాలు

భారతదేశంలో మోటో E32s ఫోన్ రెండు వేరియంట్లలో లాంచ్ అయింది. ఇందులో 3GB RAM + 32GB స్టోరేజ్ బేస్ వేరియంట్ యొక్క ధర రూ.8,999 కాగా 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ మోడల్‌ యొక్క ధర రూ.9,999. ఇవి పరిచయ ధరలు మాత్రమే. ఈ ప్రారంభ ధర మొదటి సేల్స్ లో మాత్రమే ఉండవచ్చు ఆ తర్వాత ధరలో మార్పులు ఉంటాయి. ఈ ఫోన్ మిస్టీ సిల్వర్ మరియు స్లేట్ గ్రే కలర్లలో వస్తుంది. ఇది జూన్ 6 మధ్యాహ్నం 12 గంటల నుండి ఫ్లిప్‌కార్ట్, జియో మార్ట్, జియో మార్ట్ డిజిటల్ మరియు రిలయన్స్ డిజిటల్ నుండి కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది.

మోటో E32s స్పెసిఫికేషన్స్

మోటో E32s స్పెసిఫికేషన్స్

మోటో E32s స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది డ్యూయల్-సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 12 పై రన్ అవుతుంది. ఇది 20:9 యాస్పెక్ట్ రేషియో, 720x1,600 పిక్సెల్‌లు మరియు 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5-అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది మీడియాటెక్ హీలియో G37 SoC ద్వారా శక్తిని పొందుతూ 680MHz IMG PowerVR GE8320 GPU మరియు 4GB LPDDR4X RAMతో జతచేయబడి వస్తుంది.

ఆప్టిక్స్

మోటో E32s స్మార్ట్‌ఫోన్ యొక్క ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో f/2.2 లెన్స్‌తో 16-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో పాటుగా 2-మెగాపిక్సెల్ మాక్రో షూటర్ మరియు 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. సెల్ఫీలు మరియు వీడియో చాట్‌ల కోసం ముందుభాగంలో f/2.0 లెన్స్‌తో 8-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంది. సెల్ఫీ మరియు బ్యాక్ కెమెరాలు రెండూ పోర్ట్రెయిట్, పనోరమా, ప్రో మరియు నైట్ విజన్ వంటి ఫీచర్లకు మద్దతును ఇస్తాయి. అదనంగా వెనుక కెమెరా LED ఫ్లాష్‌తో లభిస్తుంది. ఇది 30fps ఫ్రేమ్ రేటుతో ఫుల్-HD వీడియో రికార్డింగ్‌కు మద్దతు ఇస్తుంది.

కనెక్టివిటీ

మోటో E32s స్మార్ట్‌ఫోన్ 64GB వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజ్ తో వస్తుంది. ఇది మైక్రో SD కార్డ్ ప్రత్యేక స్లాట్ ద్వారా మెమొరీని 1TB వరకు విస్తరించడానికి మద్దతును ఇస్తుంది. ఫోన్ లోని కనెక్టివిటీ ఎంపికలలో 4G LTE, Wi-Fi 802.11ac, బ్లూటూత్ v5.0, GPS/ A-GPS, USB టైప్-C మరియు 3.5mm హెడ్‌ఫోన్ జాక్ వంటివి ఉన్నాయి. బోర్డ్‌లోని సెన్సార్‌లలో యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్ మరియు సామీప్య సెన్సార్ ఉన్నాయి. సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. చివరిగా ఇది 10W ఫాస్ట్ ఛార్జర్‌ మద్దతుతో 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.

Best Mobiles in India

English summary
Moto E32s Budget Smartphone Released in India With Octa-Core MediaTek Helio G37 SoC : Price, Specs, Sale Date and More
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X