మోటో G32, G62 5G కొత్త స్మార్ట్‌ఫోన్‌ల లాంచ్ వివరాలు లీక్ అయ్యాయి!! ఫీచర్స్ మీద ఓ లుక్ వేయండి...

|

మోటరోలా స్మార్ట్‌ఫోన్‌ సంస్థ భారతదేశంలో ఆగష్టు నెలలో రెండు స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. అయితే ఈ రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లు వేరు వేరు రోజులలో లాంచ్ కానున్నాయి. మొదటిది మోటో G32 ఫోన్ ఆగష్టు 9న భారతదేశంలో లాంచ్ కావడానికి సిద్ధంగా ఉంది. అధికారిక ప్రకటనకు ముందు దేశంలో మోటో G32 ఫోన్ యొక్క ధరల వివరాలు ఆన్‌లైన్‌లో అందించబడ్డాయి. ఇది మిడ్-రేంజ్ ఆఫర్‌గా లాంచ్ కానున్నట్లు అందరు కూడా భావిస్తున్నారు.

 

మోటో G-సిరీస్

మోటరోలా సంస్థ మోటో G-సిరీస్ విభాగంలో తీసుకొనివస్తున్న మరొక ఫోన్ మోటో G62 5G. దీనిని ఆగస్టు 11న భారతదేశంలో విడుదల చేయనున్నట్లు కంపెనీ అధికారికంగా తెలిసింది. లాంచ్ కి ముందే మోటో G62 5G ఫోన్ యొక్క ధరల వివరాలను లీక్ చేసింది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 480 ప్లస్ SoC ద్వారా రన్ అయ్యే ఈ హ్యాండ్‌సెట్ మే నెలలో బ్రెజిల్‌లో ప్రపంచవ్యాప్తంగా లాంచ్ అయింది. టిప్‌స్టర్ యోగేష్ బ్రార్ (@heyitsyogesh) MySmartPriceతో కలిసి మోటో G32 మరియు మోటో G62 5G యొక్క ఇండియా లాంచ్ తేదీ మరియు భారతదేశ ధరల వివరాలను సూచించారు. మోటరోలా మోటో G62 5Gని ఆగస్టు 11న విడుదల చేయనున్నట్లు నివేదిక సూచిస్తుంది. వీటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

మోటో G32, G62 స్మార్ట్‌ఫోన్‌ల ధరల వివరాలు

మోటో G32, G62 స్మార్ట్‌ఫోన్‌ల ధరల వివరాలు

ప్రస్తుతం అందుబాటులో ఉన్న లీక్ ల ప్రకారం మోటో G32 ఇండియాలో రెండు వేరియంట్ లలో రూ.11,000 మరియు రూ.13,000 ధరల వద్ద లాంచ్ కానున్నట్లు సమాచారం. అలాగే మోటో G62 5G ఫోన్ యొక్క బేస్ మోడల్ ధర రూ.15000 ధర వద్ద ఉండవచ్చు. అలాగే మరొక వేరియంట్ యొక్క ధర రూ.17,000 గా ఉండే అవకాశం ఉంది. అయితే భారతీయ వేరియంట్‌ల కలర్ ఎంపికలు మరియు RAM మరియు స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌ల వివరాలు ప్రస్తుతానికి తెలియవు.

మోటో G32, G62 లీక్ ల వివరాలు
 

మోటో G32, G62 లీక్ ల వివరాలు

మోటో G32 బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ ఆగస్టు 9న భారతదేశంలో లాంచ్ అవుతుందని ధృవీకరించబడింది. ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయడానికి Flipkart ద్వారా అందుబాటులో ఉంటుంది. అయితే మోటో G62 5G యొక్క ఖచ్చితమైన విడుదల తేదీని మోటరోలా బ్రాండ్ ఇంకా వెల్లడించనప్పటికీ కొన్ని లీక్ లు ఆగస్టు 11న లాంచ్ చేయనున్నట్లు సూచిస్తున్నాయి. రాబోయే రోజుల్లో వెబ్‌లో కొన్ని వివరాలు వెలువడతాయని మేము ఆశించవచ్చు.

మోటో G32 స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్స్

మోటో G32 స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్స్

మోటో G32 స్మార్ట్‌ఫోన్‌ జూలై నెలలో యూరోపియన్ మార్కెట్‌లలో మొదటిసారి ఆవిష్కరించబడింది. దాని యొక్క స్పెసిఫికేషన్స్ వివరాల విషయానికి వస్తే ఇది 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5-అంగుళాల ఫుల్-HD+ LCD స్క్రీన్‌ను 1,080x2,400 పిక్సెల్‌ల పరిమాణంలో కలిగి ఉంది. ఇది స్నాప్‌డ్రాగన్ 680 SoC ద్వారా రన్ అవుతూ గరిష్టంగా 4GB RAM మరియు 128GB ఇంటిగ్రేటెడ్ స్టోరేజ్ తో జతచేయబడి వస్తుంది. ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోన్ వెనుక భాగంలో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ మరియు సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం 16-మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ వంటివి ఉన్నాయి. ఫేస్ అన్‌లాక్ ఫీచర్ మరియు సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వంటి ఇతర ఫీచర్లు ఉన్నాయి. అదనంగా ఇది 30W TurboPower ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి మద్దతుతో 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.

మోటో G62 స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్స్

మోటో G62 స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్స్

Moto G62 5G స్మార్ట్‌ఫోన్‌ మే నెలలో బ్రెజిల్‌లో లాంచ్ అయింది. దీని యొక్క సమాచారం ప్రకారం ఇది ఆండ్రాయిడ్ 12 తో రన్ అవుతూ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5-అంగుళాల ఫుల్-HD+ IPS డిస్‌ప్లేను 1,080x2,400 పిక్సెల్‌ల పరిమాణంలో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 480 ప్లస్ SoC, Adreno 619 GPU ద్వారా రన్ అవుతూ 4GB RAMతో జతచేయబడి లభిస్తుంది. మోటో G62 5G కూడా 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ నేతృత్వంలోని ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. అలాగే ఫోన్ ముందు భాగంలో 16-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంది. అలాగే ఇది 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ను అందిస్తుంది మరియు సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ప్యాక్ చేస్తుంది. ఇది 20W టర్బోపవర్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 5,000mAh బ్యాటరీతో మద్దతు ఇస్తుంది.

మోటో G82 5G & మోటో G42 ధరల వివరాలు

మోటో G82 5G & మోటో G42 ధరల వివరాలు

భారతదేశంలో మోటరోలా సంస్థ జులై నెలలో లాంచ్ చేసిన కొత్త స్మార్ట్‌ఫోన్లలో మోటో G82 5G మరియు మోటో G42 ఉన్నాయి. ఇందులో మోటో G82 5G ఇండియాలో రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో 6GB RAM + 128GB స్టోరేజ్ బేస్ వేరియంట్ యొక్క ధర రూ.21,499 కాగా 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌ మోడల్ రూ.22,999 ధర వద్ద మెటోరైట్ గ్రే మరియు వైట్ లిల్లీ వంటి కలర్ ఎంపికలలో లభిస్తుంది. అలాగే మోటో G42 స్మార్ట్‌ఫోన్ కేవలం ఒకే ఒక వేరియంట్లో లాంచ్ అయింది. 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ వేరియంట్ వద్ద లభించే ఈ మోడల్ యొక్క ధర రూ.13,999. ఇది అట్లాంటిక్ గ్రీన్ మరియు మెటాలిక్ రోస్ వంటి రెండు కలర్ ఎంపికలలో లభిస్తుంది.

Best Mobiles in India

English summary
Moto G62 5G, Moto G32 Smartphones India Launch Date and Specifications Details Leaked

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X