రేపు విడుదల కాబోతున్న మోటో జీ4 ఇదేనా..?

Written By:

లెనోవో నేతృత్వంలోని మోటరోలా రెండు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను భారత్‌లో లాంచ్ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. మోటో జీ3కి సక్సెసర్ వర్షన్‌గా రాబోతోన్న మోటో జీ4, జీ4 ప్లస్ ఫోన్‌లను మోటరోలా ఇండియా మే 17న మార్కెట్లో అనౌన్స్ చేయబోతోంది. ఈ ఫోన్ విడుదలకు కొద్ది గంటల ముందే కొన్ని ఫోటోలు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి...

Read More : మోటో జీ3 పై భారీ తగ్గింపు, రూ.8000 వరకు..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రూమర్ 1

మోటో జీ4 రూమర్ స్పెసిఫికేషన్స్

మోటో జీ (2016 ఎడిషన్) ఫ్లాట్ గ్లాస్ డిస్‌ప్లేతో కూడిన కొత్త డిజైన్, మెటాలిక్ బాడీ అలానే సరికొత్త హోమ్ బటన్ విత్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌తో వచ్చే అవకాశముందని తెలుస్తోంది. ఫోన్ వెనుక భాగంలో పాలీకార్బోనేట్ చాసిస్‌తో పాటు మోటో టర్బో తరహా మెటాలిక్ రిమ్‌తో కూడిన కెమెరా సెటప్‌ను ఏర్పాటు చేసే అవకాశముందని రూమర్ మిల్స్ చెబుతున్నాయి.

పెద్ద డిస్‌ప్లే

మోటో జీ4 రూమర్ స్పెసిఫికేషన్స్

మోటరోలా తన అప్‌కమింగ్ మోటో జీ4 స్మార్ట్‌ఫోన్‌ను రెండు వేరియంట్‌లో లాంచ్ చేసే అవకాశముంది. అందులో ఒకటి 5 అంగుళాల డిస్‌ప్లేతోనూ మరొకటి 5.5 అంగుళాల డిస్‌ప్లేతోనూ వచ్చే అవకాశం. స్కీన్ సైజ్ ఇంకా క్వాలిటీ గురించి మోటరోలా ఇప్పటి వరకు ఎలాంటి వివరాలను వెల్లడించనప్పటికి ఈ రెండు ఫోన్‌లు పూర్తి హైడెఫినిషన్ స్ర్కీన్ రిసల్యూషన్‌ను ఆఫర్ చేస్తాయని పలు రూమర్స్ చెబుతున్నాయి.

 

ప్రాసెసింగ్ పవర్ అలానే స్టోరేజ్ కెపాసిటీ

మోటో జీ4 రూమర్ స్పెసిఫికేషన్స్

మోటో జీ4 వేరియంట్ 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్‌తోనూ, మోటో జీ4 ప్లస్ వేరియంట్ 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్‌తోనూ లభ్యమయ్యే అవకాశం.

 

కెమెరా

మోటో జీ4 రూమర్ స్పెసిఫికేషన్స్

మోటో జీ4 వేరియంట్ 13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరాతో వస్తే, జీ4 ప్లస్ వేరియంట్ 16 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరాతో లభ్యమయ్యే అవకాశం.

 

ఫింగర్ ప్రింట్ స్కానర్

మోటో జీ4 రూమర్ స్పెసిఫికేషన్స్

కొత్త వర్షన్ మోటో జీ ఫోన్‌లలో ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను హోమ్ కీ బటన్‌లో ఏర్పాటు చేసే అవకాశముందని రూమర్ మిల్స్ చెబుతున్నాయి.

 

ఆపరేటింగ్ సిస్టం

మోటో జీ4 రూమర్ స్పెసిఫికేషన్స్

మోటో జీ (2016 వర్షన్) ఫోన్‌లు Android Marshmallow ఆపరేటింగ్ సిస్టం పై రన్ అయ్యే అవకాశం.

Amazon ఎక్స్‌క్లూజివ్‌

Amazon ఎక్స్‌క్లూజివ్‌


మోటో జీ4 (Moto G4), మే 17న ఇండియన్ మార్కెట్లో లాంచ్ కాబోతోంది. ఈ ఫోన్‌లను ఎక్స్‌క్లూజివ్‌గా Amazonలో మాత్రమే విక్రయించనున్నట్లు మోటో ఇండియా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా పేర్కొంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Moto G4 and G4 Plus Launch Tomorrow: Top 7 rumored features and specs. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting