Moto G పవర్ (2022) లాంచ్ అయింది!! ధరలు, ఫీచర్స్ ఇవిగో...

|

మోటో G పవర్ (2022) స్మార్ట్ ఫోన్ జనవరిలో లాంచ్ అయిన మోటో G పవర్ (2021)కి అప్‌గ్రేడ్‌గా లాంచ్ అయింది. ఈ కొత్త హ్యాండ్‌సెట్ MediaTek Helio G37 SoC ద్వారా శక్తిని పొందుతూ 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. 50-మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్‌తో ఫోన్ వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్‌, హోల్-పంచ్ డిస్‌ప్లేలో సెల్ఫీ కెమెరా కటౌట్‌, వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ వంటి ఫీచర్స్ కలిగిన ఈ ఫోన్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

Moto G పవర్ (2022) ధరల వివరాలు

Moto G పవర్ (2022) ధరల వివరాలు

Moto G పవర్ (2022) స్మార్ట్ ఫోన్ USలో $199 మరియు $249 ధర వద్ద లాంచ్ అయింది. ఇండియా యొక్క కరెన్సీ ప్రకారం దీని యొక్క విలువ దాదాపు రూ.14,700 మరియు రూ.18,400 గా ఉంది. ఇది రాబోయే నెలల్లో రిపబ్లిక్ వైర్‌లెస్ మరియు మెట్రో ద్వారా T-Mobileలో అందుబాటులో ఉంటుంది. అలాగే Verizon, Boost Mobile, Xfinity Mobile, AT&T, Cricket, Ucellular మరియు Google Fiలో కూడా త్వరలో అందుబాటులోకి రానున్నది. Moto G Power (2022) యొక్క అన్‌లాక్ చేయబడిన మోడల్ 2022 ప్రారంభంలో Best Buy, Amazon మరియు Motorola US సైట్‌లో కూడా అందుబాటులో ఉంటుంది. కెనడాలో కొత్త Moto G Power (2022) రాబోయే నెలల్లో అందుబాటులో ఉంటుందని చెప్పబడింది. ప్రస్తుతానికి ఈ ఫోన్ సింగిల్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లో ఆవిష్కరించబడింది.

<strong>Amazon స్మార్ట్‌ఫోన్ అప్‌గ్రేడ్ డేస్ సేల్లో గెలాక్సీ స్మార్ట్‌ఫోన్లపై గొప్ప డిస్కౌంట్ ఆఫర్లు...</strong>Amazon స్మార్ట్‌ఫోన్ అప్‌గ్రేడ్ డేస్ సేల్లో గెలాక్సీ స్మార్ట్‌ఫోన్లపై గొప్ప డిస్కౌంట్ ఆఫర్లు...

Moto G పవర్ (2022) స్పెసిఫికేషన్స్

Moto G పవర్ (2022) స్పెసిఫికేషన్స్

Moto G పవర్ (2022) ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది ఆండ్రాయిడ్ 11లో రన్ అవుతుంది. అలాగే ఇది 90Hz రిఫ్రెష్ రేట్, 720x1,600 పిక్సెల్‌లు, 20:9 యాస్పెక్ట్ రేషియో మరియు 269ppi పిక్సెల్‌తో 6.5-అంగుళాల HD+ IPS TFT LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ MediaTek Helio G37 SoC ద్వారా శక్తిని పొందుతూ 4GB RAMతో జత చేయబడి ఉంటుంది. స్టోరేజ్ విషయానికి వస్తే ఇది 64GB వేరియంట్ తో జాబితా చేయబడి ఉంటుంది. ఇందులోని మైక్రో SD కార్డ్ స్లాట్ సాయంతో మెమొరీని 512GB వరకు మరింత విస్తరించడానికి అనుమతిస్తుంది.

OTT కంటెంట్ స్ట్రీమింగ్ కోసం అనువైన ఎయిర్‌టెల్, Vi ప్రీపెయిడ్ ప్లాన్‌లు ఇవేOTT కంటెంట్ స్ట్రీమింగ్ కోసం అనువైన ఎయిర్‌టెల్, Vi ప్రీపెయిడ్ ప్లాన్‌లు ఇవే

ఆప్టిక్స్

Moto G పవర్ (2022) ఫోన్ యొక్క ఆప్టిక్స్ కెమెరాల విషయానికొస్తే ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో f/1.8 ఎపర్చరుతో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, f/2.4 లెన్స్‌తో 2-మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ మరియు f/2.4 ఎపర్చరుతో 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కెమెరాలు ఉన్నాయి. వెనుక కెమెరా సెటప్ LED ఫ్లాష్‌తో ఉంటుంది. వెనుక కెమెరా ఫీచర్లలో హైపర్‌లాప్స్, డ్యూయల్ క్యాప్చర్ వంటివి మరిన్ని ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందువైపు డిస్ప్లే కటౌట్ లోపల f/2.0 లెన్స్‌తో 8-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఇది 10W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. దీని వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది మరియు ఫేస్ అన్‌లాక్‌కు కూడా మద్దతు ఇస్తుంది. కనెక్టివిటీ ఎంపికలలో బ్లూటూత్ v5, Wi-Fi 802.11 ac, GPS, A-GPS, USB టైప్-C పోర్ట్ మరియు మరిన్ని ఉన్నాయి. ఇది దుమ్ము మరియు నీటి నిరోధకత కోసం IP52 ధృవీకరించబడింది.

Best Mobiles in India

English summary
Moto G Power (2022) Smartphone Launched With MediaTek Helio G37 SoC: Price, Specs, India Launch Date and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X