రూ.10,000 భారీ తగ్గింపుతో Moto Edge+ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసే గొప్ప అవకాశం!! మిస్ అవ్వకండి..

|

లెనోవా యాజమాన్యంలోని మోటరోలా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ మొట్టమొదటి 108MP కెమెరా వంటి అద్భుతమైన ఫీచర్లతో అధిక ధర వద్ద మోటో ఎడ్జ్ + స్మార్ట్‌ఫోన్ ను గత ఏడాది మేలో భారతదేశంలో విడుదల చేసింది. అయితే ఇప్పుడు కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్ యొక్క ధరను సుమారు రూ.10,000 వరకు తగ్గించనున్నట్లు ప్రకటించింది. 2020 లో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 865, 108-మెగాపిక్సెల్ కెమెరా, OLED డిస్ప్లే మరియు 5G వంటి టాప్-ఆఫ్-ది-లైన్ ఫీచర్లతో విడుదల అయిన ఈ స్మార్ట్‌ఫోన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

మోటో ఎడ్జ్ + ధర తగ్గింపు వివరాలు
 

మోటో ఎడ్జ్ + ధర తగ్గింపు వివరాలు

మోటరోలా కంపెనీ మోటో ఎడ్జ్ + స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో 12GB ర్యామ్ మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఒకే ఒక‌ వేరియంట్ తో రూ.74,999 ధర వద్ద విడుదల చేసింది. అయితే ఇప్పుడు ధర తగ్గింపును అందుకున్న తరువాత వినియోగదారులు ఈ హ్యాండ్‌సెట్‌ను రూ.64,999 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు.

మోటో ఎడ్జ్ + స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్

మోటో ఎడ్జ్ + స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్

మోటరోలా ఎడ్జ్ + స్మార్ట్‌ఫోన్ 6.67-అంగుళాల ఫుల్-హెచ్‌డి + కర్వేడ్ OLED డిస్ప్లే 90Hz రిఫ్రెష్ రేట్, HDR10 + సపోర్ట్ మరియు పంచ్-హోల్ సెల్ఫీ కెమెరా డిజైన్‌తో వస్తుంది. అంతర్గతంగా ఇది ఎడ్జ్ సిబ్లింగ్ నుండి భిన్నంగా ఉంటుంది. ఇది మోటరోలా క్వాల్‌కామ్ యొక్క మెయిన్ స్నాప్‌డ్రాగన్ 865 SoC ను కలిగి ఉండి 12GB RAM మరియు 256GB UFS 3.0 ఇంటర్నల్ స్టోరేజ్ తో జతచేయబడి ఉంటుంది.

మోటో ఎడ్జ్ + 108-MP కెమెరా సెటప్

మోటో ఎడ్జ్ + 108-MP కెమెరా సెటప్

మోటరోలా ఎడ్జ్ + స్మార్ట్‌ఫోన్ యొక్క కెమెరాల విషయానికొస్తే వెనుకవైపు ట్రిపుల్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇందులో హై-ఎండ్ ఎడ్జ్ + లో హై-రెస్ 108-మెగాపిక్సెల్ ప్రైమరీ లెన్స్ ఎఫ్ / 1.8 ఎపర్చరు మరియు 0.8-మైక్రాన్ పిక్సెల్ సైజుతో ఉంటుంది. ట్రిపుల్-కెమెరా సెటప్‌లోని ఇతర రెండు లెన్స్‌లలో 16 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా అన్స్ 8 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. సెటప్‌కు స్టాండర్డ్ వేరియంట్ ఎడ్జ్ వంటి టోఫ్ సెన్సార్ మద్దతు ఇస్తుంది. ఇది 2X కి బదులుగా 3X ఆప్టికల్ జూమ్‌ను కలిగి ఉంది. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు వైపు f / 2.0 ఎపర్చరు మరియు 0.9-మైక్రాన్ పిక్సెల్ పరిమాణంతో 25 మెగాపిక్సెల్ కెమెరా అమర్చబడి ఉంది.

మోటో ఎడ్జ్ + రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ ఫీచర్స్
 

మోటో ఎడ్జ్ + రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ ఫీచర్స్

మోటరోలా ఎడ్జ్ + స్మార్ట్‌ఫోన్ 15W వైర్‌లెస్ ఛార్జింగ్ మరియు 5W రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ మద్దతుతో వస్తుంది. ఇది 18W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్‌కు మద్దతు ఇచ్చే 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ నీటి నిరోధకతను కలిగి ఉంటుంది. ఇది వై-ఫై 6 తో పాటు mmWave మరియు 6Ghz ‌పై 5G సపోర్ట్‌ను కలిగి ఉంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Moto Edge+ Smartphone Received Price Cut up to Rs.10,000 in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X