Home
News

మోటో G32 స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్ మొదటి సేల్స్ లో బెస్ట్ ఆఫర్లు ఎన్నో!!!

మోటోరోలా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ గతవారం భారతదేశంలో మోటో G32 కొత్త స్మార్ట్‌ఫోన్ మోడల్‌ను బడ్జెట్ విభాగంలో లాంచ్ చేసింది. ఇది 20:9 AMOLED డిస్ప్లే మరియు ట్రిపుల్ రియర్ కెమెరా, 30W ఫాస్ట్ ఛార్జింగ్‌ వంటి అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉండి ఆక్టా-కోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 680 SoC ప్రాసెస‌ర్‌ను కలిగి ఉండి శక్తిని పొందుతూ ఉంటుంది. ఈ ఫోన్ యొక్క అమ్మకాలు ఈ రోజు నుంచి ఫ్లిప్‌కార్ట్ లో ప్రారంభం కానున్నాయి. మార్కెట్ లో ఇప్పటికే బడ్జెట్ విభాగంలో ఫోన్ లకు గట్టి పోటీని ఇచ్చే ఈ కొత్త మోటో ఫోన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

మోటో G32 ధరల వివరాలు

మోటో G32 ధరల వివరాలు

భార‌త మార్కెట్లో మోటో G32 మొబైల్స్‌ కేవలం ఒకే ఒక వేరియంట్ లో లాంచ్ అయింది. 4GB RAM + 64GB స్టోరేజీ వేరియంట్ లో లభించే ఈ మోడల్ యొక్క ధర రూ.12,999 గా నిర్ణ‌యించారు. భార‌త మార్కెట్లో ఇది మిన‌ర‌ల్ గ్రే, సాటిన్ సిల్వ‌ర్ క‌ల‌ర్ల‌లో అందుబాటులో ఉండ‌నున్నాయి. ఈ రోజు అంటే ఆగ‌స్టు 16వ మధ్యాహ్నం 12PM నుంచి ఫ్లిప్‌కార్ట్ ద్వారా యూజ‌ర్లు దీనిని కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఈ మొదటి సేల్స్ అమ్మకంలో HDFC బ్యాంక్ కార్డ్ వినియోగదారులు 10 శాతం తక్షణ తగ్గింపుతో రూ11,749 తగ్గింపు ధర వద్ద దీనిని పొంద‌వ‌చ్చు. జియో ఆఫర్ లో భాగంగా కస్టమర్ రీఛార్జ్‌లపై రూ.2,000 క్యాష్‌బ్యాక్ పొంద‌వ‌చ్చు.

మోటో G32 స్పెసిఫికేషన్స్

మోటో G32 స్పెసిఫికేషన్స్

మోటో G32 ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది 6.5 అంగుళాల ఫుల్-HD LCD డిస్‌ప్లే పానెల్‌ను 90Hz రిఫ్రెష్ రేటుతో మరియు 1,080x2,400 పిక్సెల్ రిసొల్యూష‌న్‌తో అందిస్తున్న‌ది. ఈ హ్యాండ్‌సెట్ Snapdragon 680 SoC ప్రాసెస‌ర్‌ను కలిగి ఉండి ఆండ్రాయిడ్ 12 ఆధారంగా ర‌న్ అవుతూ ఈ హ్యాండ్‌సెట్‌ 4GB RAM మరియు 64GB స్టోరేజ్ తో జతచేయబడి లభిస్తుంది.

ఆప్టిక్స్

మోటో G32 ఫోన్ యొక్క ఆప్టిక్స్ విషయానికి వస్తే మొబైల్ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెట‌ప్‌ను క‌లిగి ఉంది. ఇందులో ప్ర‌ధాన కెమెరా 50-మెగాపిక్సెల్ క్వాలిటీలో f/1.8అప‌ర్చ‌ర్ లెన్స్ ప్రైమ‌రీ కెమెరాగా ఉంది. ఇక మిగ‌తా రెండు కెమెరాల్లో ఒక‌టి 8 మెగాపిక్సెల్ క్వాలిటీతో f/2.2 అల్ట్రా వైడ్ లెన్స్‌, మ‌రొక‌టి 2 మెగాపిక్సెల్ క్వాలిటీతో f/2.4 అప‌ర్చ‌ర్‌ మాక్రో షాట్స్ లెన్స్ ఇస్తున్నారు. ఇక వీడియో కాలింగ్ మరియు సెల్ఫీల కోసం ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ లెన్స్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది.

బ్యాటరీ

మోటో G32 ఫోన్ యొక్క బ్యాటరీ మరియు ఛార్జ్‌ విష‌యానికొస్తే 5000mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీ 33W ఫాస్ట్ ఛార్జింగ్ స‌పోర్ట్‌ అందిస్తున్నారు. ఈ హ్యాండ్ సెట్ డ్యుయ‌ల్ సిమ్ స్లాట్స్‌, రెండిటికీ 5జీ నెట్‌వ‌ర్క్ స‌పోర్ట్ సిస్ట‌మ్ కలిగి ఉంది. క‌నెక్టివిటీ ప‌రంగా.. Wi-Fi, 4G LTE, బ్లూటూత్ v5.2, 3.5mm హెడ్‌ఫోన్ పోర్ట్‌, USB Type-C ఫీచ‌ర్ల‌ను క‌లిగి ఉంది. అంతేకాకుండా, స్మార్ట్‌ఫోన్ స్పోర్ట్స్ స్టీరియో స్పీకర్‌లతో పాటు డాల్బీ అట్మాస్‌తో కూడా ఉంటుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Moto G32 Smartphone First Sale Starts Today in India Via Flipkart: Price, Specs sales Offers and More
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X