Moto E7 Power బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది!! అద్భుతమైన ఫీచర్స్...
మోటో E7 పవర్ స్మార్ట్‌ఫోన్ గురించి ఆన్‌లైన్‌లో అనేక లీక్ లు వచ్చిన తరువాత ఎట్టకేలకు నేడు భారతదేశంలో లాంచ్ చేయబడింది. వాటర్‌డ్రాప్ నాచ్ డిస్ప్లే, డ్యూయల్ రియర్ కెమెరా, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లను కలిగి ఉన్న ఈ కొత్త బడ్జెట్ ఫోన్ సరికొత్త ఆండ్రాయిడ్ ఫీచర్లను కలిగి ఉండి రెడ్‌మి 9i , ఇన్ఫినిక్స్ స్మార్ట్ 5, రియల్‌మి C15 వంటి వాటితో పోటీపడుతున్నది. రూ.8000 లోపు ధరల వద్ద విడుదల అయిన కొత్త ఫోన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

మోటో E7 పవర్ స్మార్ట్‌ఫోన్ ధరల వివరాలు
భారతదేశంలో మోటో E7 పవర్ స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్‌లలో విడుదల అయింది. ఇందులో 2GB ర్యామ్ + 32GB స్టోరేజ్ వేరియంట్ యొక్క ధర రూ.7,499 ఉండగా, 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ మోడల్ యొక్క ధర రూ.8,299. ఈ ఫోన్ కోరల్ రెడ్ మరియు బ్లూ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ ఫోన్ ఫిబ్రవరి 26 నుండి మధ్యాహ్నం 12 గంటల నుండి ఫ్లిప్‌కార్ట్ మరియు కొన్ని ప్రముఖ రిటైల్ దుకాణాల ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులోకి రానున్నది.

మోటో E7 పవర్ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్
మోటో E7 పవర్ స్మార్ట్‌ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 10తో రన్ అవుతుంది. ఇది 6.5-అంగుళాల హెచ్‌డి + మాక్స్ విజన్ డిస్‌ప్లేను 720x1,600 పిక్సెల్స్ మరియు 20: 9 కారక నిష్పత్తితో కలిగి ఉంది. అలాగే ఇది ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో G25 SoC ను కలిగి ఉండి 4GB LPDDR4X RAM తో జతచేయబడి ఉంటుంది.

మోటో E7 పవర్ కెమెరా సెటప్
మోటో E7 పవర్ స్మార్ట్‌ఫోన్ యొక్క కెమెరా సెటప్ విషయానికి వస్తే ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. ఇందులో ఎఫ్ / 2.0 లెన్స్ తో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ మరియు ఎఫ్ / 2.4 మాక్రో లెన్స్‌తో 2 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ కెమెరాను కలిగి ఉంటుంది. అలాగే సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో ఎఫ్ / 2.2 లెన్స్‌తో 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంది. ఇది పోర్ట్రెయిట్ మోడ్, పనోరమా, ఫేస్ బ్యూటీ, మాక్రో విజన్, మాన్యువల్ మోడ్ మరియు హెచ్‌డిఆర్‌తో ప్రీలోడ్ చేసిన కెమెరా ఫీచర్లను కలిగి ఉంది.

మోటో E7 పవర్ కనెక్టివిటీ ఫీచర్స్
మోటో E7 పవర్ స్మార్ట్‌ఫోన్ 32GB మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్లను కలిగి ఉంది. ఇందులో గల మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా మెమొరీని 1TB వరకు విస్తరించడానికి అనుమతిని ఇస్తుంది. ఫోన్ యొక్క కనెక్టివిటీ ఎంపికలలో 4G VoLTE, Wi-Fi 802.11 b / g / n, బ్లూటూత్ 5.0, GPS / A-GPS, FM రేడియో, USB టైప్-C మరియు 3.5mm హెడ్‌ఫోన్ జాక్ వంటివి ఉన్నాయి. అలాగే బోర్డులోని సెన్సార్లలో యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్ మరియు సామీప్య సెన్సార్ వంటివి ఉన్నాయి.


Click it and Unblock the Notifications








