Home
News

Moto G 5G స్మార్ట్‌ఫోన్ మొదటి సేల్ మొదలైంది!! అద్భుతమైన ఆఫర్స్

లెనోవా యాజమాన్యంలోని స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ మోటరోలా ఇటీవల తన సరికొత్త 5G స్మార్ట్‌ఫోన్ - మోటోG 5Gని " మేడ్ ఇన్ ఇండియా" ఫీచర్ తో భారతదేశంలో అందుబాటు ధరలో విడుదల చేసింది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 750G ప్రాసెసర్, 6GB ర్యామ్ వంటి అద్భుతమైన ఫీచర్లతో లభించే ఈ స్మార్ట్‌ఫోన్ యొక్క అమ్మకాలు ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి దేశంలో మొదటిసారిగా మొదలుకానున్నాయి. ఆన్‌లైన్‌లో కొనడానికి ఇష్టపడే వినియోగదారులు ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ 5G స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

మోటోG 5G ధరలు & మొదటి సేల్ ఆఫర్లు

మోటోG 5G ధరలు & మొదటి సేల్ ఆఫర్లు

మోటోG 5G స్మార్ట్‌ఫోన్ ఇండియాలో 6GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వంటి ఒకే ఒక వేరియంట్ లో విడుదల అయింది. దీనిని ఫ్లిప్‌కార్ట్ ద్వారా రూ.20,999 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. దీనిని హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ డెబిట్ మరియు క్రెడిట్ కార్డుల సహాయంతో కొనుగోలు చేసిన వారికి రూ.1000 డిస్కౌంట్‌ లభిస్తుంది. అలాగే ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డుల మీద నో-కాస్ట్ EMI ఎంపికలు లభిస్తాయి.

 

మోటోG 5G 5000mAh బ్యాటరీ ఫీచర్స్

మోటోG 5G 5000mAh బ్యాటరీ ఫీచర్స్

మోటోG 5G స్మార్ట్‌ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికొస్తే ఇది 6.7-అంగుళాల మాక్స్ విజన్ HDR10 డిస్ప్లేను 20: 9 కారక నిష్పత్తితో కలిగి ఉంటుంది. ఇది 6GB RAM మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉండి క్వాల్కమ్ యొక్క స్నాప్‌డ్రాగన్ 750G ప్రాసెసర్ ద్వారా రన్ అవుతుంది. ఇందులో గల మైక్రో SD కార్డ్ మద్దతుతో మెమొరిని 1TB వరకు విస్తరించడానికి కూడా అవకాశం ఇస్తుంది. అలాగే ఇది టర్బోపవర్ 20W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి ఉంటుంది.

మోటోG 5G 48MP కెమెరా సెటప్ ఫీచర్స్

మోటోG 5G 48MP కెమెరా సెటప్ ఫీచర్స్

మోటోG 5G స్మార్ట్‌ఫోన్ కెమెరా లెన్స్ విషయానికి వస్తే దీని వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ ను కలిగి ఉంటుంది. ఇందులో ఎఫ్ / 1.7 ప్రైమరీ సెన్సార్ తో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, వైడ్ యాంగిల్ లెన్స్ తో 8 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా మరియు 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ కెమెరాలు ఫ్లాష్ తో కలుపుకొని చతురస్రాకారంలో ప్యాక్ చేయబడి ఉంటాయి. అలాగే ఫోన్ ముందు భాగంలో పంచ్-హోల్ డిజైన్ లో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే ప్రస్తుతానికి ఈ ఫోన్ స్టాక్-ఆండ్రాయిడ్ 10తో రన్ అవుతుంది కాని త్వరలోనే ఆండ్రాయిడ్ 11 అప్‌డేట్ ను అందిస్తున్నట్లు సంస్థ తెలిపింది.

More from GizBot

Best Mobiles in India

English summary
Moto G 5G India First Sale Live on Flipkart: Price, Specs, Sale Offers and More
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X