Home
News

6000mAh బ్యాటరీ, 8GB ర్యామ్‌ స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.3000 తగ్గింపు.. స్పెసిఫికేషన్లు, సేల్‌ వివరాలు

మోటో G54 5G స్మార్ట్‌ఫోన్‌ (Moto G54 5G) గత సంవత్సరం సెప్టెంబర్‌లో భారత్‌లో లాంచ్ అయింది. విడుదల సమయంలో ఈ హ్యాండ్‌సెట్ ధర రూ.15,999గా ఉంది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్ ధరను రూ.3000 తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మోటో G54 5G స్మార్ట్‌ఫోన్‌ 120Hz రిఫ్రెష్‌ రేట్‌తో 6.5 అంగుళాల పుల్‌ HD+ డిస్‌ప్లే రేట్‌ను కలిగి ఉంటుంది. మరియు 6000mAh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది.

మోటో G54 5G స్మార్ట్‌ఫోన్‌ విడుదల నాటి ధర : గత సంవత్సరం సెప్టెంబర్‌లో మోటో G54 5G స్మార్ట్‌ఫోన్‌ ( Moto G54 5G smartphone price cut ) విడుదల అయింది. 8GB ర్యామ్ + 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌ రూ.15,999గా ఉంది. అదే 12GB ర్యామ్ + 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.18,999 గా ఉండేది.

moto-g54-5g-smartphone-price-cut

మోటో G54 5G స్మార్ట్‌ఫోన్‌ ప్రస్తుత ధర : ప్రస్తుతం మోటోరోలా ఆన్‌లైన్‌ స్టోర్‌ సహా ప్రముఖ ఈ కామర్స్‌ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్‌లో మోటో G54 5G స్మార్ట్‌ ఫోన్‌ బేస్‌ వేరియంట్‌ (8GB ర్యామ్ +128GB) ధర రూ.13999గా ఉంది అదే 12GB ర్యామ్ +256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.15,999గా ఉంది.

మోటో G54 5G స్పెసిఫికేషన్లు : ఈ మోటో హ్యాండ్‌సెట్‌ ఆండ్రాయిడ్‌ 13 ఆధారిత మై UX 5.0 పైన పనిచేస్తుంది. ఆక్టా కోర్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7020 SoC చిప్‌ సెట్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 6.5 అంగుళాల పుల్‌ HD + డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz డైనమిక్‌ రిప్రెష్‌ రేట్‌ మరియు 20:9 ఆస్పెక్ట్‌ రేషియోతో వస్తుంది.

moto-g54-5g-smartphone-price-cut

మోటో G54 5G కెమెరా వివరాలు : మోటో G54 5G స్మార్ట్‌ఫోన్‌ వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. ఆప్టికల్ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌ ( OIS ) ఫీచర్‌తో 50MP ప్రధాన కెమెరా, 8MP అల్ట్రావైడ్‌ యాంగిల్ లెన్స్‌తో వస్తుంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 16MP కెమెరాలను కలిగి ఉంది.

మోటో G54 5G బ్యాటరీ ప్యాక్‌, స్టోరేజీ : ఈ మోటో హ్యాండ్‌సెట్‌ గరిష్ఠంగా 256GB అంతర్గత స్టోరేజీ, 12GB ర్యామ్‌ను కలిగి ఉంటుంది. మైక్రో SD కార్డు ద్వారా గరిష్ఠంగా 1TB వరకు స్టోరేజీని పెంచుకోవచ్చు. 33W టర్బో పవర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 6000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌ డ్యూయల్‌ సిమ్‌ను సపోర్టు చేస్తుంది. IP52 రేటింగ్‌తో వస్తుంది.

moto-g54-5g-smartphone-price-cut

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Moto G54 5G smartphone gets price cut on both variants in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X