అమెజాన్ ఇండియాలో మోటో G5S, G5Sప్లస్ పై భారీ డిస్కౌంట్ !

By Madhavi Lagishetty
|

మోటొ స్మార్ట్ ఫోన్లపై ధరలు తగ్గించింది అమెజాన్ ఇండియా. మోటో G5S, మోటొ G5Sప్లస్ స్మార్ట్ ఫోన్లపై రెండువేల రూపాయల డిస్కౌంట్ ప్రకటించింది .చైనా మొబైల్ దిగ్గజం లెనోవా...ఈ ఏడాది ఆగస్టులో ఇండియాలో మోటో G5S, మోటో G5S ప్లస్ స్మార్ట్ ఫోన్లను రిలీజ్ చేసింది. మోటో జీ సీరిస్ లో ఐదవ తరం ఫోన్ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది.

 
అమెజాన్ ఇండియాలో మోటో G5S, G5Sప్లస్ పై భారీ డిస్కౌంట్  !

అయితే భారత మార్కెట్లో ఈ ఫోన్ల ధరలు వరుసగా మోటో G5S 13,999రూపాయలుగాను, మోటో G5Sప్లస్ స్మార్ట్ ఫోన్ 15,999రూపాయలుగా నిర్ణయించారు. ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ల ధరలు భారీగా తగ్గాయి. అమెజాన్ ఇండియాలో 2వేల రూపాయలను తగ్గించింది. మోటో G5S 11,999రూపాయలు, మోటో G5Sప్లస్ 13,999రూపాయలకు యూజర్లకు అందుబాటులో ఉన్నాయి.

అంతేకాదు రెండువేల రూపాయల తగ్గింపు ధరతోపాటు అమెజాన్ ఇండియా ఈ స్మార్ట్ ఫోన్లపై ఎక్స్ఛేంజ్ ఆఫర్ను కూడా అందిస్తోంది. పాత స్మార్ట్ ఫోన్ను ఎక్స్ఛేంజ్ చేసినట్లయితే...మోటోG5S పైన 9,803డిస్కౌంట్ మరియు మోటో GS5ప్లస్ పై 12,001రూపాయలు డిస్కౌంట్ ను అందిస్తుంది. మోటొ G5S ఫైన్ గోల్డ్, లూనార్ గ్రే కలర్స్ లో ఉండే ఫోన్లపై డిస్కౌంట్ను ప్రకటించారు.

ఇక స్మార్ట్ ఫోన్ల ఫీచర్స్ చూసినట్లయితే...మెటల్ unibody బిల్డ్ కలిగి ఉంటాయి. హై గ్రేడ్ అల్యూమినిలయంతో తయారు చేశారు. మోటోG5S గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ తో వస్తుంది. 5.2అంగుళాల ఫుల్ హెచ్డి 1080పిక్సెల్స్ డిస్ల్పేను కలిగి ఉంటుంది.

3000ఎంఏహెచ్ బ్యాటరీతోపాటు, మైక్రో ఎస్డి కార్డును ఉపయోగించి 128జిబి వరకు విస్తరించుకోవచ్చు. 3జిబి ర్యామ్, 32జిబి స్టోరేజి కెపాసిటి, ఆక్టా కోర్ స్నాప్ డ్రాగెన్ 430 సాక్ జతచేయబడి ఉంటుంది. ఎల్ఈడి ఫ్లాష్ మరియు F/2.0ఎపర్చర్, ఎల్ఈడి ఫ్లాష్ ఒక వైడ్ యాంగిల్ లెన్స్ తో 5మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా,13మెగాపిక్సెల్ రియర్ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి.

యూట్యూబ్ మరచిపోండి, అమెజాన్ ట్యూబ్ వస్తోంది !యూట్యూబ్ మరచిపోండి, అమెజాన్ ట్యూబ్ వస్తోంది !

ఇక మోటో G5S ప్లస్ ఫీచర్లను పరిశీలిస్తే...5.5 అంగుళాల ఫుల్ హెచ్డి డిస్ల్పేతోపాటు 1080పిక్సెల్స్ రిజల్యూషన్ కలిగి ఉంటుంది. ఆక్టాకోర్ స్నాప్ డ్రాగెన్ 625SoC, 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజి, 128జిబి వరకు మెమెరీ కార్డును ఎక్స్ పాండ్ చేసుకునే అవకాశం ఉంటుంది. F/2.0 ఎపర్చరుతో హారిజాంటల్ పొజిషన్లో 13మెగాపిక్సెల్ సెన్సార్లతో డ్యుయల్ కెమెరాలను కలిగి ఉంటుంది. ఫ్రంట్ సెల్ఫీ కోసం వైడ్ యాంగిల్లో 8మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఎల్ఈడి ఫ్లాష్, విస్త్రుత మోడ్తో ఉంటుంది.

ఈ రెండు స్మార్ట్ ఫోన్లు డ్యుయల్ సిమ్ ను సపోర్టు చేస్తాయి. 4జి వోల్ట్, ఒక మైక్రో USB ఛార్జింగ్ పోర్టు, 3.5ఎంఎం ఆడియో జాక్ తో వస్తాయి.

Best Mobiles in India

Read more about:
English summary
Moto G5S and Moto G5S Plus have received a temporary price cut of Rs. 2,000 on Amazon India. The smartphones launched at Rs. 13,999 and Rs. 15,999 in August this year are now available at Rs. 11,999 and Rs. 13,999 respectively after the limited period discount. Furthermore, the online retailer offers exchange offer.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X