6000mAh బ్యాటరీ, 12GB ర్యామ్ మోటోరోలా స్మార్ట్‌ఫోన్‌పై రూ.3000 తగ్గింపు.. సేల్ వివరాలు..!
మోటోరోలో సంస్థ (Motorola) ఇటీవల తన పాత మోడల్ ధరలను క్రమంగా తగ్గిస్తోంది. ఫలితంగా విక్రయాలను పెంచుకొనే ప్రయత్నం చేస్తోంది. తాజాగా మోటోరోలా సంస్థ భారత్ మార్కెట్‌లో మోటో G54 స్మార్ట్ ఫోన్‌ను ( Moto G54 Smartphone Price cut 2024 ) లాంచ్ చేసింది. తాజాగా ఈ ఫోన్ ధరను తగ్గింపు నిర్ణయం తీసుకుంది. ఈ హ్యాండ్ సెట్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది.
మోటో G54 స్మార్ట్ ఫోన్‌ను మూడు రంగుల్లో లభిస్తుంది : గత సంవత్సరం సెప్టెంబర్‌లో భారత్ మార్కెట్‌లో మోటోరోలా ఈ మోటో G54 స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ ఫోన్ పుల్ HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది మరియు మీడియాటెక్ డైమెన్సిటీ చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్ సెట్ మింట్ గ్రీన్, మిడ్‌నైట్ బ్లూ, పెరల్ బ్లూ రంగుల్లో కొనుగోలు చేయవచ్చు.

గరిష్ఠంగా రూ.3000 తగ్గింపు : మోటో G54 స్మార్ట్ ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్‌పై రూ.2000 మరియు 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్‌పై రూ.3000 తగ్గించింది. ఫలితంగా 128GB స్టోరేజీ వేరియంట్ రూ.13,999 గా ఉంది. మరియు 256GB స్టోరేజీ వేరియంట్ రూ.15,999 గా ఉంది.
మోటో G54 5G స్పెసిఫికేషన్లు : ఈ మోటో హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత మై UX 5.0 పైన పనిచేస్తుంది. ఆక్టా కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7020 SoC చిప్‌సెట్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.5 అంగుళాల పుల్ HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz డైనమిక్ రిప్రెష్ రేట్ మరియు 20:9 ఆస్పెక్ట్ రేషియోతో వస్తుంది.
మోటో G54 5G కెమెరా వివరాలు : మోటో G54 5G స్మార్ట్ ఫోన్ వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంటుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ( OIS ) ఫీచర్‌తో 50MP ప్రధాన కెమెరా, 8MP అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్‌తో వస్తుంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 16MP కెమెరాలను కలిగి ఉంది.
మోటో G54 5G బ్యాటరీ స్పెసిఫికేషన్లు : ఈ మోటో హ్యాండ్ సెట్ గరిష్ఠంగా 256GB అంతర్గత స్టోరేజీ, 12GB ర్యామ్‌ను కలిగి ఉంటుంది. మైక్రో SD కార్డు ద్వారా 1TB వరకు స్టోరేజీని పెంచుకోవచ్చు. 33W టర్బో పవర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ ఫోన్ డ్యూయల్ సిమ్‌ను సపోర్టు చేస్తుంది. IP52 రేటింగ్‌తో వస్తుంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








