Just In
- 6 hrs ago
ధర రూ.16,000 లోపే మీరు కొనుగోలు చేయగల, 43 ఇంచుల స్మార్ట్ టీవీలు!
- 9 hrs ago
కొత్త బడ్జెట్ లో PAN కార్డు పై కొత్త రూల్స్! ఇకపై అన్ని డిజిటల్ KYC లకు PAN కార్డు చాలు!
- 11 hrs ago
Samsung కొత్త ఫోన్లు లాంచ్ ఈ రోజే! లైవ్ ఈవెంట్ ఎలా చూడాలి,వివరాలు!
- 14 hrs ago
ఇన్ఫినిక్స్ కొత్త ల్యాప్‌టాప్‌లు ఇండియాలో లాంచ్ అయ్యాయి! ధర ,స్పెసిఫికేషన్లు!
Don't Miss
- News
వనస్థలిపురంలో భారీ అగ్ని ప్రమాదం: దట్టమైన పొగతో జనాలు ఉక్కిరిబిక్కిరి
- Sports
అదే మా కొంపముంచింది: మిచెల్ సాంట్నర్
- Lifestyle
ప్రతి దాంట్లోనూ ఎల్లప్పుడూ విజయం సాధించే రాశుల వారు వీరు... ఇందులో మీ రాశి ఉందా?
- Finance
adani bonds: అదానీ కంపెనీలకు ఎదురుదెబ్బ.. ఝలక్ ఇచ్చిన క్రెడిట్ సుస్సీ
- Movies
Prabhas, హృతిక్ మల్టీస్టారర్? పఠాన్ డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్‌తో మైత్రీ నవీన్.. ఎన్ని కోట్ల బడ్జెట్ ఎంతంటే?
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
మోటో G42 స్మార్ట్‌ఫోన్ మొదటి సేల్స్ లో ఊహించని ప్రయోజనాలు ఎన్నో...
మోటోరోలా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ గతవారం భారతదేశంలో మోటో G42 కొత్త స్మార్ట్‌ఫోన్ మోడల్‌ను బడ్జెట్ విభాగంలో లాంచ్ చేసింది. ఇది 20:9 AMOLED డిస్ప్లే మరియు ట్రిపుల్ రియర్ కెమెరా, 20W ఫాస్ట్ ఛార్జింగ్ వంటి అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉండి ఆక్టా-కోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 680 SoC ద్వారా శక్తిని పొందుతూ రన్ అవుతుంది. ఈ ఫోన్ యొక్క అమ్మకాలు ఈ రోజు నుంచి ఫ్లిప్‌కార్ట్ లో ప్రారంభం కానున్నాయి. మార్కెట్ లో ఇప్పటికే బడ్జెట్ విభాగంలో ఉన్న రెడ్‌మి నోట్ 11, రియల్‌మి 9i మరియు పోకో M4 ప్రో వంటి వాటికి ఏవిధంగా పోటీని ఇస్తుందో చూడాలి. ఈ కొత్త మోటో ఫోన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

మోటో G42 ధరలు & లాంచ్ సేల్స్ ఆఫర్లు
భారతదేశంలో మోటో G42 స్మార్ట్‌ఫోన్ బడ్జెట్ విభాగంలో కేవలం ఒకే ఒక వేరియంట్లో విడుదల అయింది. 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ వేరియంట్ మోడల్ రూ.13,999 ధర వద్ద అట్లాంటిక్ గ్రీన్ మరియు మెటాలిక్ రోస్ వంటి రెండు కలర్ ఎంపికలలో లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ లో మొదలయ్యే నేటి మొదటి సేల్ లో లభించే లాంచ్ ఆఫర్‌ల విషయానికి వస్తే SBI కార్డ్‌లను ఉపయోగించి కొనుగోలు చేసే కస్టమర్‌లు రూ.1,000 వరకు తగ్గింపును పొందవచ్చు. అంతేకాకుండా ఈ ఫోన్ కొనుగోలు మీద రూ.2,549 విలువైన జియో ప్రయోజనాలు కూడా లభిస్తాయి.

మోటో G42 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్
మోటో G42 స్మార్ట్‌ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది డ్యూయల్-సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 12 ఆధారంగా రన్ అవుతుంది. ఇది 20:9 యాస్పెక్ట్ రేషియో మరియు 60Hz రిఫ్రెష్ రేట్‌తో 6.4-అంగుళాల ఫుల్-HD+ (1,080x2,400 పిక్సెల్‌లు) AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 680 SoC ద్వారా శక్తిని పొందుతూ అడ్రినో 610 GPU మరియు 4GB LPDDR4x ర్యామ్‌తో జతచేయబడి ఉంటుంది.

మోటో G42 స్మార్ట్‌ఫోన్ యొక్క ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇందులో f/1.8 లెన్స్‌తో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, అల్ట్రా-వైడ్ మరియు డెప్త్ షూటర్‌తో 8-మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా మరియు 2-మెగాపిక్సెల్ మాక్రో షూటర్ కెమెరాలను కలిగి ఉంటుంది. సెల్ఫీ ఫోటోలు మరియు వీడియో కాలింగ్ కోసం ఫోన్ ముందు భాగంలో f/2.2 లెన్స్‌తో 16-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 64GB ఆన్‌బోర్డ్ uMCP స్టోరేజ్ ను కలిగి ఉంది. అలాగే ఫోన్ లోని అదనపు మైక్రో SD కార్డ్ ప్రత్యేక స్లాట్ ద్వారా మెమొరీని 1TB వరకు విస్తరించడానికి కూడా మద్దతును ఇస్తుంది.

మోటో G42 స్మార్ట్‌ఫోన్లోని కనెక్టివిటీ ఎంపికల విషయానికి వస్తే ఇందులో 4G LTE, Wi-Fi 802.11ac, బ్లూటూత్ v5.0, FM రేడియో, GPS/ A-GPS, NFC, USB టైప్-C మరియు 3.5mm హెడ్‌ఫోన్ జాక్ వంటివి ఉన్నాయి. బోర్డులోని సెన్సార్‌లలో యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్, గైరోస్కోప్, మాగ్నెటోమీటర్ మరియు సామీప్య సెన్సార్ వంటివి కూడా ఉన్నాయి. అలాగే ఈ ఫోన్ సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో కూడా వస్తుంది. ఇది డ్యూయల్ స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉండి డాల్బీ అట్మోస్‌కు మద్దతును కలిగి ఉంటుంది.

మోటో G42 ఫోన్ IP52-రేటెడ్ వాటర్ రిపెల్లెంట్ బిల్డ్‌లో వస్తుంది. చివరిగా మోటో G42 స్మార్ట్‌ఫోన్ 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి లభిస్తుంది. ఇది 20W TurboPower ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. అనుకూలమైన ఛార్జర్ బాక్స్‌లో బండిల్ చేయబడి ఒకే ఛార్జ్‌పై 30 గంటల కంటే ఎక్కువ బ్యాకప్‌ను అందించడానికి రేట్ చేయబడింది. ఈ ఫోన్ 160.61x73.47x8.26mm కొలతల పరిమాణంలో 174.5 గ్రాముల బరువుతో లభిస్తుంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470