Moto G54, G84 స్మార్ట్‌ఫోన్ల వివరాలు లీక్.. డిజైన్, ఫీచర్లు..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ మోటోరోలా త్వరలో మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేయనుంది. Moto G54, G84 ఫోన్లకు సంబంధించి కొన్ని వివరాలు లీక్ అయ్యాయి. ప్రముఖ టిప్‌స్టర్ ఇవాన్ బ్లాస్ ఇందుకు సంబంధించిన కొన్ని ఫోటోలను షేర్ చేశారు.
మోటో G54, G84 స్మార్ట్‌ఫోన్లు డ్యూయల్ రియర్ కెమెరాలను కలిగి ఉంటాయి. ప్రధాన కెమెరా OIS సపోర్టుతో వస్తుంది. లీక్ అయిన ఫోటోలు ఆధారంగా ఈ రెండు ఫోన్లు అద్భుతమైన డిజైన్‌ను కలిగి ఉన్నాయి. మోటో G54 5G స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 128GB, 256GB అంతర్గత స్టోరేజీలతో అందుబాటులో ఉండే అవకాశం ఉంది. మరియు ఈ ఫోన్ 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

లీక్‌లు ఆధారంగా మోటో G54 5G స్మార్ట్‌ఫోన్ బ్లాక్, బ్లూ, గ్రీన్ రంగుల్లో ఉంది. 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.5 అంగుళాల పుల్ HD+ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. మరియు 16MP సెల్ఫీ కెమెరా, OIS ఫీచర్‌తో 50MP ప్రధాన కెమెరాను కలిగి ఉంటుంది. ఇతర కెమెరా వివరాలు తెలియాల్సి ఉంది.
మోటో G84 స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో OLED స్క్రీన్‌ను కలిగి ఉంటుందని సమాచారం. 33W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. మరియు 8GB ర్యామ్, 256GB అంతర్గత స్టోరేజీతో వస్తుందని తెలుస్తోంది. మిగిలిన వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఫోన్ వెనుకవైపు 50MP ప్రైమరీ కెమెరా కలిగి ఉంటుంది.
మరో కెమెరా వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. మరియు LED ప్లాష్‌తో వస్తుంది. ముందువైపు సెంటర్ పంచ్ హోల్‌లో సెల్ఫీ కెమెరా ఉంటుంది. G84 స్మార్ట్‌ఫోన్ బ్లాక్, పాంటోన్ రంగుల్లో కనిపించింది. మోటో G84 5G స్మార్ట్‌ఫోన్ 4GB ర్యామ్ + 128GB అంతర్గత స్టోరేజీ, 8GB ర్యామ్ + 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్లలో అందుబాటులో ఉండే అవకాశం ఉంది.
మోటో G54, G84 స్మార్ట్‌ఫోన్లు సెప్టెంబర్ నెలలో విడుదల అయ్యే అవకాశం ఉంది. అయితే ఈ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, ఇతర వివరాలు సహా విడుదల తేదీపై మోటోరోలా ఎటువంటి ప్రకటన చేయలేదు. విడుదల తేది దగ్గర పడే కొద్ది మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
*ఆగస్టు 1న మోటో G14 స్మార్ట్‌ఫోన్‌ను సంస్థ లాంచ్ చేసింది. ఈ ఫోన్ 6.5 అంగుళాల FHD+ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. భారత్‌లో మోటో G14 స్మార్ట్‌ఫోన్ స్కై బ్లూ, స్టీల్ గ్రే రంగుల్లో లభిస్తుంది. ఈ ఫోన్ ధర రూ.9,999గా ఉంది. మరియు ఆండ్రాయిడ్ 13 ఆపుట్ ఆఫ్ బాక్స్‌లో రన్ అవుతుంది.
ఈ ఫోన్ ఆక్టాకోర్ యూనిసోక్ T616 ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. 3 సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లను అందుకోవచ్చని సంస్థ తెలిపింది. 4GB ర్యామ్, 128GB UFS 2.2 ఇంటర్నల్ స్టోరేజీని కలిగి ఉంది. ఈ ఫోన్ మైక్రో SD, డ్యూయల్ సిమ్ కార్డు స్లా్ట్, 4G VoLTE సపోర్టు, డ్యూయల్ కెమెరా సెటప్‌తో వస్తుంది.
ఈ ఫోన్ 50MP+2MP కెమెరాలను కలిగి ఉంది. ముందువైపు 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. దుమ్ము, స్ల్పాష్ రక్షణ కోసం IP52 రేటింగ్‌తో వస్తుంది. సైడ్ మౌండెట్ ఫింగర్ ఫ్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. తక్కువ ధర 5G ఫోన్ కోసం ప్రయత్నం చేస్తుంటే, ఈ ఫోన్‌ను ఎంపిక చేసుకోవచ్చు.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








