Moto G60 మొదటి అమ్మకంలో రూ.1,500 వరకు డిస్కౌంట్ ఆఫర్స్!! మిస్ అవ్వకండి...
మోటరోలా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఇటీవల గత వారంలో ఇండియాలో మోటో G40 ఫ్యూజన్తో పాటు విడుదల అయిన మోటో G60 యొక్క అమ్మకాలు ఈ రోజు అంటే ఏప్రిల్ 27, మంగళవారం మొదటిసారి ఫ్లిప్ కార్ట్ లో మొదలయ్యాయి. 120HZ పంచ్- హోల్ డిజైన్ డిస్ప్లే, 108 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 732 G SoC వంటి ఫీచర్లతో ఫ్లాగ్‌షిప్ విభాగంలో రియల్‌మి 8 ప్రో మరియు శామ్‌సంగ్ గెలాక్సీ M31 లకు పోటీగా విడుదలైన ఈ ఫోన్ గురించి మరిన్ని వివరాలు పూర్తిగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

మోటో G 60 స్మార్ట్‌ఫోన్ ధరలు & సేల్స్ వివరాలు
మోటో G 60 స్మార్ట్‌ఫోన్ ఇండియాలో ఒకే ఒక వేరియంట్‌లో విడుదలైంది. 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్‌లో లభించే మోటో G60 ఫోన్ యొక్క ధర రూ.17,999. ఇది డైనమిక్ గ్రే మరియు ఫ్రాస్టెడ్ షాంపైన్ కలర్ ఆప్షన్లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. మోటో G 60 మొదటి అమ్మకంలో భాగంగా లాంచ్ ఆఫర్‌లలో ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై మరియు ఐసిఐసిఐ డెబిట్ / క్రెడిట్ కార్డ్ EMI లావాదేవీలపై రూ.1,500 వరకు తక్షణ తగ్గింపును పొందవచ్చు. అలాగే ఫ్లిప్‌కార్ట్ ఎక్స్ఛేంజ్ ఆఫర్ మరియు నో-కాస్ట్ EMI ఎంపికలను కూడా అందిస్తున్నది.

మోటో G 60 స్పెసిఫికేషన్స్
మోటో G 60 స్మార్ట్‌ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది ఆండ్రాయిడ్ 11 ఆధారంగా రన్ అవుతుంది. ఈ హ్యాండ్‌సెట్‌లో 120HZ రిఫ్రెష్ రేట్ మరియు హెచ్‌డిఆర్ 10 సపోర్ట్‌తో 6.8-ఇంచ్ ఫుల్-హెచ్‌డి + డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 732 G SoC చిప్ సెట్ ను కలిగి ఉండి 6GB RAM మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో జత చేయబడి వస్తుంది. ఇందులో గల మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా మెమొరీని 1TB వరకు విస్తరించడానికి వీలును కల్పిస్తుంది.

మోటో G 60 స్మార్ట్‌ఫోన్ యొక్క ఆప్టిక్స్ కెమెరా విషయానికొస్తే ఈ ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. ఇందులో f / 1.7 ఎపర్చర్‌తో 108MP ప్రాధమిక సెన్సార్ కెమెరా, 118 డిగ్రీల ఫీల్డ్ వ్యూతో 8MP అల్ట్రా-వైడ్-యాంగిల్ సెన్సార్ మరియు 2MP డెప్త్ సెన్సార్ కెమెరాలు ప్యాక్ చేయబడి ఉన్నాయి. అలాగే సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ఫోన్ ముందు భాగంలో f / 2.2 ఎపర్చర్‌తో 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

మోటో G 60 స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ ఎంపికల విషయానికి వస్తే వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు 4G LTE, వై-ఫై 802.11 AC, బ్లూటూత్ V5.0, జిపిఎస్ / ఎ-జిపిఎస్, ఎన్‌ఎఫ్‌సి, యుఎస్‌బి టైప్-సి, మరియు 3.5mm హెడ్‌ఫోన్ జాక్ వంటివి ఉన్నాయి. బోర్డులోని సెన్సార్లలో యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్ మరియు సామీప్య సెన్సార్ ఉన్నాయి. ఈ ఫోన్ 0W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6000 mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.


Click it and Unblock the Notifications