Just In
- 8 hrs ago
ప్రపంచంలోనే అతిపెద్ద 5G నెట్వర్క్ గా మారనున్న Airtel!
- 11 hrs ago
గెలాక్సీ S23 ఫోన్లు ఇండియాలోనే తయారీ! ఇండియా ధరలు కూడా లాంచ్ అయ్యాయి!
- 1 day ago
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- 1 day ago
రియల్మీ కొత్త ఫోన్ టీజర్ విడుదలయింది! లాంచ్ కూడా త్వరలోనే!
Don't Miss
- Movies
Michael day 1 collections మైఖేల్‌కు తమిళ, తెలుగులో ఊహించని రెస్పాన్స్.. తొలి రోజు ఎన్ని కోట్లంటే?
- Sports
విహారీ.. ఇది రివర్స్ స్వీప్ కాదు.. రివర్స్ స్లాప్: దినేశ్ కార్తీక్
- News
ఏపీ, తెలంగాణకు రైల్వే బడ్జెట్లో రూ. 12,800 కోట్లు: వాటాలు ఇలా, కీలక ప్రాజెక్టులు
- Finance
భారత్ పై అమెరికా సెనేటర్ ఆరోపణలు.. ఇండియాను దోషిగా నిలబెట్టడమే ధ్యేయం!
- Lifestyle
రాత్రుళ్లు నిద్ర పట్టట్లేదా? ఈ పాదాభ్యంగనం చేస్తే గాఢ నిద్రలోకి ఇట్టే జారుకుంటారు
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Moto G42 స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది!! ధరలు, లాంచ్ ఆఫర్స్ ఇవిగో...
మోటోరోలా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ నేడు భారతదేశంలో మోటో G42 కొత్త స్మార్ట్‌ఫోన్ ను బడ్జెట్ విభాగంలో తాజా మోడల్‌గా లాంచ్ చేసింది. ఇది గత సంవత్సరం యూరప్, లాటిన్ అమెరికా మరియు మిడిల్ ఈస్ట్ మార్కెట్‌లలో లాంచ్ చేసిన మోటో G41 యొక్క అప్ గ్రేడ్ గా విడుదల అయింది. ఇది 20:9 AMOLED డిస్ప్లే మరియు ట్రిపుల్ రియర్ కెమెరా, 20W ఫాస్ట్ ఛార్జింగ్ వంటి అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉండడమే కాకుండా ఆక్టా-కోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 680 SoC ద్వారా శక్తిని పొందుతూ ఉంటుంది. ఇండియా స్మార్ట్‌ఫోన్ మార్కెట్ లో రెడ్‌మి నోట్ 11, రియల్‌మి 9i మరియు పోకో M4 ప్రో వంటి వాటికి పోటీగా లభిస్తున్న కొత్త మోటో ఫోన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

మోటో G42 ధరలు & లాంచ్ ఆఫర్లు
భారతదేశంలో మోటో G42 కొత్త స్మార్ట్‌ఫోన్ కేవలం ఒకే ఒక వేరియంట్లో లాంచ్ అయింది. 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ వేరియంట్ వద్ద లభించే ఈ మోడల్ యొక్క ధర రూ.13,999. ఇది అట్లాంటిక్ గ్రీన్ మరియు మెటాలిక్ రోస్ వంటి రెండు కలర్ ఎంపికలలో లభిస్తుంది. ఈ ఫోన్ యొక్క మొదటి సేల్స్ జూలై 11 నుండి దేశంలో ఎంపిక చేసిన రిటైల్ స్టోర్‌లతో పాటు ఫ్లిప్‌కార్ట్ ద్వారా ప్రారంభం కానున్నాయి. ఈ ఫోన్ యొక్క మొదటి సేల్ లో లభించే లాంచ్ ఆఫర్‌ల విషయానికి వస్తే SBI కార్డ్‌లను ఉపయోగించి కొనుగోలు చేసే కస్టమర్‌లు రూ.1,000 వరకు తగ్గింపును పొందవచ్చు. అంతేకాకుండా ఈ ఫోన్ కొనుగోలు మీద రూ.2,549 విలువైన జియో ప్రయోజనాలు కూడా లభిస్తాయి. అయితే రూ.419 ప్లాన్ లో ఉన్న జియో వినియోగదారులకు మాత్రమే ఈ ప్రయోజనాలు ఇవ్వబడతాయి.

మోటో G42 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్
మోటో G42 స్మార్ట్‌ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది డ్యూయల్-సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 12 ఆధారంగా రన్ అవుతుంది. ఇది 20:9 యాస్పెక్ట్ రేషియో మరియు 60Hz రిఫ్రెష్ రేట్‌తో 6.4-అంగుళాల ఫుల్-HD+ (1,080x2,400 పిక్సెల్‌లు) AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 680 SoC ద్వారా శక్తిని పొందుతూ అడ్రినో 610 GPU మరియు 4GB LPDDR4x ర్యామ్‌తో జతచేయబడి ఉంటుంది.

మోటో G42 స్మార్ట్‌ఫోన్ యొక్క ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇందులో f/1.8 లెన్స్‌తో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, అల్ట్రా-వైడ్ మరియు డెప్త్ షూటర్‌తో 8-మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా మరియు 2-మెగాపిక్సెల్ మాక్రో షూటర్ కెమెరాలను కలిగి ఉంటుంది. సెల్ఫీ ఫోటోలు మరియు వీడియో కాలింగ్ కోసం ఫోన్ ముందు భాగంలో f/2.2 లెన్స్‌తో 16-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 64GB ఆన్‌బోర్డ్ uMCP స్టోరేజ్ ను కలిగి ఉంది. అలాగే ఫోన్ లోని అదనపు మైక్రో SD కార్డ్ ప్రత్యేక స్లాట్ ద్వారా మెమొరీని 1TB వరకు విస్తరించడానికి కూడా మద్దతును ఇస్తుంది.

మోటో G42 స్మార్ట్‌ఫోన్లోని కనెక్టివిటీ ఎంపికల విషయానికి వస్తే ఇందులో 4G LTE, Wi-Fi 802.11ac, బ్లూటూత్ v5.0, FM రేడియో, GPS/ A-GPS, NFC, USB టైప్-C మరియు 3.5mm హెడ్‌ఫోన్ జాక్ వంటివి ఉన్నాయి. బోర్డులోని సెన్సార్‌లలో యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్, గైరోస్కోప్, మాగ్నెటోమీటర్ మరియు సామీప్య సెన్సార్ వంటివి కూడా ఉన్నాయి. అలాగే ఈ ఫోన్ సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో కూడా వస్తుంది. ఇది డ్యూయల్ స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉండి డాల్బీ అట్మోస్‌కు మద్దతును కలిగి ఉంటుంది. ఫోన్ IP52-రేటెడ్ వాటర్ రిపెల్లెంట్ బిల్డ్‌లో వస్తుంది.

చివరిగా మోటో G42 స్మార్ట్‌ఫోన్ 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి లభిస్తుంది. ఇది 20W TurboPower ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. అనుకూలమైన ఛార్జర్ బాక్స్‌లో బండిల్ చేయబడి ఒకే ఛార్జ్‌పై 30 గంటల కంటే ఎక్కువ బ్యాకప్‌ను అందించడానికి రేట్ చేయబడింది. ఈ ఫోన్ 160.61x73.47x8.26mm కొలతల పరిమాణంలో 174.5 గ్రాముల బరువుతో లభిస్తుంది.

మోటో G82 5G మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్
మోటరోలా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఇండియాలో ఇటీవల మోటో G82 5G మిడ్-రేంజ్ మోడల్‌ను రెడ్మీ నోట్ 11 ప్రో+, వన్‌ప్లస్ నార్డ్ CE 2 లైట్ మరియు వివో T1 వంటి వాటికి పోటీగా రెండు వేరియంట్లలో మెటోరైట్ గ్రే మరియు వైట్ లిల్లీ వంటి కలర్ ఎంపికలలో లాంచ్ చేసింది. ఇందులో 6GB RAM + 128GB స్టోరేజ్ బేస్ వేరియంట్ యొక్క ధర రూ.21,499 కాగా 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ కాన్ఫిగరేషన్ మోడల్ యొక్క ధర రూ.22,999. ఇది ఆండ్రాయిడ్ 12తో రన్ అవుతూ స్నాప్‌డ్రాగన్ 695 SoC ద్వారా శక్తిని పొందుతుంది. ఇది 20:9 యాస్పెక్ట్ రేషియో మరియు 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6-అంగుళాల ఫుల్-HD+ (1,080x2,400 పిక్సెల్‌లు) AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) మద్దతుతో పాటుగా f/1.8 లెన్స్‌తో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌ను కలిగి ఉంది. కెమెరా సెటప్‌లో అల్ట్రా-వైడ్ షూటర్ & డెప్త్ సెన్సార్‌గా 8-మెగాపిక్సెల్ మరియు 2-మెగాపిక్సెల్ మాక్రో షూటర్ కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో చాట్ కోసం ఫోన్ ముందు భాగంలో f/2.2 లెన్స్‌తో 16-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470